News


నగదు రాజు అయితే.. డిజిటల్‌ దైవం

Tuesday 25th February 2020
news_main1582599973.png-32059

  • ఆర్‌బీఐ సరికొత్త నినాదం

ముంబై: నగదు రాజు అయితే డిజిటల్‌ కరెన్సీ దైవంగా ఆర్‌బీఐ పేర్కొంటోంది. డీమోనిటైజేషన్‌ తర్వాత వ్యవస్థలో రూ.3.5 లక్షల కోట్ల మేర నగదు వినియోగం తగ్గిందన్న ఆర్‌బీఐ, డిజిటల్‌ చెల్లింపులను గొప్ప అనుభవంగా మార్చడమే తన ప్రయత్నమని తెలిపింది. వ్యవస్థలో నగదు చెల్లింపులకు సంబంధించి కచ్చితమైన కొలమానాలు లేవని, డిజిటల్‌ చెల్లింపుల ప్రగతిని మాత్రం కచ్చితంగా లెక్కించొచ్చని పేర్కొంది. గత ఐదేళ్లలో డిజిటల్‌ చెల్లింపులు సంఖ్యా పరంగా వార్షికంగా 61 శాతం, విలువ పరంగా వార్షికంగా 19 శాతం చొప్పున వృద్ది చెందినట్టు తెలిపింది. ఇప్పటికీ నగదు ఆధిపత్యం కొనసాగుతోంది. చెల్లింపులకు బదులు నిల్వ చేసుకునే ఆర్థిక సాధనంగా చూస్తు‍న్నారు’’ అని ఆర్‌బీఐ తెలిపింది. వ్యవస్థలో నోట్ల చలామణి 2014 అక్టోబర్‌ నుంచి 2016 అక్టోబర్‌ మధ్య 14 శాతం చొప్పున పెరిగినట్టు వెల్లడించింది. ఇదే వృద్ధి రేటు ప్రకారం 2019 అక్టోబర్‌ నాటికి చలామణిలో ఉన్న నోట్లు రూ.26,04,953 కోట్లు అని తెలిపింది. డిజిటైజేషన్‌, నగదు వినియోగం తగ్గడం వల్ల చలామణిలో ఉన్న నోట్లు రూ.3.5 లక్షల కోట్ల మేర తగ్గిపోయినట్టు వెల్లడించింది. ‘‘డీమోనిటైజేషన్‌, జీడీపీ చురుకైన వృద్ధి రేటు ఫలితంగా చలామణిలో ఉన్న నగదు 2016-17 నాటికి జీడీపీలో 8.7 శాతానికి తగ్గింది. ఇది తదుపరి 2017-18 నాటికి 10.7 శాతానికి, 2018-19 నాటికి 11.2 శాతానికి పెరిగింది. అయినప్పటికీ డీమోనిటైజేషన్‌కు పూర్వం 2015-16 నాటికి ఉన్న 12.1 శాతం కంటే తక్కువ నగదే చలామణిలో ఉంది’’ అని ఆర్‌బీఐ తెలిపింది. 



You may be interested

ఏజీఆర్‌పై స్వీయ మదింపు వివరాలు ఇవ్వండి

Tuesday 25th February 2020

టెలికం కంపెనీలను కోరిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బకాయిల విషయమై స్వీయ మదింపునకు సంబంధించి వివరాలు ఇవ్వాలని టెలికం కంపెనీలు వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీసర్వీసెస్‌లను టెలికం శాఖ కోరింది. ఏజీఆర్‌ లెక్కలను పరిశీలించేందుకు ఈ ఆధారాలు టెలికం శాఖకు సాయపడతాయని ఓ అధికారి తెలిపారు. 15 టెలికం కంపెనీలు రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్‌ బకాయిలు చెల్లించాలన్నది టెలికం శాఖ డిమాండ్‌. ఇందులో రూ.92,642 కోట్లు

గెయిల్‌ రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడులు

Tuesday 25th February 2020

విస్తరణ పనుల కోసం  వెల్లడించిన కొత్త సీఎమ్‌డీ  న్యూఢిల్లీ: గెయిల్‌ ఇండియా కంపెనీ విస్తరణ కార్యకలాపాల నిమిత్తం ఐదేళ్లలో రూ.1.05 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. గ్యాస్‌ పైప్‌లైన్ల విస్తరణ, నగరాల్లో గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ ఏర్పాటు,  పెట్రో రసాయనాల ఉత్పత్తి సామర్థ్యం పెంపు... వీటి కోసం ఈ పెట్టుబడులు పెట్టనున్నామని గెయిల్‌కు సీఎమ్‌డీగా నియమితులైన మనోజ్‌ జైన్‌ పేర్కొన్నారు. గ్యాస్‌ పైప్‌లైన్ల విస్తరణ కోసం రూ.45,000-50,000 కోట్లు పెట్టుబడులు పెడతామని తెలిపారు. సీటీ

Most from this category