News


మూడు దశాబ్దాల కనిష్టస్థాయికి చైనా వృద్ధి రేటు !

Friday 17th January 2020
news_main1579235923.png-30986

బీజింగ్‌:  చైనా వృద్ధి రేటు మూడు దశాబ్దాల కనిష్టస్థాయికి చేరింది.  బలహీనమైన దేశీయ డిమాండ్‌తో పాటు, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో చైనా జీడీపీ వృద్ధి రేటు కనిష్టస్థాయికి పడిపోయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో  2019 సంవత్సరంలో 6.1 శాతం జి.డి.పి వృద్ధిరేటు నమోదైనట్లు చైనా అధికారిక నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాస్టిక్స్‌ (ఎన్‌బీఎస్‌) వెల్లడించింది. ఎన్‌బీఎస్‌ కమిషనర్‌ నింగ్‌ జిజే దీనిపై స్పందిస్తూ... చైనా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా లేకపోవడానికి అనేక కారణాలున్నాయని,  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్య వృద్ధి మందగమనంలో ఉండడాన్ని గమనించాలన్నారు. 



You may be interested

రెండో రోజూ అల్ఫాజియో దూకుడు

Friday 17th January 2020

లాభాల్లో మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ వరుసగా రెండో రోజు ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఏజీఆర్‌ బకాయిలపై టెలికం కంపెనీలు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో బ్యాం‍కింగ్‌ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకోగా.. వొడాఫోన్‌ ఐడియా 30 శాతం కుప్పకూలింది. అయితే ఎయిర్‌టెల్‌తోపాటు.. జియో సేవల మాతృ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్లు బలపడ్డాయి. ఉదయం 10.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 108 పాయింట్లు

అగ్రస్థానానికి జియో

Friday 17th January 2020

36.9 కోట్లకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో.. సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరించింది. దిగ్గజ కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలను వెనక్కి నెట్టి అనతికాంలోనే అగ్రస్థానానికి ఎగబాకింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. గతేడాది నవంబర్‌ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది. ఒక్క నవంబర్‌ నెల్లోనే

Most from this category