News


రేట్ల కోత రుణాల డిమాండ్‌ను పెంచకపోవచ్చు

Wednesday 12th June 2019
news_main1560318950.png-26245

  • బ్యాంకులకు మూలధన నిధుల ఆటంకాలు
  • ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ సమస్యలు
  • దీంతో రుణాల వృద్ధి కష్టమేనని ఫిచ్‌ అంచనా

ముంబై: ఆర్‌బీఐ వరుసగా మూడు సార్లు పావు శాతం చొప్పున మొత్తం 0.75 శాతం రెపో రేట్‌ను తగ్గించినప్పటికీ రుణాలకు వృద్ధి పుంజుకోకపోవచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ అభిప్రాయపడింది. బ్యాంకుల స్థాయిలో మూలధన ఇబ్బందులు, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం తీవ్రతరం కావడాన్ని కారణాలుగా పేర్కొంది. ఈ ఏడాది మూడు సార్లు ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్షలు జరగ్గా, వృద్ధికి ఊతమిచ్చేందుకు గాను మూడు సార్లూ పావు శాతం చొప్పున రేట్లను తగ్గించిన విషయం విదితమే. ‘‘తాజా రేట్ల తగ్గింపు తర్వాత కూడా రుణాల వృద్ధి ఇక ముందూ తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నాం. చాలా బ్యాంకులకు మూలధన నిధుల పరంగా ఇబ్బందులున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు కఠినమైన నిధుల లభ్యత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి’’ అని ఫిచ్‌ తెలిపింది. దేశ మొత్తం రుణ మార్కెట్లో ఐదేళ్ల క్రితం ఎన్‌బీఎఫ్‌సీ రంగం వాటా 15 శాతం కాగా, అదిప్పుడు 20 శాతానికి చేరినట్టు పేర్కొంది. 
నిధులకు కటకట 
‘‘ఎన్‌బీఎఫ్‌సీలకు నిధుల లభ్యత అన్నది మార్కెట్‌ సెంటిమెంట్‌ పరంగా సున్నితమైన అంశం. వీటి వ్యాపార నమూనాలు స్వల్పకాల హోల్‌సేల్‌ ఫండింగ్‌పై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మార్కెట్‌ సెంటిమెంట్‌ ప్రతికూలంగా మారితే లిక్విడిటీ వేగంగా అడుగంటిపోతుంది’’అని ఫిచ్‌ తన నివేదికలో తెలియజేసింది. ఈ విధమైన ఒత్తిళ్ల వల్లే ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు విదేశీ బాండ్‌ మార్కెట్లు సహా ఇతర మార్గాలను ఆశ్రయిస్తున్నట్టు పేర్కొంది. నిధుల లభ్యత తగ్గిపోవడం వల్ల ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి నిధులపై వ్యయాలు పెరిగేందుకు దారితీసినట్టు తెలిపింది. రుణాల వృద్ధి కూడా తగ్గుముఖం పట్టినట్టు తెలిపింది. విస్తృతమైన ఆర్థిక వ్యవస్థలో రుణాల విస్తృతికి ఎన్‌బీఎఫ్‌సీలు కీలకమైన చానల్‌గా ఫిచ్‌ అభివర్ణించింఇ.You may be interested

బ్లాక్‌స్టోన్‌ చేతికి ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

Wednesday 12th June 2019

97.7 శాతం వాటా కొనుగోలు  రూ.2,200 కోట్ల డీల్‌ మరో రూ.800 కోట్లు పెట్టుబడి  న్యూఢిల్లీ: తక్కువ ఆదాయ వర్గాల వారికి గృహరుణాలిచ్చే ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీని బ్లాక్‌స్టోన్‌ సంస్థ కొనుగోలు చేసింది. ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 97.7 శాతం వాటాను రూ.2,200 కోట్లకు కొనుగోలు చేశామని బ్లాక్‌స్టోన్‌ వెల్లడించింది. ఈ కంపెనీ భవిష్యత్తు వృద్ధి కోసం మరో రూ.800 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొంది. ఈ పెట్టుబడుల కారణంగా కంపెనీ నెట్‌వర్త్‌

ఆ నిధిని బ్యాంకులకిస్తే బెటర్‌

Wednesday 12th June 2019

ఆర్‌బీఐ అదనపు నిధులపై బీఆఫ్‌ఏ-ఎంఎల్‌ అభిప్రాయం కేంద్రానికి రూ.3 లక్షల కోట్లు బదలాయించవచ్చని అంచనా ఈ మేరకు జలాన్‌ కమిటీ సిఫారసు ఉంటుందని నివేదిక న్యూఢిల్లీ: భారత్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉన్న అదనపు నిధులను ‘మూలధనం కొరత ఇబ్బందుల్లో ఉన్న’ ప్రభుత్వ రంగ బ్యాంకులకు అందించేలా చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ- బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిలించ్‌ (బీఆఫ్‌ఏ-ఎంఎల్‌)

Most from this category