News


ప్రభుత్వ తప్పుడు ఆర్థిక లోటు లెక్క?

Thursday 25th July 2019
news_main1564032068.png-27298

 ఆర్థిక సంవత్సరం 2018 లో భారత ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక లోటు 3.46 శాతం కంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్‌) ప్రకటించిన ఆర్థిక లోటు 5.85 శాతంగా ఉండడం చర్చనీయాంశంగా మారిందని ఎకనామిక్‌ టైమ్స్‌లో వార్త వచ్చింది. ఆర్థిక సంవత్సరం 2020 బడ్జెట్‌లో ప్రకటించిన ఆర్థిక లోటులో అదనపు బడ్జెట్‌ వనరులు (ఈబీఆర్‌) ప్రతిబింబిస్తాయా? అని 15 వ ఫైనాన్స్‌ కమిషన్‌కు జులై 8 న ఇచ్చిన ప్రజెంటేషన్‌లో కాగ్‌ ప్రశ్నించింది.  భారతదేశపు అధికారిక గణాంకాలు ముఖ్యంగా ద్రవ్య లోటు, జిడిపి వృద్ధి సంఖ్యలు పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఆర్థిక రిపోర్ట్‌లో ద్రవ్య పారదర్శకతపై చర్చజరిగింది. ముఖ్యంగా ఆఫ్-బడ్జెట్, ప్రభుత్వాల అదనపు బడ్జెట్ వనరులను పెంచే ధోరణి పెరగడంతో ఇది అవసరమయ్యింది’ అని నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ ఈబీఆర్‌లకు పరిమితి ఎంతవరకు ఉందో ఇప్పటికి అస్పష్టంగా ఉంది. ఆఫ్-బడ్జెట్ రుణాలు కలవడంతో ఆర్థిక సంవత్సరం 2018లో ఆదాయ లోటు జిడిపిలో 2.59 శాతం ఉందని ప్రభుత్వం అధికారికంగా పెర్కొనగా ఇది 3.48 శాతంగా ఉందని కాగ్‌ నివేదిక పేర్కొంది.  ​ఆర్థిక సంవత్సరం 2018లో రెవెన్యూ ఖర్చుల కోసం ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలు 0.9 శాతం, క్యాపిటల్‌ ఖర్చుల కోసం ఆఫ్‌ బడ్జెట్‌ రుణాలు 1.43 శాతం తీసుకున్నారని వివరిం‍చింది. 2011-2017 మధ్య ప్రభుత్వం జిడిపి వృద్ధిని 2.5 శాతం అధికంగా చూపారని మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ చెప్పారు.
 


CAG

You may be interested

హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!!

Thursday 25th July 2019

83 శాతం హైదరాబాదీలకు జీవిత బీమా భద్రత దేశంలో మిగతా ప్రాంతాల వారికన్నా టాప్‌ మ్యాక్స్‌ లైఫ్‌ సర్వేలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీవిత బీమా విషయంలో దేశంలోని మిగతా వారితో పోలిసే్త హైదరాబాదీలు చాలా మెరుగని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 83 శాతం మందికి ఏదో ఒక జీవిత బీమా పాలసీ ఉంది. ఇలా ఏదో ఒక పాలసీ ఉన్నవారి జాతీయ సగటు 65 శాతం. దీంతో పోలిస్తే భాగ్యనగర

స్థిరంగా పసిడి

Thursday 25th July 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర గురువారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.35డాలరు స్వల్ప నష్టంతో 1,422.25డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ధరకు వ్యతిరేక దిశలో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ రెండు నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతుండటం పసిడి ఫ్యూచర్లపై ఒత్తిడిని పెంచుతోంది. పలు దేశాల రిజర్వ్‌ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో ట్రేడర్లు పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణకు

Most from this category