News


ఎన్‌ఆర్‌ఐ నిబంధనల సవరణ

Sunday 2nd February 2020
news_main1580626850.png-31444

న్యూఢిల్లీ: విదేశాలలో పన్నులు చెల్లించని ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) ఇకపై దేశీయంగా ఆదాయ పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇందుకు తాజా బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. దేశీయంగా పౌరసత్వం కలిగి ఉన్నప్పటికీ కొన్ని రోజులపాటు విదేశాలలో ఉండటం ద్వారా ఎన్‌ఆర్‌ఐ కేటగిరిలోకి వస్తున్న వ్యక్తులు ఏ దేశంలోనూ పన్నులు చెల్లించని పక్షంలో ఇకపై దేశీయంగా పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇందుకు తాజా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేపట్టారు. వెరసి భారతీయులై ఉండి ఏ దేశంలోనూ స్థిరనివాసం ఉండకుండా ఆర్జించే గ్లోబల్‌ ఆదాయంపై దేశీయంగా పన్ను చెల్లించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎన్‌ఆర్‌ఐ నివాస నిబంధనలు సైతం సవరించేందుకు బడ్జెట్‌లో నిర్ణయించారు. ఫలితంగా ఇకపై ఒక ఏడాదిలో 120 రోజులకుమించి దేశీయంగా నివాసముంటే.. వారు ఎన్‌ఆర్‌ఐ కేటగిరీలోకి రారు. ప్రస్తుతం ఈ నిబంధన 182 రోజులుగా అమలవుతోంది. ఇకపై విదేశంలో 240 రోజులపాటు నివాసముంటేనే ఎన్‌ఆర్‌ఐ కేటగిరీలోకి వస్తారు. 



You may be interested

సంక్షేమ సీతమ్మ!

Sunday 2nd February 2020

స్త్రీ శిశు సంక్షేమాలకు 14 శాతం నిధుల పెంపు గర్భధారణ సగటు వయసు సమీక్షకు టాస్క్‌ఫోర్స్‌ గ్రామీణాభివృద్ధి నిధుల్లో కోత న్యూఢిల్లీ: కేంద్రంలో పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న వేళ మోదీ ప్రభుత్వం సమాజ సంక్షేమానికి బడ్జెట్లో పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా స్త్రీశిశు సంక్షేమానికి, షెడ్యూల్‌ తెగలు, కులాలు, మైనార్టీల శాఖలకు నిధుల కేటాయింపులు పెరిగాయి. సామాజిక సంక్షేమాన్ని మూడు విభాగాలుగా విభజిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌

‘పల్లె’కు ఓకే..!

Sunday 2nd February 2020

ఫ్లాగ్‌షిప్‌ పథకాలకు ఈసారీ నిధుల జోరు.. ఆర్థిక మందగమనం నేపథ్యంలో గ్రామాలపై దృష్టి... ఇళ్లు, రోడ్ల నిర్మాణానికి కేటాయింపుల జోరు... 2021 మార్చినాటికి మరో లక్ష పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ ఆర్థిక మందగమనం ప్రభావం నుంచి గ్రామీణ భారతాన్ని గట్టెక్కించేందుకు మోదీ సర్కారు తాజా బడ్జెట్‌లో దండిగానే నిధులను కేటాయించింది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఖర్చుకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. అయితే, గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే కొన్ని పథకాలకు కేటాయింపులు తగ్గడం గమనార్హం. గ్రామీణ

Most from this category