News


మౌలిక రంగం కొంచెం రికవరీ...

Saturday 1st February 2020
news_main1580527659.png-31386

  • డిసెంబర్‌లో 1.3 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్‌ డిసెంబర్‌ నెలలో కొంచెం రికవరీ అయ్యింది. 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అంతక్రితం నాలుగు నెలల్లో గ్రూప్‌లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, క్షీణ ఫలితాలు నమోదయ్యాయి. తాజా సమీక్షా నెల డిసెంబర్‌లో బొగ్గు, ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టుల ఉత్పత్తి మెరుగుపడ్డం మొత్తం ఫలితంపై కొంత సానుకూల ప్రభావం చూపింది. స్టీల్‌, సిమెంట్‌ రంగాలు కూడా సానుకూలతలోనే ఉన్నాయి. అయితే క్రూడ్‌ ఆయిల్‌, నేచురల్‌ గ్యాస్‌, విద్యుత్‌ విభాగాల్లో క్షీణతే నమోదయ్యింది. ఇక ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ మధ్య కాలం చూస్తే, వృద్ధిరేటు 4.8 శాతం నుంచి 0.2 శాతానికి మందగించింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్‌ వాటా 40.27 శాతం. డిసెంబర్‌ ఐఐపీ ఫలితాలు ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల అవుతాయి. You may be interested

ఐటీసీ లాభం రూ.4,048 కోట్లు

Saturday 1st February 2020

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీకి ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో రూ.4,048 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.3,137 కోట్లు)తో పోల్చితే 29 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. నికర అమ్మకాలు రూ.12,506 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.13,220 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.8,341 కోట్ల నుంచి 5

2018-19లో వృద్ధి 6.1 శాతమే!

Saturday 1st February 2020

తొలి 6.8 శాతం గణాంకాల సవరణ న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6.1 శాతమేనని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం పేర్కొంది. ఈ మేరకు తొలి 6.8 శాతం గణాంకాలను దిగువముఖంగా సవరించినట్లు వివరించింది. మైనింగ్‌, తయారీ, వ్యవసాయ రంగాల క్షీణత దీనికి ప్రధాన కారణమని ఎన్‌ఎస్‌ఓ పేర్కొంది. విలువ రూపంలో చూస్తే, జీడీపీ రూ.131.75 లక్షల కోట్ల (2017-18)

Most from this category