News


జనవరిలో మౌలిక రంగం వృద్ధి 2.2 శాతం

Saturday 29th February 2020
news_main1582948095.png-32173

న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ వృద్ధి జనవరిలో కొంచెం కోలుకుని 2.2 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఈ గ్రూప్‌ ఏప్రిల్‌-జనవరి మధ్య 0.6 శాతం మాత్రమే వృద్ధిని నమోదుచేసుకుంది. శుక్రవారం విడుదలైన గణాంకాలకు సంబంధించి ఎనిమిది విభాగాలనూ వేర్వేరుగా చూస్తే....

వృద్ధిలో ఐదు
- బొగ్గు పరిశ్రమ ఉత్పత్తి 8 శాతం పెరిగింది. రిఫైనరీ ప్రొడక్టుల్లో వృద్ధి 1.9 శాతం కాగా, విద్యుత్‌ విభాగం 2.8 శాతం వృద్ధిని సాధించాయి. ఇక స్టీ్‌ల్‌ ఉత్పత్తి 2.2 శాతం, సిమెంట్‌ ఉత్పత్తి 5 శాతం పెరిగాయి. 
క్షీణతలో మూడు...
- క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తిలో -5.3 శాతం క్షీణత నమోదయ్యింది. సహజ వాయువుల ఉత్పత్తి సైతం -9.1 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. ఎరువుల విషయంలో క్షీణత (-0.1 శాతం) చోటుచేసుకుంది.  
-  కాగా 2019 జనవరిలో ఈ విభాగం వృద్ధి రేటు 1.5 శాతం మాత్రమే.
 



You may be interested

గెలాక్సీ ఎస్‌10 లైట్‌ @ రూ. 44,999

Saturday 29th February 2020

 512జీబీ వేరియంట్‌ విడుదల గురుగ్రామ్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ శాంసంగ్‌ తన గెలాక్సీ ఎస్‌10 లైట్‌ స్మార్ట్‌ఫోన్‌లో 512జీబీ వేరియంట్‌ను శుక్రవారం భారత మార్కెట్లో విడుదలచేసింది. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాలు (48 మెగాపిక్సెల్ స్టడీ ఓఐఎస్‌, 12ఎంపీ అల్ట్రా-వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సాన్స్‌) ఉండగా, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చింది. 6.7 అంగుళాల పూర్తి హెచ్‌డీ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లే, క్వాల్కమ్

స్థిరత్వం శుభ సంకేతం!

Saturday 29th February 2020

వృద్ధి తీరుపై ఆర్థికమంత్రి భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదుకావడాన్ని ఆర్థిక రంగంలో ‘‘స్థిరత్వం’’గా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. ఆర్థికవ్యవస్థకు ఇది ఒక శుభ సంకేతమనీ విశ్లేషించారు.  సీఎన్‌బీసీ టీవీ 18 బిజినెస్‌ లీడర్‌షిప్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి  ఈ సందర్భంగా మాట్లాడుతూ,  వృద్ధి రేటు మరికొంతకాలం ఇదే స్థాయిలో స్థిరంగా ఉండే వీలుందని పేర్కొన్నారు. కోవిడ్‌-19 గురించి అడిగిన ఒక ప్రశ్నకు

Most from this category