News


డిజిటల్‌ వేగానికి ‘క్రెడిట్‌ కార్డు’ జోరు

Monday 2nd December 2019
news_main1575225601.png-29984

క్రెడిట్‌ కార్డుల వినియోగం దేశంలో మంచి జోరు మీదున్నది. ఈ ఏడాది మే నాటికి వినియోగంలో ఉన్న కార్డులు 4.89 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలానికి ఈ సంఖ్య 3.86 కోట్లుగానే ఉంది. 27 శాతం వృద్ధి కొత్త వ్యాపార అవకాశాలకు ఊతమిచ్చినట్టుగా చెల్లింపుల పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు పేర్కొంటున్నారు. దేశీయంగా క్రెడిట్‌ కార్డుల వ్యాపారంలో రెండో అతిపెద్ద సంస్థ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ ఐపీవోకు వచ్చేందుకు గత వారం సెబీ వద్ద ఆఫర్‌ పత్రాలను దాఖలు చేసిన నేపథ్యంలో ఈ గణాంకాలు సందర్భోచితంగా ఉంటాయని భావించొచ్చు. 

 

మన మార్కెట్‌ ప్రధానంగా డెబిట్‌ కార్డు వినియోగం ఆధారితంగా ఉంది. వ్యవస్థలో 82.4 కోట్ల డెబిట్‌ కార్డులు చలామణిలో ఉన్నట్టు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఒకవైపు యూపీఐ, మొబైల్‌ వ్యాలెట్ల వంటి డిజిటల్‌ చెల్లింపుల సాధనాలు కూడా వృద్ధి బాటలో ప్రయాణం చేస్తున్నాయి. అయితే, క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరుగుతుండడం.. వ్యవస్థలో రిటైల్‌ రుణ గ్రహీతలు కూడా పెరిగిపోతున్నట్టు సంకేతంగా పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ‘‘ప్రతీ నెలా పది లక్షల మేర కొత్త కార్డులు జారీ అవుతున్నాయి. వినూత్నమైన క్రెడిట్‌ కార్డు యూజర్లు 2.5-3 కోట్ల వరకు ఉంటారు. ఈ మార్కెట్‌ ఎంతో అసాధారణంగా పెరిగిందని ఇది సూచిస్తోంది’’అని యాప్‌ వ్యవస్థాపకుడు ఆర్‌ మధుసూదన్‌ పేర్కొన్నారు. 

 

క్రెడిట్‌ కార్డుల ద్వారా జరిగే లావాదేవీల మొత్తం కూడా పెరుగుతోంది. 2018-19 నాటికి క్రెడిట్‌ కార్డులపై జరిగిన వినియోగం రూ.6 లక్షల కోట్లుగా ఉంది. 2017-18లో ఉన్న రూ.4.6 లక్షల కోట్ల మొత్తంతో పోలిస్తే 30 శాతం పెరిగింది. దేశంలో అగ్రస్థాయి క్రెడిట్‌ కార్డుల సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. ఈ సంస్థ నిర్వహణలో 1.2 కోట్ల క్రెడిట్‌ కార్డులున్నాయి. ఆ తర్వాత 87 లక్షల కార్డులతో ఎస్‌బీఐ రెండో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల మార్కెట్లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘‘వినూత్నమైన, పరిశ్రమలోనే తొలి ఉత్పత్తులు, కోబ్రాండెడ్‌ భాగస్వామ్య కార్డులు, క్యాష్‌ బ్యాక్‌ కార్యక్రమాలు, టెక్నాలజీపై దృష్టి పెట్టినందున మా వృద్ధికి ఢోకా లేదు’’ అని ఎస్‌బీఐ కార్డు సీఈవో హర్‌దయాల్‌ ప్రసాద్‌. You may be interested

5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ‘లోకల్‌’ మంత్ర

Monday 2nd December 2019

దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయి (సుమారు రూ.350 లక్షల కోట్లు)కి తీసుకెళ్లాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఇందుకు 2024ను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, తాజాగా జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఐదేళ్లలో ఇంత భారీ లక్ష్యాన్ని చేరుకోగలమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మంత్రాన్ని అచరణలో పెడితే ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్న అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.    ‘‘బొగ్గు

ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ ఐపీఓ సోమవారమే!

Saturday 30th November 2019

ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ(స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌) ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫ్‌ర్‌(ఐపీఓ) సోమవారం దలాల్‌ స్ట్రీట్‌లోకి రానుంది. ఈ ఎస్‌ఎఫ్‌బీ రూ. 303.75 కోట్ల నిధులను యాంకర్‌ ఇన్వెస్టర్‌ ద్వారా సమీకరించింది. 8,20,94,594 షేర్లను  షేరు రూ. 37 (అప్పర్‌ లిమిట్‌) చొప్పున ఐపీఓ కేటాయింపులను ఖరారు చేసింది. సింగపూర్ ప్రభుత్వం, సీఎక్స్‌ పార్ట్‌నర్స్ ఫండ్ 2, గోల్డ్‌మన్ సాచ్స్ ఇండియా, అబెర్డీన్ స్టాండర్డ్ ఏషియన్ స్మాల్ కంపెనీస్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌

Most from this category