News


డిపాజిట్లకు ఐదు లక్షల వరకు అభయం

Sunday 2nd February 2020
news_main1580612419.png-31411

  • బ్యాంక్‌ డిపాజిట్లపై బీమా
  • రూ.5 లక్షలకు పెంపు
  • ఇప్పటివరకూ ఇది లక్ష రూపాయలే

న్యూఢిల్లీ: సామాన్య బ్యాంకు డిపాజిటర్లకు భరోసాను కల్పించే తీపి కబురును నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు.  డిపాజిట్లకు మరింత రక్షణ కల్పిస్తూ, వాటిపై బీమాను ఐదు రెట్లు- రూ. 5 లక్షలకు పెంచారు.  వివరాల్లోకి వెళితే...  బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. ప్రస్తుతం డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్‌దారుడికి గరిష్టంగా రూ.లక్ష బీమా సౌలభ్యతను బ్యాంకులు అందిస్తున్నాయి. దీంతో ఏదైనా బ్యాంకు సంక్షోభం పాలై చెల్లింపుల్లో విఫలమైతే... అప్పుడు ఒక్కో డిపాజిట్‌ దారుడికి గరిష్టంగా రూ.లక్ష చొప్పున చెల్లిస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఆర్థికమంత్రి ఐదు లక్షలకు పెంచారు.  ఇటీవలే మహారాష్ట్రకు చెందిన పీఎంసీ బ్యాంకు సంక్షోభం పాలవడంతో ఆ బ్యాంకుల్లో భారీగా డిపాజిట్‌ చేసుకున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. డిపాజిటర్ల ఆగ్రహాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ముంబై వెళ్లిన సందర్భంగా స్వయంగా చవి చూశారు కూడా. ఆర్‌బీఐ సైతం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలు బ్యాంకుల్లో డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని బలంగా చాటాయి. దీంతో కేంద్ర సర్కారు ఈ అవసరాన్ని గుర్తించింది. దీనితో ఆర్థికశాఖ తాజా బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. 

1993 తర్వాత...
చివరిగా 1993 మే1న డిపాజిట్లపై బీమాను సవరించారు. 1992లో జరిగిన సెక్యూరిటీస్‌ స్కామ్‌ దెబ్బకు బ్యాంక్‌ ఆఫ్‌ కరద్‌ మూతపడడం నాడు డిపాజిట్లపై గరిష్ట బీమాగా ఉన్న రూ.30,000 మొత్తాన్ని రూ.లక్షకు పెంచడానికి కారణమైంది. ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం మరో విడత సవరణ అవసరాన్ని గుర్తు చేసింది. అయితే, డిపాజిట్లపై బీమా మొత్తాన్ని పెంచితే బ్యాంకులు చెల్లిస్తున్న ప్రీమియం కూడా పెరుగుతుంది. 2005 నుంచీ ప్రతి రూ.100 డిపాజిట్‌కు ఫ్లాట్‌న 10 పైసల ప్రీమియంను బ్యాంకులు చెల్లిస్తున్నాయి. అంటే లక్షకు రూ.100 ప్రీమియం ప్రస్తుతం ఉందన్నమాట. కాగా, పెరుగుతున్న ప్రీమియం భారాన్ని బ్యాంకింగ్‌ కస్టమర్‌కి బదలాయించే అవకాశం ఉందన​‍్న విశ్లేషణకు వినిపిస్తున్నాయి. 
 

 

  • సేవల వ్యయం పెరుగుతుంది

తాజా నిర్ణయం వల్ల బ్యాంకింగ్‌ సేవల వ్యయం పెరుగుతుంది. ప్రీమియం ఐదు రెట్లు పెరగడం వల్ల బ్యాంకులపై వ్యయ భారం తీవ్రంగానే ఉంటుంది. ఇది కస్టమర్లకు బదలాయించే అవకాశాలే ఉన్నాయి. 
 అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌  You may be interested

ఎల్‌ఐసీ లిస్టింగ్‌- మెగా ఐపీవో

Sunday 2nd February 2020

సౌదీ అరామ్‌ కో తరహా రికార్డులకు చాన్స్‌  లిస్టయితే మార్కెట్‌ విలువలో ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌ వెనక్కి తొలి ఏడాది ప్రీమియం రూ. 1.42 లక్షల కోట్లు కేపిటల్‌ మార్కెట్లో పెట్టుబడుల విలువ రూ. 28.74 లక్షల కోట్లు రూ. 31.11 లక్షల కోట్లను అధిగమించిన ఏయూఎం  ప్రస్తుతం ప్రభుత్వానికి 100 శాతం వాటా కొన్ని దశాబ్దాలుగా బీమాకు మారుపేరుగా నిలుస్తున్న ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. తద్వారా సరికొత్త రికార్డులకు తెరతీయనుంది. దేశీ బీమా రంగంలో 70 శాతం

సెక్షన్‌ 80సీ పొదుపు.. కుదరకపోతే పన్ను..?

Sunday 2nd February 2020

ఇప్పటి వరకు వేతన జీవులు తమ ఆదాయంలో రూ.1.5 లక్షలను సెక్షన్‌ 80సీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసి పన్ను ఆదా పొందుతున్నారు. ఇకపైనా ఈ అవకాశం కొనసాగుతుంది. మరోవైపు రూ.5-7.5 లక్షల మధ్య ఆదాయంపై పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. రూ.7.5-10 లక్షల ఆదాయంపై పన్ను రేటును 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. రూ.10-12.5 లక్షల మధ్య ఆదాయంపై 30 శాతానికి బదులు

Most from this category