News


ఎఫ్‌పీఐల పెట్టుబడులు మరింత సరళం: ఆర్థిక సర్వే

Thursday 4th July 2019
news_main1562234173.png-26796

ప్రతి ఏడాది ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు రోజు ఆర్థిక శాఖ ఎకనామిక్‌ ఎఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. రేపు బడ్జెట్‌ వెలువడనున్న నేపథ్యంలో ఆర్థిక సర్వే విడుదలయ్యింది. ఇందులోని ముఖ్యమైన అంశాలు..
-స్థిరమైన స్థూల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కేంద్రం 2020 ఆర్థికసంవత్సరపు(ఎఫ్‌వై) జీడీపీ రేటును 7 శాతంగా అంచనా వేసింది.
- ఎఫ్‌వై20లో వ్యవసాయ, అటవి, మత్య్స రంగాల వృద్ధి రేటును 2.9 శాతంగా ఊహించింది.
-ఎఫ్‌వై 2018లో ద్రవ్యలోటు 6.4శాతం ఉండగా దీనిని ఎఫ్‌వై2019లో 5.8 శాతానికి తగ్గించనున్నారు. 
-పెట్టుబడుల పక్రియలో నిలుపుదల ఉండవచ్చు. 
-పెట్టుబడుల రేటు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది.
-ఎన్నికల అనిశ్చితి వలన , ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం వలన జనవరి-మార్చి త్రైమాసికంలో మందగమనం ఏర్పడిందని తెలిపింది.
-స్థిర ప్రభుత్వం ఏర్పడడం, వృద్ధి చెందుతుండడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుంది
-ఎఫ్‌వై20లో వృద్ధి నెమ్మదించడం, జీఎస్‌టీ, వ్యవసాయ పథకాలు వంటి అనేక సమస్యలు ఎదురుకానున్నాయి. 
-కొత్త పథకాలకు నగదును సమకూర్చేందుకు ద్రవ్యలోటుపై రాజీపడవద్దని కేంద్రానికి విన్నపం.
- ఆర్థిక సంవత్సరం 2020లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు జీఎస్‌టీ ముఖ్యమైన పాత్ర పోషించగలదు.
-ఎఫ్‌వై20లో వృద్ధి మందగిస్తే ఆదాయ సమీకరణ తగ్గుతుందని హెచ్చరించింది.
-వాణిజ్య యుద్ధంపై అనిశ్చితి, మందగమనంలో ఉన్న అంతర్జాతీయ వృద్ధి వలన ఎగుమతులు తగ్గవచ్చ.
-ఎఫ్‌పీఐల పై నియంత్రణలను మరింతగా సరళించేందుకు ప్రభుత్వం పాలసీ తీసుకురావచ్చని అంచనా.
-గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి లిక్విడిటీ సమస్య ఉందని ఆర్థిక మంత్రి చెప్పడంతో వడ్డి రేట్లను  రిజర్వు బ్యాంక్‌ తగ్గించే అవకాశం ఉందని అంచనా.
-పెట్టుబడులను ఆకర్షించడంలో దూకుడైన ఎగుమతుల విధానం ఒక భాగంగా ఉండనుంది.
- ఇన్వెస్టమెంట్‌లను నడిపించడానికి ఎస్‌ఎమ్‌ఈలపై దృష్ఠి పెట్టడం అవసరం
- ప్రభుత్వ పాలసీలు అంచనా వేసే విధంగా ఉండడం వలన ఇండియాలో వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే విదేశి పెట్టుబడిదారులు పెరుగుతారని ప్రభుత్వానికి సూచన.You may be interested

52-వారాల గరిష్టానికి యూపీఎల్‌

Thursday 4th July 2019

పంట ర‌క్షణ‌ ఉత్పత్తుల త‌యారీ కంపెనీ యూపీఎల్(యునైటెడ్ పాస్పర‌స్ లిమిటెడ్‌) కంపెనీ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 52-వారాల గరిష్టాన్ని తాకాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.654.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వర్షకాల సీజన్‌తో కంపెనీ కార్యకలాపాలు ఊపందుకుంటాయనే అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈ షేరు ధర 8.30శాతం పెరిగి రూ.705.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఈ ధర షేరు 52-వారాల

టైటాన్‌ రేటింగ్‌ తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Thursday 4th July 2019

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా పెట్‌ షేరుగా పిలువబడే టైటాన్‌ షేర్లపై విదేశీ బ్రోకరేజ్‌ హౌసింగ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. గతంలో తాము కేటాయించిన ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ నుంచి ఈక్విల్‌ వెయిట్‌ రేటింగ్‌కు తగ్గిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అయితే రూ.1300 షేరు కొనుగోలు టార్గెట్‌ ధరను  మాత్రం యథాతథంగా ఉంచుతున్నట్లు తెలిపింది. ధీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ షేర్లు ప్రయోజనకరం. అయితే ప్రస్తుత స్థాయి మించి లాభాలను ఆర్జించడటం తేలికైన

Most from this category