News


ఉపశమన చర్యలు రికవరీ తెస్తాయా?

Saturday 1st June 2019
news_main1559381495.png-26042

భారత జీడీపీ గత ఆర్థిక సంవత్సరం క్యు4లో ఐదేళ్ల కనిష్ఠాలకు పడిపోయింది. నిపుణులంతా జీడీపీ 6.3 శాతం వరకు ఉంటుందని అంచనా వేయగా కేవలం 5.8 శాతానికే పరిమితమై అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం సంవత్సరానికి సైతం జీడీపీ అంచనాల కన్నా తక్కువగా 6.8 శాతంగా నమోదయింది. 2018-19లో జీడీపీ 7.0 శాతం ఉంటుందని సీఎస్‌ఓ, 7.2 శాతం ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా జీడీపీ క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. క్యు4లో అనుకోని తరుగుదలకు క్యాపిటల్‌ ఏర్పాటులో మందగమనం ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. క్యు3లో 11.2 శాతమున్న క్యాపిటల్‌ ఫార్మేషన్‌ తాజాగా 3.6 శాతానికి పడిపోయింది. దీంతోపాటు ప్రైవేట్‌ వినిమయ వ్యయం 8.1 శాతం నుంచి 7.3 శాతానికి పడిపోయింది. మరోపక్క స్థూల విత్త పరిస్థితులు క్షీణించడంతో కరెంట్‌ ఖాతా లోటు క్యు4లో 3.9 శాతానికి చేరింది. జీడీపీలో మొత్తం ఎగుమతులు, దిగుమతుల వాటా మాత్రం గతంలో పోలిస్తే మెరుగుపడి 44.3 శాతానికి చేరింది. దీన్నిబట్టి జీడీపీ క్యు4లో కుంగిపోయేందుకు కారణాలు ప్రధానంగా స్థానికమైనవేనని, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం తక్కువని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
కలవరపెడుతున్న ట్రేడ్‌వార్‌
ట్రేడ్‌వార్‌ ముదరకముందే దేశ జీడీపీలో మందగమనం ఎదురైంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యూఎస్‌, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరవచ్చని అంచనాలున్నాయి. ఇదే నిజమైతే జీడీపీ ఏ స్థాయికి దిగజారుతుందోనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులోఉ‍్ల ఫిస్కల్‌, మానిటరీ కౌంటర్‌ సైక్లిక్‌ చర్యలు తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యమని నిపుణులు చెబుతున్నారు. ఒకపక్క ప్రభుత్వం సాగు, ఎంఎస్‌ఎంఈ రంగాలకు ఉద్దీపనప్యాకేజ్‌లను అమలు చేయనుంది. అయితే ద్రవ్యోల్బణం ఒక మోస్తరుగా కొనసాగుతున్న సమయాన, ఇలాంటి ప్యాకేజీలు నెగిటివ్‌ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని నిపుణుల అంచనా. ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బీఐ మరింతగా వడ్డీరేట్లను తగ్గించవచ్చు. కానీ ఇది పెద్దగా ప్రయోజనకరం కాకపోవచ్చు. ఓఎంఓ రూపంలో లిక్విడిటీ అందించడం తప్పనిసరిగా కనిపిస్తోంది. అదేవిధంగా ఆర్‌బీఐ వద్ద ఉన్న మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చన్న ఊహాగానాలున్నాయి. ఈ రూపంలో ప్రభుత్వం మరింత వ్యయాలు చేసేందుకు వీలు చిక్కవచ్చు. అయితే ఇలాంటి చర్యలతో జీడీపీని వెంటనే 7 శాతం పైకి తీసుకురావడం కుదరకపోవచ్చు. ఇందుకోసం ఒక బహుళముఖ సంస్కరణల ప్యాకేజీ అవసరపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త ప్రభుత్వం బడ్జెట్లో ఇలాంటి ప్రభావశీల సంస్కరణలను ప్రకటించవచ్చని అంచనా వేస్తున్నారు. 



You may be interested

వాల్‌స్ట్రీట్‌పై మెక్సికో పిడుగు!

Saturday 1st June 2019

భారీగా పతనమైన యూఎస్‌ సూచీలు శుక్రవారం యూఎస్‌ సూచీలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఎస్‌అండ్‌పీ 500 దశాబ్ద కాలంలో అధ్వాన్న నెలవారీ క్లోజింగ్‌ నమోదు చేసింది. మెక్సికోపై అనూహ్య టారిఫ్‌లను ట్రంప్‌ ప్రకటించడం మార్కెట్లో భయాన్ని రేకెత్తించింది. ట్రంప్‌ వైఖరి బహుముఖ వాణిజ్య యుద్ధాన్ని తీసుకువస్తుందని, దీంతో ఎకానమీలు మాంద్యంలోకి జారడం ఖాయమని మార్కెట్లు బెదిరిపోయాయి. జూన్‌నుంచి మెక్సికో దిగుమతులపై 5 శాతం టారిఫ్‌ వర్తిస్తుందని, ఈ మొత్తాన్ని క్రమంగా

1300 డాలర్లపైన ముగిసిన పసిడి

Saturday 1st June 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300డాలర్ల పైన ముగిసింది. అమెరికాలో శుక్రవారం రాత్రి ఏకంగా 18.70 డాలర్లు లాభపడింది. వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత అంచనాలు ఇందుకు కారణమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా మరో దేశంపై వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వారు. అమెరికా దక్షిణ సరిహద్దు దేశమైన మెక్సికో దిగుమతులపై 5శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. జూన్‌ 10 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తున్నట్లు

Most from this category