News


రిజర్వు రేషియో తగ్గించిన చైనా

Wednesday 1st January 2020
news_main1577876441.png-30595

బ్యాంకుల రిజర్వు రిక్వైర్‌మెంట్‌ రేషియో(ఆర్‌ఆర్‌ఆర్‌)ను 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా(పీబీఓసీ) ప్రకటించింది. జనవరి 6నుంచి ఇది అమల్లోకి రానుంది. తాజా తగ్గింపుతో పెద్దబ్యాంకుల ఆర్‌ఆర్‌ఆర్‌ 12.5 శాతానికి దిగిరానుంది. 2018 నుంచి పీపుల్స్‌ బ్యాంక్‌ 8 మార్లు తగ్గించింది. బ్యాంకులకు మరింత ఫండ్స్‌ అందుబాటులోకి వచ్చేందుకు, లిక్విడిటీ పెంచేందుకు పీబీఓసీ ఈ చర్య చేపట్టింది. త్వరలో చైనా ప్రభుత్వం వృద్ధి పుంజుకునేందుకు మరిన్ని చర్యలు ప్రకటించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ తగ్గింపు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పాజిటివ్‌గా మారుస్తుందని, ఎకానమీకి ఊతమిస్తుందని బీజింగ్‌ ఎకనమిస్టు వెన్‌బిన్‌ చెప్పారు. ఈ నెల్లో పీబీఓసీ నుంచి లోన్‌ ప్రైమ్‌ రేట్‌(ఎల్‌పీఆర్‌) తగ్గింపు ప్రకటన ఉంటుందని అంచనా వేశారు. జనవరిలో చైనాలో లూనార్‌ న్యూఇయర్‌ హాలిడేస్‌ వస్తాయి. ఆ సమయంలో వినియోగదారులకు నగదు కొరత ఉండకుండా ఉండేందుకు పీబీఓసీ రిజర్వ్‌ రేషియో తగ్గించిందన్నారు.

తాజా చర్యతో బ్యాంకులకు దాదాపు 12000 కోట్ల యువాన్స్‌ అందుబాటులోకి వస్తాయని కేంద్ర బ్యాంకు తెలిపింది. ఈ తగ్గింపు బ్యాంకుల వార్షిక ఫండింగ్‌ వ్యయాలను 1500 కోట్ల యువాన్ల మేర తగ్గిస్తుందని తెలిపింది. ఈ తగ్గింపు, ట్రేడ్‌డీల్‌ తొలిదశ ఒప్పందం.. చైనా ఎకానమీపై ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణుల భావన. ఈ ఏడాది పీబీఓసీ మరో 25-30 బీపీఎస్‌ మేర ఆర్‌ఆర్‌ఆర్‌ను తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. కొందరు నిపుణులు మాత్రం ఇలా ఒక్కమారుగా హడావుడిగా పలు ఉద్దీపనలు ప్రకటిస్తే రుణభారాలు పెరిగిపోతాయని, ప్రాపర్టీ మార్కెట్లో కృత్తిమత్వం వస్తుందని హెచ్చరిస్తున్నారు. You may be interested

కొత్త సంవత్సరం కనీసం ఈ ‘3’..

Wednesday 1st January 2020

కొత్త సంవత్సరంలో అయినా ఆర్థికంగా మెరుగ్గా జీవనం ఉండాలని అందరూ ఆకాంక్షిస్తారు. కానీ, ఇందుకోసం ఆచరణ ముఖ్యం. ముఖ్యంగా ప్రతీ కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక తప్పకుండా ఉండాలి. అప్పుడే లక్ష్యాలకు విఘాతం కలగదు. ఆచరణలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు... కనీసం ఈ మూడింటిని అయినా ముందుగా అమలు చేస్తే తర్వాత వేరే అంశాలపై ఫోకస్‌ పెట్టొచ్చు.    అత్యవసర నిధి రోజులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. దేశ జీడీపీ వేగవంతమైన వృద్ధి స్థాయి

యస్‌బ్యాంక్‌ బాండ్ల రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 1st January 2020

యస్‌ బ్యాంక్‌కు చెందిన రూ.21వేల కోట్ల విలువైన బాండ్లపై కేర్‌ రేటింగ్స్‌ సంస్థ నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించింది. ఇటీవల బ్యాంక్‌ నిధుల మూలధన నిధుల సేకరణలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్స్‌, లోయర్‌ టైర్‌-II బాం‍డ్లు, టైర్‌ -II బాండ్లు జారీ ద్వారా మొత్తం రూ.16,430.60 కోట్ల సమీకరించింది. కేర్‌ రేటింగ్‌ సంస్థ ఈ బాండ్ల రేటింగ్‌ను ఎ(+) నుంచి ఎ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ కేటాయించినట్లు

Most from this category