News


వచ్చే ఏడాదే ఆర్థిక రికవరీ: సౌరభ్‌ ముఖర్జియా

Friday 1st November 2019
Markets_main1572548762.png-29266

ఆర్థిక రంగ వృద్ధి బోటమ్‌ అవుట్‌ అయిందన్న సంకేతాలు ఇంకా కనిపించలేదు. కానీ, మార్కెట్లు మాత్రం నూతన గరిష్టాలకు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్‌ ఈ ఏడాది జూన్‌ 4న నమోదు చేసిన 40,312 స్థాయిని గురువారం ట్రేడింగ్‌లో అధిగమించింది. అయితే, ఆర్థిక రంగ రికవరీ అన్నది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఇది ఉండొచ్చని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు సౌరభ్‌ముఖర్జీ చెప్పారు.  

 

‘‘ఆర్థిక రంగ వృద్ధి నిదానించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కంపెనీల ఫలితాలు బలహీనంగానే ఉండనున్నాయి. అయితే, మార్కెట్‌ ఈ బలహీన పలితాలను విస్మరించి, ప్రభుత్వ స్వేచ్ఛా విధానాలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం చేపడుతున్న సంస్కరణలు, వీటిపై మార్కెట్లకు విశ్వాసం ఉన్నంత వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. సంస్కరణల ప్రక్రియ రెండు నెలల క్రితమే ఆరంభమైంది. సంస్కరణలు ఏ విధంగా ఫలితమిస్తాయన్నది చూడాలి. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి పునరుద్ధరణ కానంత వరకు, మార్కెట్‌ వ్యాప్త ర్యాలీ ఉంటుందని చెప్పడం ఎవరికైనా కష్టమే’’ అని సౌరభ్‌ ముఖర్జియా వివరించారు. 

 

ఆటో రంగ స్టాక్స్‌ గురించి మాట్లాడుతూ.. కొన్ని పొజిషన్లు తమకు ఉన్నట్టు చెప్పారు. అది కూడా ద్విచక్ర వాహన కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మాదిరిగా ఆటోరంగ స్టాక్స్‌ను క్రమం తప్పకుండా కొనుగోలు చేయకపోవడానికి కారణం.. ఆరు సంవత్సరాలు మంచిగా ఉంటే, తర్వాతి నాలుగు సంవత్సరాలు ప్రతికూలంగా ఉండడమేనన్నారు. ఇది తమ పోర్ట్‌ఫోలియోకి అస్థిరమని, అందుకే ఆటో రంగంలో నాలుగు వారాల క్రితమే పెట్టుబడులు పెట్టడం ఆరంభించినట్టు చెప్పారు. నాణ్యమైన ద్విచక్ర వాహన కంపెనీలను ఎంచుకున్నట్టు తెలిపారు.  You may be interested

వచ్చే 18 నెలలూ మంచి ర్యాలీ: సంజీవ్‌ భాసిన్‌

Friday 1st November 2019

భారీ ర్యాలీకి ఆరంభంలో మన మార్కెట్‌ ఉందన్నారు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, పెట్టుబడులకు మంచి అవకాశంగా పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఈ మేరకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.   ‘‘నేను చెప్పిన విధంగానే ఈ 12 వారాల్లో (నవంబర్‌ నుంచి) మార్కెట్లో మంచి పెరుగుదల ఉంటుంది. సెన్సెక్స్‌ ఇప్పటికే నూతన గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా నూతన గరిష్టాలకు వెళ్లడం

మార్కెట్‌ ర్యాలీకి కారణాలివే!

Thursday 31st October 2019

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ గురువారం (అక్టోబర్‌ 31) సెషన్‌లో తాజా జీవిత కాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. ఈ ఏడాది జూన్‌ నెలలో 40,312 స్థాయి వద్ద ఏర్పరిచిన జీవిత కాల గరిష్ఠాన్ని సెన్సెక్స్‌ ఈ రోజు సెషన్లో అధిగమించింది. ఇంట్రాడే గరిష్ఠామైన 40,344 వద్ద ఆల్‌టైం గరిష్ఠాన్ని ఏర్పర్చింది. అంతర్జాతీయంగా పాజిటివ్‌ సెంటిమెంట్‌ బలపడడంతోపాటు, కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం‍తో సెప్టెంబర్‌ త్రైమాసికంలో కార్పోరేట్‌ లాభాలు పెరిగాయి. పండుగ సీజన్‌ ప్రభావంతో

Most from this category