News


రఫేల్‌ కేసులో మోదీ ప్రభుత్వానికి సుప్రీం క్లీన్‌చిట్‌

Thursday 14th November 2019
news_main1573724249.png-29589

రివ్యూ పిటీషన్ల కొట్టివేత
రాఫెల్ కుంభకోణ ఆరోపణలపై ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలయిన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ పై కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈమేరకు సమీక్ష కోరుతూ వచ్చిన పిటిషన్లన్నింటిని కోర్టు తిరస్కరించింది. సుమారు రూ.59,000 కోట్ల విలువైన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను అణచిపెట్టి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై 2018లో సుప్రీం కోర్టు ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అయితే ఆ తీర్పును సవాల్‌ చేస్తూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ శౌరి, యశ్వంత్‌సిన్హా రివ్యూ పిటిషన్‌  దాఖలు చేశారు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా ఈ తీర్పు ప్రకటించింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగాయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన బెంచ్‌ ఈ తీర్పునిచ్చింది. తాజా తీర్పు ప్రభుత్వానికి పెద్ద ఊరటగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇకపై సంస్కరణల విషయంలో ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించవచ్చని అభిప్రాయపడుతున్నారు. కార్పొరేట్‌ వర్గాలు కూడా ఈ తీర్పును స్వాగతించాయి. 



You may be interested

ఫలితాల ఎఫెక్ట్‌:ముత్తూట్‌ ఫైనాన్స్‌ 10శాతం అప్‌

Thursday 14th November 2019

రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో ముత్తూట్‌ షేరు 10శాతం లాభపడింది. కంపెనీ నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం క్యూ2 ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికర లాభం 77 శాతం ఎగసి రూ. 900 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 41 శాతం బలపడి రూ. 1047 కోట్లను తాకింది. కంపెనీ నికర వడ్డీ ఆదాయం 32 శాతం పెరిగి రూ.1,467  కోట్లకు

తర్వాత తరాలకు అద్భుత పోర్టుఫోలియో అందించండి ఇలా!

Thursday 14th November 2019

మీ రాబోయే తరాలకు ఈక్విటీల్లో మంచి సంపదనందించేందుకు రెండు సులభమార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీలయినంత తొందరగా పొదుపును ఆరంభించడం, సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లో క్రమానుగత పెట్టుబడులు మరవకుండా పెట్టడం.. అనే రెండు సూత్రాలు కచ్చితంగా పాటిస్తే తర్వాత తరానికి మంచి సంపదను, అద్భుత పోర్టుఫోలియోను అందించినవారైతారు. కనీసం పది, పదిహేనేళ్లు సిప్‌ను కొనసాగించేలా ప్లాన్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి అవసరాలు పెరుగుతుంటాయి. అందువల్ల పెట్టుబడికి ముందే

Most from this category