News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డిఫాల్ట్‌తో పెరిగిన రిస్క్‌ భయాలు!

Thursday 6th June 2019
news_main1559809031.png-26134

సీఎల్‌ఎస్‌ఏ హెచ్చరిక           
దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు చెందిన కమర్షియల్‌ పేపర్ల రేటింగ్‌ను దేశీయ రేటింగ్‌ ఏజన్సీలు ఇక్రా, క్రిసిల్‌ సంస్థలు ఏ4 నుంచి డిఫాల్ట్‌కు డౌన్‌గ్రేడ్‌ చేశాయి. మంగళవారం కంపెనీ తన ఎన్‌సీడీలపై చెల్లించాల్సిన వడ్డీలను చెల్లించలేకపోయింది. అయితే ఈ ఇబ్బందిని ఎదుర్కొనేందుకు ఫైనాన్షియర్లతో చర్చలు జరుపుతున్నామని, డిఫాల్ట్‌ కాకుండా చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. తమకున్న 7 రోజుల గ్రేస్‌ పిరియడ్‌లోపు సమస్యను పరిష్కరిస్తామని పేర్కొంది. కానీ కంపెనీ తాజా లిక్విడిటీ పరిస్థితి ఇందుకు సహకరించకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీ లిక్విడిటీ స్థితి దిగజారుతున్నందనే డౌన్‌గ్రేడ్‌ చేశామని రేటింగ్‌ ఏజన్సీలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కంపెనీ లిక్విడిటీ ఇబ్బందులు అంటువ్యాధిలాగా వివిధ రంగాలకు వ్యాపించే ప్రమాదం ఉందని దిగ్గజ బ్రోకింగ్‌ కంపెనీ సీఎల్‌ఎస్‌ఏ హెచ్చరించింది. కంపెనీ డిఫాల్ట్‌ అయితే దాదాపు లక్ష కోట్ల రూపాయల రుణాలు రిస్కుల్లో పడతాయని, ఆర్‌బీఐ జోక్యం చేసుకోవాల్సివస్తుందని సీఎల్‌ఎస్‌ఏ వెల్లడించింది. కంపెనీకి రుణాలిచ్చిన సంస్థల్లో బ్యాంకులు, బీమా కంపెనీలు, ఎంఎఫ్‌లు ఉన్నాయి. ఈ లక్ష కోట్ల రూపాయల్లో సుమారు పదిశాతాన్ని కంపెనీ వివిధ పీఎస్‌బీల నుంచి డిపాజిట్ల రూపంలో సమీకరించింది. అందువల్ల కంపెనీ డిఫాల్టయితే అటు బ్యాంకులు, ఇటు ఎంఎఫ్‌లు నష్టాలను మూటకట్టుకోక తప్పదని తెలిపింది. 
భారీగా పతనమైన షేరు
డౌన్‌గ్రేడ్‌ నేపథ్యంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు గురువారం మధ్యాహ్నానానికి 16 శాతం నష్టంతో 94 రూపాయల వద్ద ట్రేడవుతోంది. డిఫాల్టింగ్‌ చెందితే కంపెనీ సమస్య మొత్తం విత్త రంగానికే వ్యాధిలాగా వ్యాపించవచ్చని సీఎల్‌ఎస్‌ఏ తెలిపింది. అందువల్ల ఇన్వెస్టర్లు ఎన్‌బీఎఫ్‌సీలను కాకుండా ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌బ్యాంకు లాంటి బ్యాంకు షేర్లను ఎంచుకోవాలని సూచించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీ సకాలంలో కమర్షియల్‌ పేపర్లకు చెల్లింపులు చేయలేకపోవచ్చని పేర్కొంది. జూన్‌లో కంపెనీకి చెందిన దాదాపు రూ. 750 కోట్ల రూపాయల సీపీలు మెచ్యూరిటీకి ఉన్నాయి. వీటిలో తొలి విడత చెల్లింపులు జూన్‌7న చేయాల్సిఉంది. పేమెంట్‌ చెల్లింపులు మిస్‌ చేయడం ఒకపక్క, రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ మరోపక్క కలిసి మార్కెట్‌ను భయపెడతాయని మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. దీంతో ఎన్‌బీఎఫ్‌సీ స్టాకులు ఒత్తిడికి గురైతాయని పేర్కొంది. బ్యాంకు స్టాకులు సైతం కొంత ఇబ్బందిపడతాయని తెలిపింది. ఇకపై ఎంఎఫ్‌లు ఎన్‌బీఎఫ్‌సీల్లో, హెచ్‌ఎఫ్‌సీల్లో డెట్‌ పెట్టుబడులు పెట్టడం తగ్గుతుందని, దీంతో ఈ షేర్లు మరిన్ని ఇక‍్కట్లు పడతాయని అంచనా వేసింది. 

 



You may be interested

ఐదున్నరేళ్ల కనిష్టానికి డీఎల్‌ఎఫ్‌

Thursday 6th June 2019

ద్రవ్యకొరతతో దివాళ తీసిన డీఎల్‌ఎఫ్ కంపెనీ షేర్లు గురువారం మరో 15శాతం నష్టపోయాయి. ఇటీవల కంపెనీ జారీ చేసిన కమర్షియల్‌ పేపర్లపై రేటింగ్‌ ఏజెన్సీలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ.100.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ఇటీవల విడుదల చేసిన రూ.850 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్లపై ఇక్రా, క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థలు రేటింగ్‌ ‘‘ఎ4’’ నుంచి ‘‘డిఫాల్ట్‌’’కు డౌన్‌గ్రేడ్‌ చేశాయి.

వచ్చే మూడేళ్లూ 7.5 శాతమే

Thursday 6th June 2019

భారత్‌పై మునుపటి అంచనాలకే ప్రపంచబ్యాంకు ఓటు 2021లో చైనా కంటే భారత్‌ 1.5 శాతం ఎక్కువ వృద్ధి వాషింగ్టన్‌: భారత వృద్ధి రేటు విషయంలో తన అంచనాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రపంచబ్యాంకు స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) సహా వచ్చే మూడేళ్లూ భారత జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీంతో 2019-20 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను కొనసాగించినట్టయింది. ఇదే

Most from this category