News


పేదవిద్యార్థులకు ఆన్‌లైన్‌ డిగ్రీ

Sunday 2nd February 2020
news_main1580624164.png-31439

  • దేశంలోని 100 అగ్ర విద్యాసంస్థల్లో అమలు
  • త్వరలో నూతన విద్యా విధానం ప్రారంభం
  • విద్యారంగానికి రూ.99,300 కోట్లు నిధులు 
  • నైపుణ్యాభివృద్ధికి మరో రూ.3000 కోట్లు  
  • విదేశీ విద్యార్థులకు ఇండ్‌-సాట్‌ పరీక్ష, ఉపకార వేతనాలు
  • యువ ఇంజినీర్లకు ఇంటర్న్‌షిప్‌, విద్యా‍ర్థుల్లో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట
  • జాతీయ పోలీస్‌, ఫోరెన్సిక్‌ వర్సిటీల ఏర్పాటు
  • బడ్జెట్‌లో ప్రకటించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభించనున్న నూతన విద్యావిధానంలోని పలు అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంటులో ప్రకటించారు. దానిప్రకారం.. ఉన్నతవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుణాలు, విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను ఆహ్వానించనున్నారు. మరోవైపు పబ్లిక్‌ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో జాతీయ పోలీస్‌ యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తారు. వాటిని జిల్లా మెడికల్‌ కాలేజీలతో అనసంధానిస్తారు. మెరుగైన వైద్యాన్ని అందించేందుకే ఈ విధానాన్ని ఎంచుకున్నారు. అలాగే పేదవిద్యార్థులకు ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెస్తారు, ఇండియాలో చదివేందుకు ఆసక్తి చూపే ఆసియా-ఆఫ్రికా విద్యార్థులకు ఇండ్‌-సాట్‌ పేరిట ప్రత్యేక పరీక్ష నిర్వహించి, ప్రతిభావంతులకు ఉపకార వేతనం కూడా అందించాలని నిర్ణయించింది. ఈ అంశాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపి సలహాలు, సూచనలు స్వీకరించింది.

ముఖ్యాంశాలు...
1. ఉన్నత విద్య అందుబాటులో లేని బలహీన, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు మోసుకొచ్చింది. వీరి కోసం ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. దేశంలో టాప్‌ 100 విద్యాసంస్థల ద్వారా ఈ ‍ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రకటించారు. 

2. 2020-21 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంగా విద్యారంగంలో ప్రవేశపెట్టబోయే నూతన విధానాలపై ఆమె ప్రసంగించారు. దేశంలో త్వరలో నూతన విద్యా విధానం తీసుకురాబోతున్నామని వెల్లడించారు. ఇందుకోసం రూ.99,300 కోట్లు విద్యారంగానికి నిధులు కేటాయించబోతున్నామని, 

3. ప్రత్యేకంగా మరో రూ.3000 కోట్లు నైపుణ్యాభివృద్ధికి వెచ్చిస్తామని ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి మరియు అంట్రప్రిన్యూర్‌ షిప్‌ శాఖల సహకారంతో స్కిల్‌ ఇండియా మిషన్‌ కార్యక్రమం చేపట్టబోతున్నామని, తద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్య వాతావరణం సృష్టించి పౌరుల నైపుణ్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు. టీచర్లు, నర్సులు, పారామెడికల్స్‌లో వృత్తిగత నైపుణ్యాలను మరింత మెరుగుపెట్టేందుకు ప్రత్యేక బ్రిడ్జి కోర్సుకు రూపకల్పన చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే తాము 8వేలు స్కూళ్లు, విద్యాసంస్థల్ల్లో 9- 10 తరగతులకు 400 గంటలపాటు, 11- 12 తరగతుల వారికి 500 గంటలపాటు నైపుణ్యశిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. పాఠశాలలకు నెట్‌ సౌకర్యం కల్పించే అంశా‍న్ని కూడా చేర్చామన్నారు.

4. ఉన్నత విద్యాభ్యాసానికి భారత్‌ కేంద్రంగా మారాలన్న తలంపుతో ‘స్టడీ ఇన్‌ ఇండియా’ ప్రోగ్రాముకు రూపకల్పన చేశామన్నారు. ఇందులో భాగంగా ఐఎన్‌డీ- ఎస్‌ఏటీ అనే పరీక్షను నిర్వహించ తలపెట్టామన్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రతిభ గలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తామని ప్రకటించారు

5. కొత్త విద్యా విధానంపై అన్ని రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఇతర భాగస్వాములతో చర్చించామని తెలిపారు. దీనిపై రెండు లక్షలకుపైగా సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. త్వరలోనే నూతన విద్యా విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యలో నాణ్యాతా ప్రమాణాలు, మౌలిక వసతులనుఅభివృద్ధి చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. 

6. విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు పెరగాలంటూ వివిధ వర్గాల విద్యార్థుల నుంచి డిమాండ్లు పెరుగుతున్న దరిమిలా.. 2021 మార్చి నెలనాటికి 150 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అప్రెంటిష్‌ షిప్‌తో కూడిన డిగ్రీ, డిప్లొమా కోర్సులను కూడా ప్రవేశపెట్టబోతున్నారని ప్రకటించారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంబంధితస్థానిక సంస్థల్లో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌కి వీలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడి, బలహీనవర్గాలకు ఉన్నత విద్య అందించేందుకు డిగ్రీ స్థాయిలో పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం దేశంలో దాదాపు టాప్‌ 100 జాతీయ విద్యా సంస్థలుగా గుర్తింపు పొందిన సంస్థల్లో అమలు చేస్తామన్నారు.

7. పోలీసింగ్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, సైబర్‌ఫోరెన్సిక్స్‌లో భాగంగా జాతీయ పోలీసు యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీల ఏర్పాటును ప్రతిపాదించామన్నారు. పబ్లిక్‌ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ కార్య క్రమంలో జాతీయ పోలీస్‌ యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీలను జిల్లా మెడికల్‌ కాలేజీలతో అనసంధానిస్తామని, దీనివల్ల మెరుగైన వైద్యసేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. You may be interested

అంతా బాగుండాలి.. అందులో మీరూ ఉండాలి!!

Sunday 2nd February 2020

బడ్జెట్‌ ‘రచ్చ’బండలో సీతారామన్‌ బాణాలు అదిగో... అదిగో..! అందరూ వచ్చేశారా!! ప్రతిసారీ ఈ రోజున మనం ఎక్కడో ఓ చోట కలుసుకుంటూనే ఉన్నాం. ఈ సారి ఈ రచ్చబండ దగ్గర!!. ఎన్నో కోరికలు కోరి... అవి తీరుతాయన్న ఆశతో మీరిలా రావటం... అన్నీ సాధ్యం కాకున్నా కొన్నిటినైనా నెరవేర్చడానికి నేను ప్రయత్నించటం కొత్తేమీ కాదుగా!!. ఈ సారి మన ఊరి పరిస్థితులు అంత బాగాలేవు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య లంకె కుదరటం

అన్నం లేదు.. ఆవకాయ మాత్రమే!!

Sunday 2nd February 2020

ఆదాయపు పన్ను రేట్లు తగ్గించిన ఆర్థికమంత్రి నాలుగు శ్లాబుల స్థానంలో కొత్తగా ఏడు శ్లాబులు కానీ కొత్త విధానంలో 70 రకాల మినహాయింపులు తొలగింపు దీంతో పన్ను రేటు తగ్గినా భారం మాత్రం తగ్గదంటున్న నిపుణులు పాత విధానమా? కొత్త విధానమా? అనేది చెల్లింపుదారు ఇష్టం రెండు విధానాల్లోనూ రూ.5 లక్షల లోపు ఆదాయానికి పన్ను లేదు కొత్త విధానంలో రూ.5- 7.5 లక్షల ఆదాయం ఉంటే 20 నుంచి 10 శాతానికి 10-12.5 లక్షల ఆదాయం ఉన్న వారికి

Most from this category