News


నిత్యావసర వస్తువుల తయారీకి ఆటంకం వద్దు: ప్రధాని మోదీ

Tuesday 24th March 2020
news_main1585021140.png-32648

  • ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలి
  • పారిశ్రామికవేత్తలకు ప్రధాని సూచనలు

న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాల్లేకుండా చూడాలని పారిశ్రామికవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కరోనా వైరస్‌ నియంత్రణ కార్యాచరణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. టెక్నాలజీ సాయంతో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించాలని కోరారు. ‘‘ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కొంత కాలం పాటు ఉంటుంది. వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడే ఈ సమయంలో ఉద్యోగులను తగ్గించుకోకుండా మానవీయంగా వ్యవహరించాలి. ఆర్థిక వృద్ధికి ప్రేరణనిచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అనూహ్యంగా కోవిడ్‌-19 మహమ్మారి ఎదురైంది. ప్రపంచ యుద్ధ సమయాల్లో కంటే ఎంతో పెద్ద ఎత్తున ఇది సవాళ్లను విసురుతోంది’’ అని ప్రధాని పారిశ్రామికవేత్తలతో అన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక వ్యవస్థ మూలస్తంభం విశ్వాసమేనని ప్రధాని వారికి గుర్తు చేశారు. పలు రంగాల్లో ఈ విశ్వాసం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. పర్యాటకం, నిర్మాణం, ఆతిథ్యం, రోజువారీ జీవనంతో ముడిపడిన అసంఘటిత రంగంపై కోవిడ్‌ ప్రభావం ఎక్కువగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. అసోచామ్‌, ఫిక్కి, సీఐఐ, 18 రాష్ట్రాల నుంచి స్థానిక వాణిజ్య మండళ్ల ప్రతినిధులు ప్రధానితో సమావేశంలో పాల్గొన్నారు.
ద్రవ్యలోటును సడలించాలి: ఫిక్కి 
ప్రభుత్వం ద్రవ్యలోటు గురించి ఆందోళన చెందకుండా, లక్ష్యాన్ని 2 శాతం పెంచాలని, తద్వారా వ్యవస్థలో రూ.4 లక్షల కోట్ల ద్రవ్య లభ్యత ఏర్పడుతుందని ఫిక్కి ప్రధానికి సూచించింది. జీడీపీలో ద్రవ్యలోటును 3.8 శాతానికి కట్టడి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. 
లాభాపేక్ష లేకుండా పనిచేస్తాం: సీఐఐ
కోవిడ్‌-19పై పోరాటంలో నిత్యావసరాలు, వెంటిలేటర్లు, శానిటైజర్లు, నిత్యావసర ఔషధాలను తయారీని పెంచేందుకు తమ ప్లాంట్లను కేటాయిస్తామని, లాభాపేక్ష లేకుండా పనిచేస్తామని సీఐఐ అభయమిచ్చింది. ప్రజా సేవ కోసం వలంటీర్లను కూడా సమకూరుస్తామని తెలిపింది. You may be interested

రూపాయికి ‘కోవిడ్‌’ ‍కాటు

Tuesday 24th March 2020

ఒకేరోజు 102 పైసలు పతనం 76.22 వద్ద ముగింపు ఇంట్రాడేలో ఏకంగా 76.30కి బలహీనం ఏ రోజుకారోజు కొత్త కనిష్టాలు... మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ఇదే పరిస్థితి ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం వరుసగా మూడవరోజు ట్రేడింగ్‌ సెషన్‌లోనూ మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి  కిందకుపడిపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే ఏకంగా 102 పైసలు బలహీనపడి 76.22కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు.  ఇంట్రాడేలో రూపాయి విలువ

కోవిడ్‌ నివారణకు యాక్సిస్‌, వేదాంత చెరో రూ.100 కోట్ల ఫండ్‌

Tuesday 24th March 2020

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ యాక్సిస్‌.. కోవిడ్‌–19 నివారణ చర్యలకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు రూ.100 కోట్ల ఫండ్‌ను ఏర్పాటు చేసింది. కస్టమర్లు, ఉద్యోగులు, వర్తకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు మద్దతు ఇవ్వడానికి ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎండీ అండ్‌ సీఈఓ అమితాబ్‌ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్‌ వ్యాప్తికి స్వీయ నియంత్రణే అసలైన మందు అని.. అందుకే బాధ్యత గల

Most from this category