News


బడ్జెట్‌పై కంపెనీల రియాక్షన్లు!

Saturday 6th July 2019
news_main1562395809.png-26853

ఫార్మాను నిరాశ పరిచింది..
ఆరోగ్య సేవలు, ఔషధ రంగం వృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం నిరాశ పరిచింది. పరిశోధన, అభివృద్ధికి ఊతమిచ్చేలా పన్ను రాయితీలు ఉంటాయని భావించిన పరిశ్రమకు మొండి చేయి ఇచ్చారు. పరిశ్రమ ఆశించినట్టు జరిగితే ఔషధ రంగంలో పరిశోధన, అభివృద్ధితోపాటు ఆవిష్కరణలు మరింత వృద్ధి చెంది ఉండేవి. 
- సతీష్‌ రెడ్డి,
చైర్మన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌.

పన్ను సరళీకరించారు..
స్టార్టప్స్‌కు సరళీకరించిన పన్ను విధానం ప్రోత్సాహకరంగా ఉంది. 25 శాతం కార్పొరేట్‌ ట్యాక్స్‌ పరిధిని రూ.400 కోట్ల వరకు టర్నోవర్‌ కలిగిన కంపెనీలకు పొడిగించడం ఆహ్వానించతగ్గది. నూతన విద్యా విధానం, హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు ఫలితంగా యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యం, అవగాహన లభించేందుకు మార్గం ఏర్పడుతుంది.
- బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి, 
ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, సైయంట్‌.


పన్ను పెంపుపై ఆందోళన లేదు..
దిగుమతి చేసుకున్న స్పి‍్లట్‌ ఎయిర్‌ కండీషనర్లపై సుంకం 10 శాతం నుంచి 20 శాతానికి చేరింది. పన్ను పెరుగుదల గురించి దేశీయ ఏసీల తయారీ పరిశ్రమ ఆందోళన చెందడం లేదు. భారత ఎకానమీ తిరిగి పుంజుకోవాలన్నదే మా ఆశ. ఇది జరిగితే దేశంలో ఉద్యోగావకాశాలు అధికం అవుతాయి. తద్వారా ఏసీల విక్రయాలు మరింత వృద్ధి చెందుతాయి.
బి.త్యాగరాజన్‌,
ఎండీ, బ్లూ స్టార్‌.

 



You may be interested

ఆభరణాల పరిశ్రమకు శరాఘాతం!

Saturday 6th July 2019

దిగుమతి సుంకం 10 నుంచి 12.5 శాతానికి పెంపు బ్లాక్‌ మార్కెటింగ్‌ 30 శాతం  పెరిగుతుందన్న అంచనాలు నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ఆభరణాల పరిశ్రమకు నిరాశనే మిగిల్చింది. దిగుమతి సుంకాన్ని ప్రస్తుత 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. దీనివల్ల ఈ విభాగంలో బ్లాక్‌ మార్కెటింగ్‌ 30 శాతం పెరుగుతుందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో ఆభరణాల ధర మరింత తీవ్రమయ్యే అవకాశమూ ఉంది. దీనితో

ఆరోగ్యానికి ఆయుష్షు

Saturday 6th July 2019

బడ్జెట్‌లో ఆయుష్‌మాన్‌ భారత్‌కు రూ. 6,400 కోట్లు  హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు నిధులు జాతీయ ఆరోగ్య మిషన్‌కు గణనీయంగా నిధులు పెంపు వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా కేటాయింపులు సంప్రదాయ వైద్యానికి 15 శాతం అధిక నిధులు న్యూఢిల్లీ: గత రెండు బడ్జెట్‌లతో పోల్చితే ఈసారి ఆరోగ్య రంగానికి కేంద్రం నిధులు గణనీయంగా పెంచింది. వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా మెడికల్‌ కాలేజీలను నవీకరించేందులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిధులు

Most from this category