News


చమురు మంటతో భారత్‌కు అనర్థమే..!

Wednesday 18th September 2019
news_main1568792154.png-28405

  • నోమురా హెచ్చరిక
  • ‘మాంద్యం’ తరహా పరిస్థితికి
  • దారితీస్తుందని విశ్లేషణ

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరల తీవ్రత భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యసస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని జపాన్‌ ఫైనాన్షియల్‌ సేవల దిగ్గజ సంస్థ నోమురా విశ్లేషించింది. బలహీన వినియోగ డిమాండ్‌, అధిక చమురు ధరలు భారత్‌ వంటి ఆర్థిక వ్యవస్థలో మాంద్యం తరహా పరిస్థితి (స్టాగ్‌ఫ్లేషన్‌)కి దారితీస్తాయని పేర్కొంది. తన మొత్తంచమురు అవసరాల్లో 70 శాతానికిపైగా దిగుమతులపై భారత్‌ ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.

స్టాగ్‌ఫె‍్లషన్‌ అంటే...
ఈ తరహా పరిస్థితిలో ఒకవైపు ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం.. మరోపక్క తీవ్ర ధరల పెరుగుదలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. వ్యవస్థలో డిమాండ్‌ పూర్తిగా నిలిచిపోతుంది. నిరుద్యోగిత తీవ్ర స్థాయిలో ఉంటుంది.
నోమురా పేర్కొన్న అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి చూస్తే...

  • దేశం నుంచి దిగుమతులు తక్కువగా ఉన్నాయి. అధిక చమురు బిల్లు దేశానికి భారం అవుతుంది. దీనితో కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారక నిధుల మధ్య నికర వ్యత్యాసం) పరిస్థితి ‍తీవ్ర ప్రతికూలత ఎదుర్కొంటుంది. లాభాల విషయంలో ఒత్తిడికి గురయ్యే కంపెనీలు తమకు ఎదురవుతున్న ఆదాయాల సమస్యను ఎదుర్కొనడానికి తమ ఉత్పత్తులపై ధరలను పెంచుతాయి. ఇది ధరల పెరుగుదలకు, ఇది డిమాండ్‌ పడిపోడానికి దారితీస్తుంది.
  • బేరల్‌కు ప్రతి 10 డాలర్ల ధర పెరుగుదలా.. స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును 0.2 శాతం మేర తగ్గిస్తుంది. కరెంట్‌ అకౌంట్‌ లోటు 0.4 శాతం మేర (జీడీపీ)లో పెరుగుతుంది. ద్రవ్యలోటు 0.1 శాతం పెరుగుతుంది. వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం 30 బేసిస్‌ పాయింట్ల మేర (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెరుగుతుంది.
  • ఇక అధిక క్రూడ్‌ ధర  వల్ల డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలహీనపడుతుంది. ప్రతి 5 పైసలు బలహీనత విషయంలో ద్రవ్యోల్బణం 20 బేసిస్‌ పాయింట్లు పెరుగుతుంది.
  • ఆయా పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటును అక్టోబర్‌లో 25 బేసిస్‌ పాయింట్లు, డిసెంబర్‌లో 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ రేటు 5 శాతానికి తగ్గుతుంది.



You may be interested

ఎంఏసీడీలో 36 స్టాకుల బేరిష్‌ సంకేతాలు

Wednesday 18th September 2019

చమురు ఉత్పత్తిని ఈ నెల చివరి నాటికి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించడంతో పాటు యుఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలే నేపథ్యంలో దేశీయ స్టాకులు తిరిగి కోలుకుంటున్నాయి. కానీ విస్తృత మార్కెట్‌లో మాత్రం పాజిటివ్‌ మూమెంటం లేదని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంఏసీడీ (మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌, డైవర్జన్స్‌)సూచీ ఆధారంగా ఎన్‌ఎస్‌ఈలో కేవలం నాలుగు స్టాకులు మాత్రమే టెక్నికల్‌ చార్టులో బలంగా ఉన్నాయని, 36 స్టాకులలో

మూడు వారాల్లో రాబడినిచ్చే 12 షేర్లు

Monday 16th September 2019

  చమురు ధరలు భారీగా పెరగడంతో దేశియ ఈక్విటీ మార్కెట్‌లు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.00 సమయానికి సెన్సెక్స్‌ 250 పాయింట్ల మేర కోల్పోగా, నిఫ్టీ కీలక స్థాయియైన 11,000 కిందకి పడిపోయింది. ‘చమురు, రూపీ-డాలర్‌లలో ఏర్పడే మార్పులు దేశియ మార్కెట్లను తీవ్రంగా ప్రభావం చూపుతాయి. చమురు, డాలర్‌ మారకంలో రూపీ సెషన్‌ ప్రారంభంలో పెరగడంతో దేశియ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి’ అని రిలయన్స్‌ సెక్యురిటీస్‌ తెలిపింది.

Most from this category