జన్‌ధన్ ఖాతాల్లో రూ.లక్ష కోట్ల డిపాజిట్లు
By Sakshi

న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఆరంభమైన జన్‌ధన్ యోజన పథకం ఓ రికార్డును చేరుకుంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో సామాన్యుల డిపాజిట్లు రూ.లక్ష కోట్ల మార్కును చేరాయి. జూలై 3 నాటికి ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) కింద 36.06 కోట్ల ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లు రూ.1,00,495.94 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 6 నాటికి ఈ డిపాజిట్లు రూ.99,649.84 కోట్లుగా ఉండగా, క్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. పీఎంజేడీవై పథకాన్ని మోదీ సర్కారు తొలిసారి కేంద్రంలో కొలువు దీరిన సంవత్సరం 2014 ఆగస్ట్ 28న ప్రారంభించిన విషయం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ బ్యాంకు సేవలను అందించడమే దీని ఉద్దేశ్యం. ఇవన్నీ జీరో బ్యాలన్స్ సదుపాయంతో కూడిన బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు. ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డుతోపాటు, బ్యాలన్స్ లేకపోయినా రూ.5 వేల ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. తర్వాత ఓవర్‌డ్రాఫ్ట్‌ను రూ.10వేలకు కూడా పెంచడం జరిగింది. 2019 మార్చి నాటికి సున్నా బ్యాలన్స్ ఉన్న జన్‌ధన్ యోజన ఖాతాలు 5.07 కోట్లు అని ఆర్థిక శాఖ ఇటీవల రాజ్యసభకు తెలియజేయడం గమనార్హం.
You may be interested
స్నేహం, బ్యాంకింగ్ వేర్వేరు
Thursday 11th July 2019బ్యాంకింగ్ విధులకు స్నేహాన్ని దూరంగా పెట్టాలి సహచరులకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆదిత్య పురి సూచన ముంబై: వ్యక్తిగత స్నేహాన్ని బ్యాంకింగ్ విధులకు దూరంగా ఉంచుకోవాలని తన సహచరులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి సూచించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాకు గతంలో రుణ అభ్యర్థనను హెచ్డీఎఫ్సీ బ్యాంకు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘‘ఒక బ్యాంకర్ ఏ వ్యక్తితోనైనా కలసి కాఫీ తాగొచ్చు. ఆ తర్వాత
ప్రభుత్వం చేతికి స్విస్ ఖాతాదారుల వివరాలు
Thursday 11th July 2019సెప్టెంబర్ నుంచి అమల్లోకి న్యూఢిల్లీ/ బెర్న్: నల్లధనంపై కేంద్రం ప్రకటించిన పోరు క్రమంగా ఫలితాలనిస్తోంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారులందరి ఆర్థిక లావాదేవీల వివరాలు సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం చేతికి రానున్నాయి. గత ఏడాదిలో మూసివేసిన ఖాతాల వివరాలు కూడా లభించనున్నాయి. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) విధానం కింద భారత ప్రభుత్వానికి ఈ వివరాలు అందజేయనున్నట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ (ఎఫ్‌డీఎఫ్) వెల్లడించింది. అటు