News


కేంద్రం అనూహ్య బొనంజా...కార్పొరేట్‌ పన్ను తగ్గింపు

Friday 20th September 2019
news_main1568960691.png-28451

కేంద్రప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి (అన్ని రకాల సర్‌చార్జీ, సెస్‌ కలిపి) 25.17 శాతానికి తగ్గించి మార్కెట్‌ వర్గాలను శుక్రవారం ఆశ్చర్యపరిచింది. ఈ తాజా ట్యాక్స్‌ రేట్‌ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం(ఏప్రిల్‌ 1) నుంచి పరిగణిస్తారు. కాగా ఈ నిర్ణయం జీఎస్‌టీ సమావేశానికి ముందు వెలువడడం గమనార్హం. శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన అంశాలు..
-2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనను చేర్చారు. ఈ నిబంధన ప్రకారం, ప్రోత్సాహకాలు, రాయితీలు పొందని ఏ దేశీయ కంపెనీ అయినా 22 శాతం ఆదాయపు పన్ను చెల్లించటానికి వీలుంటుంది.
-22 శాతం స్లాబ్‌ను ఎంచుకున్న దేశీయ కంపెనీలు ఎంఏటీ(మినిమమ్‌ ఆల్టర్‌నేట్‌ ట్యాక్స్‌)ను చెల్లించవలసిన అవసరం లేదు.
-ప్రోత్సాహాకాలను, ప్రయోజనాలను పోందే దేశీయ కంపెనీలు చెల్లించే ఎంఏటీని 18 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు.
-అక్టోబర్‌ 1 తర్వాత ఏర్పాటు చేసే తయారి కంపెనీలు 15 శాతం పన్ను స్లాబ్‌ను ఎన్నుకునే అవకాశం. కొత్త తయారి కంపెనీలపై విధించే పన్ను 17.01 శాతంగా (సర్‌చార్జీ, ట్యాక్స్‌ కలిపి) నిర్ణయించారు.
-జూలై 5, 2019 లోపు బైబ్యాక్ ప్రకటించిన లిస్టెడ్ కంపెనీలు, షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేయడంపై ఎటువంటి పన్నును చెల్లించవలసిన అవసరం లేదు.
-ఎఫ్‌పిఐలు కలిగి ఉన్న డెరివేటివ్‌లతో సహా, సెక్యురిటీల అమ్మకంలో పొందే మూలధన లాభాలపై విధిస్తున్న అధిక సర్‌చార్జీ ఇక నుంచి వర్తించదు.
-క్యాపిటల్‌ మార్కెట్లలోకి నిధుల ప్రవాహాన్ని స్థిరీకరించడానికి, ఎస్‌టీటీ(సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌) కి బాధ్యత వహించే ఈక్విటీ అమ్మకం లేదా ఈక్విటీ-ఆధారిత నిధులపై పొందే మూలధన లాభాలపై పెంచిన సర్‌చార్జీ ఇక నుంచి వర్తించదు.
-ప్రభుత్వం, పీఎస్‌యూ అంకురాలు, ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థలు, ఐఐటీలలో సీఎస్‌ఆర్‌(కార్పోరేట్‌ రెస్పాన్సిబిలిటీ ఫండ్‌) 2 శాతాన్ని ఖర్చుపెట్టే అవకాశం.
-"కార్పొరేట్ పన్ను, ఇతర తగ్గింపుల వలన రూ .145,000 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుంది’ అని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ చర్య ఒక ఉత్ర్పేరకం‍గా పనిచేస్తుందని, ఎంఎస్‌ఎంఈ(స్వల్ప, చిన్న, మధ్య తరహా కంపెనీలు) తిరిగి పుంజుకోడానికి సహాయపడుతుందని అన్నారు. 2020 మార్చి 31 వరకు ఎంఎస్‌ఎంఈల ఆస్తులను నిరార్ధక ఆస్తులుగా బ్యాంకులు ప్రకటించవద్దని ఆర్థిక మంత్రి నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 6.50శాతం ర్యాలీ

Friday 20th September 2019

కేంద్రం దేశీయ కంపెనీలపై కార్పోరేట్‌ పన్ను తగ్గింపు ప్రకటనతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ చరిత్రలో ఒకరోజులో అతిపెద్ద లాభాల్ని చవిచూసింది. నేడు ఇండెక్స్‌ 26,878.65 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  దేశీయ కంపెనీలపై ప్రసుత్తం 30 శాతంగా ఉన్న పన్నును 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో అన్నిరంగాల్లో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కార్పోరేట్‌ పన్ను తగ్గింపు ప్రైవేట్‌రంగ బ్యాంక్‌లకు కలిసొస్తుందనే ఆశాభావంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల

కార్పోరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో సెన్సెక్స్‌ 1200 పాయింట్లు హైజంప్‌

Friday 20th September 2019

కార్పోరేట్ పన్ను తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అనూహ్య ప్రకటనతో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో సూచీలు పరుగులు పెడుతున్నాయి. దేశీయ ఆర్థిక మందగమనాన్ని ఉత్తేజపరిచేందుకు కార్పోరేట్ పన్ను రేటును దేశీయ కంపెనీలకు 30 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అన్ని రంగ షేర్లలో విపరీతమైన కొనుగోళ్ల సునామి మొదలైంది. అత్యధికంగా బ్యాంకింగ​రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఉదయం గం.11:20నిల.కు

Most from this category