News


6-6.5 శాతానికి జీడీపీ వృద్ధి...ఆర్థిక​ సర్వే

Friday 31st January 2020
Markets_main1580461711.png-31375

ఆర్థిక సర్వే అంచనా
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ 6- 6.5 శాతం మేర వృద్ధి సాధిస్తుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఎకానమీలో వృద్ధి క్షీణత బాటమ్‌ అవుట్‌ అయిందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి 5 శాతం ఉంటుందని సర్వే తెలిపింది. వచ్చే ఏడాది వృద్ది పుంజుకోవాలంటే ప్రభుత్వం సంస్కరణల పథాన్ని బలంగా అనుసరించాలని సూచించింది. సంపద పంచాలంటే ముందు సంపద సృష్టి జరగాలని తెలిపింది. ఉల్లిపాయల్లాంటి కమోడిటీల ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రయోజనం ఇవ్వలేదని తెలిపింది. వృద్ధికి ఊతమివ్వాలంటే ‘‘అసెంబుల్‌ ఇన్‌ ఇండియా ఫర్‌ ద వరల్డ్‌’’ సూత్రాన్ని పాటించాలని, తద్వారా నూతన ఉద్యోగాలను సృష్టించాలని సూచించింది. ఎకానమీకి, మార్కెట్లకు మేలు చేసే పది ఐడియాలను సర్వే సూచించింది.


ఓడరేవుల్లో ఎగుమతులను ప్రమోట్‌ చేసేందుకు రెడ్‌ టేపిజం తొలగించాలని, తద్వారా వ్యాపారానుకూల వాతావరణం సృష్టించాలని తెలిపింది. దీంతో పాటు వ్యాపారం ఆరంభించేందుకు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు, పన్ను చెల్లింపులకు సులువైన మార్గాలను తీసుకురావాలని తెలిపింది. పీఎస్‌బీల్లో పాలన పారదర్శకంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.  వృద్ధి మందగమనం తదితర కారణాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను ఆదాయాలు తగ్గవచ్చని అంచనా వేసింది. వృద్ధిని పట్టాలెక్కించే క్రమంలో ఈ ఏడాదికి విత్తలోటు అంచనాలను సవరించకతప్పదని అభిప్రాయపడింది. 



You may be interested

బడ్జెట్‌పై మార్కెట్‌ 10 అంచనాలివి?!

Friday 31st January 2020

ద్రవ్యలోటును అదుపు చేస్తూనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగానికి పెట్టుబడులను సమకూర్చవలసి ఉంది. మరోపక్క ఆర్థిక మందగమనానికి చెక్‌ పెట్టేందుకు పన్నుల్లో కోత విధించడం ద్వారా వినియోగ రంగానికి జోష్‌నివ్వవలసి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలు, అందుబాటులో హౌసింగ్‌ తదితర చర్యలతోపాటు పలు సంస్కరణలకు తెరతీయవలసి ఉంది. ఈ నేపథ్యంలో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌పై స్టాక్‌ మార్కెట్‌ పలు ఆశలు పెట్టుకున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తు‍న్నారు. వీటిలో ప్రధానంగా 10 అంచనాలను తెలియజేశారు.

డాబర్‌ భళా- బీఈఎల్‌, జేకే టైర్‌ బోర్లా

Friday 31st January 2020

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ డాబర్‌ ఇండియా లాభాల్లో బోర్లాపడిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ నష్టాలలో జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ ఆర్థిక సర్వే, బడ్జెట్‌ నేపథ్యంలో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి  హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో ఓవైపు ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం డాబర్‌ ఇండియా కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. అయితే మరోవైపు

Most from this category