News


ఆర్‌బీఐ పాలసీపై నిపుణుల స్పందన

Thursday 8th August 2019
news_main1565241275.png-27624

  • రేట్ల తగ్గింపు వృద్ధికి తోడ్పాటు

ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం అసాధారణమైనదని బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపే కొనసాగిస్తూ, వృద్ధికి మద్దతు ఇవ్వడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. అయితే, ఇది మాత్రమే చాలదని, వినియోగాన్ని, పెట్టుబడులను పెంచేందుకు మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. 

రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లను తగ్గించడం అసాధారణమే. మార్కెట్లు ఊహించని విధంగా ఆశ్చర్యపరిచే రీతిలో మానిటరీ పాలసీ పనిచేస్తుందని ఇది తెలియజేస్తోంది. 2019-20కు వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించినప్పటికీ, వృద్ధి క్షీణతను అడ్డుకునేందుకు ఎన్నో చర్యలను ఆవిష్కరించింది. రోజులో 24 గంటలూ ఎన్‌ఈఎఫ్‌టీని అందుబాటులోకి తీసుకురావడం రిటైల్‌ చెల్లింపులను పెంచుతుంది.
- రజనీష్‌ కుమార్‌, ఎస్‌బీఐ చైర్మన్‌

అసాధారణ ద్రవ్య సడలింపు ఆరంభమైంది. సాధారణంగా 25 బేసిస్‌ పాయింట్లు, దాని మల్టిపుల్‌లో ఉండడానికి భిన్నంగా రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించారు. 2020 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు తగ్గే రిస్క్‌ ఉందని ఎంపీసీ అంచనా వేసింది.
- శుభదారావు, యస్‌ బ్యాంకు చీఫ్‌ ఎకనమిస్ట్‌

వృద్ధికి తోడ్పాటునిచ్చేందుకు అన్ని రకాల సర్దుబాటుతో కూడిన పాలసీ కార్యాచరణ ఇది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు సులభంగా మారుతుండడం, అంతర్జాతీయ వృద్ధి మందగమనం, వాణిజ్య యుద్ధాల పరిస్థితులు, ఎగుమతులు, దిగుమతుల క్షీణత, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్‌ తగ్గుతున్న పరిస్థితుల్లో సెంట్రల్‌ బ్యాంకు మానిటరీ పాలసీ ద్వారా సరైన చర్యలను ప్రకటించింది. వినియోగం, పెట్టుబడులను పెంచేందుకు తదుపరి చర్యలు ఇప్పుడు అవసరం. 
- శాంతి ఎకాంబరం, కోటక్‌ మహీంద్రా బ్యాంకు కన్జ్యూమర్‌ బ్యాంకింగ్‌ ప్రెసిడెంట్‌

అసాధారణ రీతిలో 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించడం అన్నది ఆర్థిక మందగమనం విస్తృతంగా ఉందన్న దానికి స్పష్టమైన సంకేతం. ఎంపీసీ చీఫ్‌ మాటల్లోనూ ఇదే వ్యక్తమైంది. వ్యవస్థలో నికర డిమాండ్‌, సకాలంలో చెల్లింపుల బాధ్యతలకు (ఎన్‌డీటీఎల్‌) ఒక శాతం అధికంగానే లిక్విడిటీ ఉన్నందున... బ్యాంకులు రుణ రేట్లపై తగ్గింపు ప్రయోజనాన్ని బదలాయించడంపై ఇప్పుడిక దృష్టి సారించాల్సి ఉంది. 
- ఆదితి నాయర్‌, ఇక్రా ప్రిన్సిపల్‌ ఎకనమిస్ట్‌

ద్రవ్యోల్బణం విషయంలో ఆర్‌బీఐ ఇప్పటికీ ఆశావహంగానే ఉంది. 2021 మొదటి త్రైమాసికం వరకు 4 శాతం లోపే ఉంటుందని అంచనా వేస్తోంది. ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాల లభ్యత పెంచడం, ఎన్‌బీఎఫ్‌సీ ద్వారా కొన్ని రంగాలకు రుణాలను ప్రాధాన్య రంగ రుణ వితరణగా గుర్తించడం ఆహ్వానించతగినవి.
- బి ప్రసన్న, ఐసీఐసీఐ బ్యాంకు గ్లోబల్‌ మార్కెట్స్‌ హెడ్‌ 

ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలకు ద్వారాలను తెరవడం వాహన, రియల్‌ ఎస్టేట్‌పై వినియోగ డిమాండ్‌ను పెంచుతుంది. రేట్ల కోత సత్వరమే బదిలీ చేసేందుకు బ్యాంకులను ప్రోత్సహిస్తుందని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిర రంగ వృద్ధి పెంపు దిశగా పాలసీ స్పష్టంగా దృష్టి పెట్టింది. ఆర్థిక రంగంలో పెట్టుబడుల డిమాండ్‌, రుణ వాతావరణం మెరుగుపడుతుంది.
- జార్డ్‌ అలెగ్జాండర్‌ ముత్తూట్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఎండీ

నేటి రేట్ల తగ్గింపుతో ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు 110 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించినట్టయింది. కేంద్ర బ్యాంకు లిక్విడిటీని కూడా మిగులుగానే కొనసాగించింది. తగ్గిన పాలసీ రేట్లను వేగంగా బదిలీ చేయడం బ్యాంకులకు కీలకం. రేట్ల తగ్గింపును పూర్తి స్థాయిలో బదిలీ చేయకపోతే పెట్టుబడులు, వినియోగ డిమాండ్‌లో మార్పు ఉండదు.
- సందీప్‌ సోమాని, ఫిక్కీ ప్రెసిడెంట్‌

రెపో రేటు తగ్గింపు అన్నది వినియోగాన్ని, తయారీదారుల పోటీతత్వాన్ని (నిధుల వ్యయాలు తగ్గడం ద్వారా) పెంచుతుంది. అయితే ఈ ప్రయోజనాలు సిద్ధించాలంటే ప్రస్తుతం రేట్ల కోతను బ్యాంకులు పూర్తి స్తాయిలో బదిలీ చేయాల్సి ఉంటుంది.
- రాజీవ్‌ తల్వార్‌, పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ 

ఆర్‌బీఐ చర్య నిర్మాణాత్మకమైనది. వరుసగా నాలుగో విడత రేట్ల తగ్గింపుతో హౌసింగ్‌ డిమాండ్‌ కొంత మేర పెరుగుతుందని భావిస్తున్నాం. రేట్ల తగ్గింపు అన్నది గృహ రుణాలు, ఆటో రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గేలా చేస్తుంది. బ్యాంకింగ్‌ రంగంలో రుణ వృద్ధికి కూడా తోడ్పడుతుంది.
- మనోజ్‌ గౌర్‌, క్రెడాయ్‌ చైర్మన్‌ You may be interested

లాభాల్లో ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు..

Thursday 8th August 2019

ఆర్‌బీఐ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించడంతో గురువారం ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.34 సమయానికి, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.35 శాతం పెరిగి 2,592.85 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) 2.65 శాతం, బ్యాంక్‌ ఇండియా 2.32 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.15 శాతం, కెనరా బ్యాంక్‌ 1.44 శాతం, ఎస్‌బీఐ 1.03 శాతం,

రుణాలు ఇక పండగే..!

Thursday 8th August 2019

7 శాతం నుంచి 6.9 శాతానికి జీడీపీ అంచనాలు తగ్గింపు వరుసగా నాలుగో విడత రెపో రేటుకు కోత 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్‌బీఐ 5.4 శాతానికి దిగొచ్చిన రెపో రేటు 5.15 శాతానికి రివర్స్‌ రెపో రేటు సర్దుబాటు ధోరణి కొనసాగింపు డిమాండ్‌, పెట్టుడులు పెంచడమే ప్రాధాన్యం: ఎంపీసీ ముంబై: క్షీణిస్తున్న దేశ ఆర్థిక వృద్ధి, పడిపోతున్న డిమాండ్‌ ఆర్‌బీఐనీ ఆందోళనకు గురిచేస్తోంది..! బుధవారం వెల్లడైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్ష నిర్ణయాల్లో ఇదే తేటతెల్లమైంది.

Most from this category