News


ఐదునెలల గరిష్ఠానికి సిమెంట్‌ ధరలు!

Thursday 23rd January 2020
news_main1579763044.png-31132

ఏడునెలల వరుస పతనం తర్వాత జనవరిలో సిమెంట్‌ ధరలు ఒక్కమారుగా ఐదునెలల గరిష్ఠాలకు ఎగిసాయి. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగ కార్యకలాపాలు జోరందుకోవడంతో సిమెంట్‌ ధరలు పెరిగాయి. డిసెంబర్‌తో పోలిస్తే ఆల్‌ఇండియా సగటు సిమెంట్‌ బస్తా ధర రూ.17 పెరిగి రూ. 340కి చేరిందని బ్లూమ్‌బర్గ్‌ క్వింట్‌ సర్వే తేల్చింది. గతేడాది ఏప్రిల్‌ తర్వాత ఒక్క నెల్లో సిమెంట్‌ ధర ఇంత పెరగడం ఇదే తొలిసారి. ధర పెరుగుదల అధికంగా దక్షిణాదిన కనిపించింది. దేశీయ సిమెంట్‌ కంపెనీలు తాజాగా సిమెంట్‌ బస్తా ధరను(50కేజీ) సరాసరిన  రూ. 10 -30 చొప్పున పెంచాయి. దక్షిణ భారతంలో సిమెంట్‌బస్తా ధర రూ. 30 మేర పెరిగింది. నిజానికి ధర రూ. 50 మేర పెరిగినా, రూ. 30పైన పెరుగుదల నిలదొక్కుకోలేకపోయింది. దక్షిణాది తర్వాత ఉత్తరాదిన సిమెంట్‌ బస్తా ధర దాదాపు రూ.20 చొప్పున పెరిగింది. ఢిల్లీ ఎన్నికల తర్వాత ఈ ధర పెరుగుదల వెనక్కువచ్చే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

దేశ తూర్పు ప్రాంతంలో సిమెంట్‌ బస్తా ధర రూ. 10 చొప్పున పెరిగింది. జనవరి రెండో వారంలో మరో పెరుగుదల ఉండాల్సిఉన్నా, డిమాండ్‌ తగ్గడంతో సదరు పెరుగుదల కార్యరూపం దాల్చలేదని సర్వే తెలిపింది. నెలాఖరుకు మరో రూ. 5 వరకు పెరుగుదల ఉండొచ్చన్న అంచనాలున్నాయి. దేశ పశ్చిమ ప్రాంతంలో సిమెంట్‌బస్తా ధర రెండు మార్లు పెరగడంతో మొత్తం పెరుగుదల రూ. 15కు చేరింది. అయితే దేశ మధ్య ప్రాంతంలో మాత్రం సిమెంట్‌ ధరల్లో పెద్దగా మార్పు రాలేదు. రాబోయే రోజుల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని, అందువల్ల సిమెంట్‌ ధరలు మరింత పెరగవచ్చని అంచనాలున్నాయి. అయితే అంతర్జాతీయ మందగమన ప్రభావం కారణంగా కొంతమేర నెగిటివ్‌ ప్రభావం ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు. You may be interested

ప్రస్తుతం ఎలాంటి చెల్లింపులు చేయలేం: ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా

Thursday 23rd January 2020

ఏజీఆర్‌ సవరణ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంత వరకు ఎలాంటి చెల్లింపులు చేయలేమని వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ కంపెనీలు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్‌(డీఓటీ)కు తెలియజేశాయి. టెలికాం కంపెనీల ఈ నిర్ణయంతో జనవరి 23 గడువులోగా ప్రభుత్వానికి ఎటువంటి చెల్లింపులు చేయవనే విషయం స్పష్టమవుతోంది. గతేడాది నవంబర్‌లో సవరించిన ఏజీఆర్‌లపై టెలికాం సంస్థలు జనవరి 23నాటికి డీఓటీకు రూ.1.02 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ అంశంపై రివ్యూ

ఎస్‌ఆర్‌ఎఫ్‌, పాలీకేబ్‌, బాలకృష్ణ -బెస్ట్‌ మిడ్‌ క్యాప్స్‌!?

Thursday 23rd January 2020

టెలికంలో ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో భేష్‌ ఫార్మా రంగంలో బయోకాన్‌, దివీస్‌ లేబ్స్‌కు ఓటు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలున్న కంపెనీలకు చెక్‌ ఇటీవల మార్కెట్లలో ట్రెండ్‌ మారిందంటున్నారు షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెం‍ట్‌ హేమంగ్‌ జానీ. ఎంపిక చేసిన కౌంటర్లు బలపడుతున్నప్పటికీ.. ఇటీవల బ్యాంకులు వెనకడుగు వేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రెండ్‌ అంత ఆశావహంగాలేదంటూ బడ్జెట్‌వరకూ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ర్యాలీ కొనసాగవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూలోని ఇతర పలు అంశాలు ఇలా.. ప్రధానంగా ఫైనాన్షియల్స్‌ ఆధారంగానే

Most from this category