News


ఎగుమతిదారులకు ప్రత్యేక పథకం

Sunday 2nd February 2020
news_main1580617797.png-31426

  • పన్నులు, సుంకాల రీయింబర్స్‌మెంట్‌

న్యూఢిల్లీ:  మందగించిన ఎగుమతులకు ఊతమిచ్చే దిశగా బడ్జెట్‌లో కేంద్రం చర్యలు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల స్థాయుల్లో ఎగుమతిదారులు చెల్లించే వివిధ సుంకాలు, పన్నులను రీయింబర్స్ చేసేందుకు ఈ ఏడాది ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. విలువ ఆధారిత పన్నులు (వ్యాట్‌), విద్యుత్ సుంకాలు, రవాణా కోసం ఉపయోగించే ఇంధనాల వ్యయాలు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి వాటికి మినహాయింపులు గానీ రీఫండ్‌ గానీ లభించడం లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనల ప్రకారం.. విద్యుత్‌, ఇంధనం, నీరు మొదలైన వాటిపై చెల్లించే పన్నులకు రీఫండ్ వెసులుబాటు ఉంటోంది. ప్రతి జిల్లాను ఎగుమతి హబ్‌గా అభివృ‍ద్ధి చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. గతేడాది డిసెంబర్‌ దాకా వరుసగా అయిదు నెలల పాటు ఎగుమతులు క్షీణించాయి. డిసెంబర్‌లో 1.8 శాతం తగ్గి 27.36 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2019-20 ఏప్రిల్‌-డిసెంబర్ మధ్యకాలంలో ఎగుమతులు 1.96 శాతం క్షీ౾ణించి 239.29 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 



You may be interested

‘మౌలికం’ కీలకం!   

Sunday 2nd February 2020

- రవాణా రంగంలో మౌలిక సదుపాయాలు, హైవేల అభివృద్ధికి రూ.1.70 లక్షల కోట్లు - పురోగతిలో 6,500 ప్రాజెక్టులు - పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని తేజాస్‌ రైళ్లు - ‘ఉడాన్‌’ ద్వారా 2024 నాటికి వంద ఎయిర్‌పోర్టుల అభివృద్ధి  న్యూఢిల్లీ: దేశ ఆర్థిక అభివృద్ధికి చోదకశక్తి లాంటి మౌలిక వసతుల రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే రూ.103 లక్షల కోట్లతో పలు ప్రాజెక్టులను ప్రారంభించిందని, తాజాగా రవాణా రంగంలో మౌలిక వసతులు,

రక్షణ రంగానికి 3.37 లక్షల కోట్లు కేటాయింపు

Sunday 2nd February 2020

గతం కంటే 5.8 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్‌ న్యూఢిల్లీ: బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభంలో దేశ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పొరుగు దేశాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రక్షణ రంగం అధిక ఆర్థిక కేటాయింపుల కోసం ఎదురుచూస్తుండగా గత యేడాదికంటే రక్షణ బడ్జెట్‌ కేటాయింపులను కేంద్రం ఆరుశాతం కూడా పెంచకపోవడం

Most from this category