News


పేమెంట్‌ వ్యవస్థలకు ప్రత్యేక నియంత్రణ అక్కర్లేదు: ఆర్‌బీఐ

Saturday 20th October 2018
news_main1540010395.png-21310

ముంబై: పేమెంట్‌, సెటిల్‌మెంట్‌ చట్టంలో మార్పులకు ప్రభుత్వ ప్యానెల్‌ చేసిన సిఫారసులతో ఆర్‌బీఐ తీవ్రంగా విభేదించింది. పేమెంట్‌ వ్యవస్థల నియంత్రణ కచ్చితంగా ఆర్‌బీఐ పరిధిలోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి చైర్మన్‌గా ప్రభుత్వం ఓ అంతర్గత మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేసింది. పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టం(పీఎస్‌ఎస్‌), 2007కు చేయాల్సిన సిఫారసులతో ఈ కమిటీ ఓ ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. పేమెంట్‌ సంబంధిత అంశాలను పర్యవేక్షించేందుకు ఓ స్వంతంత్ర నియంత్రణ సంస్థ ఉండాలని సూచించింది. ‘‘ఆర్‌బీఐకి బయట పేమెంట్‌ వ్యవస్థల కోసం నియంత్రణ సంస్థ ఉండాల్సిన అవసరమే లేదు’’ అని సంబంధిత ప్రభుత్వ కమిటీకి ఆర్‌బీఐ తన అసమ్మతి నోట్‌ను సమర్పించింది. అయితే, నూతన పీఎస్‌ఎస్‌ బిల్లుకు ఆర్‌బీఐ పూర్తిగా వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ‘‘మార్పులన్నవి ప్రస్తుత వ్యవస్థలను కుదిపివేసే మాదిరిగా ఉండకూడదు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొంది, చక్కగా కొనసాగుతున్న మన దేశ వ్యవస్థల సామర్థా‍్యనికి సమస్యలు సృష్టించేలా ఉండకూడదు’’ అని ఆర్‌బీఐ తన నోట్‌లో పేర్కొంది. You may be interested

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లాభం 11 శాతం అప్‌

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 11 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.225 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.251 కోట్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియమ్‌ ఆదాయం రూ.5,460 కోట్ల నుంచి రూ.7,685 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్‌ 0.1 శాతం

ఎన్‌డీటీవీపై రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కేసు

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇతరులు కలిసి తమకు వ్యతిరేకంగా రూ.10వేల కోట్లకు పరువు నష్టం దావాను దాఖలు చేసినట్లు ఎన్‌డీటీవీ వార్తా సంస్థ తెలియజేసింది. అహ్మదాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో ఇది దాఖలైందని, ఈ మేరకు అక్కడి నుంచి తమకు ఈ నెల 18న నోటీసులు అందాయని ఈ సంస్థ తెలియజేసింది. కంపెనీతోపాటు, ఎగ్జిక్యూటివ్‌ కో చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ ఎడిటర్‌లను బాధ్యులను చేస్తూ ఈ వ్యాజ్యం దాఖలైనట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు

Most from this category