News


27ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి

Saturday 19th October 2019
news_main1571458033.png-28991

  • 1992 తరువాత అతి తక్కువ

బీజింగ్‌: చైనా 2019 మూడవ త్రైమాసికంలో (జూలై-సెప్టెంబర్‌) కేవలం 6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 1992 తరువాత ఒక త్రైమాసికంలో ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు ప్రపంచ రెండవ ఆర్థిక వ్యవస్థలో నమోదుకావడం ఇదే తొలిసారని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ పేర్కొంది. పపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకూ మరింత నష్టం వాటిల్లకుండా, అమెరికా-చైనా తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి వచ్చిన కేవలం ఒక్కవారంలోనే తాజా గణాంకాలు వెలువడ్డం గమనార్హం. రెండవ త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 6.2 శాతం. చైనా ఆర్థికవృద్ధి 2019లో 6.1 శాతంగానే ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఇటీవలే అంచనావేసిన సంగతి తెలిసిందే. కాగా 2019 మొదటి మూడు త్రైమాసికాలూ కలిపితే, చైనా ఆర్థిక వృద్ధి రేటు 6.2 శాతంగా ఉంది. విలువలో చూస్తే, ఇది 69.79 ట్రిలియన్‌ యువాన్‌లు. అంటే దాదాపు 9.87 ట్రిలియన్‌ డాలర్లు. 6-6.5 శాతం శ్రేణిలో వృద్ధి నమోదుకావాలన్నది చైనా లక్ష్యం. 



You may be interested

అంచనాలు తగ్గించినా.. భారత్‌దే అగ్రస్థానం

Saturday 19th October 2019

ఐఎంఎఫ్‌ వృద్ధి నివేదికపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వృద్ధి వేగవంతం చేసేందుకు మరిన్ని చర్యలు వాషింగ్టన్‌: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనాలను కుదించినా.. ఇప్పటికీ అత్యంత వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అధిక వృద్ధి సాధన దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోందని ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులకు చెప్పారు.

రిలయన్స్‌ రికార్డ్‌ లాభం రూ.11,262 కోట్లు

Saturday 19th October 2019

-ఈ క్యూ2లో అత్యధిక త్రైమాసిక లాభం  -రిటైల్‌, జియోల జోరుతోనే భారీ లాభాలు  -5 శాతం వృద్ధితో రూ.1,63,754 కోట్లకు ఆదాయం  -ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకి రిలయన్స్‌ షేర్‌  -9 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ !  న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రికార్డ్‌ స్థాయి లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో రూ.9,516 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.11,262 కోట్లకు

Most from this category