News


ఎనిమిది రంగాలూ నెమ్మది

Wednesday 4th September 2019
news_main1567576594.png-28178

  • గ్రూప్‌ వృద్ధి జూలైలో కేవలం 2.1 శాతం

న్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన మౌలిక రంగ పరిశ్రమల వృద్ధి రేటు జూలైలో కేవలం 2.1 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, క్రూడ్‌ ఆయిల్‌, సహజ వాయువు ఉత్పత్తి, రిఫైనరీ ప్రొడక్టుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదుకావడం దీనికి ప్రధాన కారణం. గత ఏడాది జూలైలో ఈ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంది.   మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో 40.27 శాతం వాటా కలిగిన ఈ ఎనిమిది మౌలిక రంగ పరిశ్రమల పనితీరు జూలైలో వేర్వేరుగా...

వృద్ధి అప్‌...1 
ఎరువులు: ఈ రంగంలో ఉత్పత్తి వృద్ధి రేటు స్వల్పంగా 1.3 శాతం నుంచి (2018 జూలై) నుంచి 1.5 శాతానికి పెరుగుదల

వృద్ధి తగ్గినవి.. 3
- స్టీల్‌: 6.9 శాతం నుంచి 6.6 శాతానికి డౌన్‌
- సిమెంట్‌: 11.2 శాతం నుంచి 7.9 శాతానికి పయనం
- విద్యుత్: 6.7 శాతం నుంచి 6.7 శాతానికి తిరోగమనం

క్షీణతలో... 4
బొగ్గు, క్రూడ్‌ ఆయిల్‌, సహజ వాయువు ఉత్పత్తి, రిఫైనరీ ప్రొడక్టుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదయ్యింది.

ఏప్రిల్‌-జూలై మధ్య
ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలం చూసుకుంటే, ఈ ఎనిమిది రంగాల గ్రూప్‌ వృద్ధి రేటు 5.9 శాతం నుంచి 3 శాతానికి పడింది. ఏప్రిల్‌ నుంచీ ఎనిమిది రంగాల వృద్ధి తగ్గుతూనే వస్తోంది. ఏప్రిల్‌లో 5.2 శాతం, మేలో 4.3 శాతం, జూన్‌లో 0.7 శాతం వృద్ధిరేట్లు నమోదయ్యాయి. 

ఆగస్టులో ‘తయారీ’ పేలవం: పీఎంఐ
ఇదిలావుండగా, ఆగస్టు నెలలో తయారీ రంగం పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) పేర్కొంది. జూలైలో  52.5గా ఉన్న ఈ సూచీ ఆగస్టులో 51.4కు పడింది. గడచిన 15 నెలలుగా ఇంత తక్కువ సూచీ ఇదే తొలిసారి. ఉత్పత్తి, అమ్మకాలు తగ్గాయి. ఉపాధి కల్పనపైనా ఈ ప్రభావం పడింది.  అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగానే భావించడం జరుగుతుంది. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ లెక్కన గడచిన 25 నెలలుగా పీఎంఐ 50 పైనే ఉండడం గమనార్హం. 



You may be interested

మారుతీ చిన్న కార్లు ఇక నుంచి సీఎన్‌జీతోనే..

Wednesday 4th September 2019

కొత్త వ్యూహాం వెల్లడి   న్యూఢిల్లీ: దేశీ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) చిన్న కార్ల విషయంలో పెద్ద వ్యూహాన్నే రచించింది. విక్రయాలు గణనీయంగా పడిపోతున్న నేపథ్యంలో మళ్లీ డిమాండ్‌ను పెంచే దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఇక నుంచి కంపెనీ విడుదలచేసే అన్ని చిన్న కార్లు సీఎన్‌జీ(కంప్రెస్డ్‌ నేచురల్ గ్యాస్) మోడల్‌తోనే ఉండనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఈ అంశంపై మాట్లాడిన కంపెనీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ..

జీడీపీ అంచనాలు కట్‌

Wednesday 4th September 2019

కుదించిన  ఆర్థిక సేవల సంస్థలు కోలుకోవడానికి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం రికవరీ బలహీనంగానే ఉండొచ్చని అంచనా న్యూఢిల్లీ: ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను ఆర్థిక సేవల సంస్థలు కుదించాయి. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఫిచ్‌ సొల్యూషన్స్‌.. 6.8 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించగా, సింగపూర్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం డీబీఎస్‌ కూడా 6.8 శాతం నుంచి 6.2 శాతానికి కుదించింది. గత

Most from this category