News


ఆరోగ్యానికి రూ.1.50లక్షల కోట్లు అవసరం

Wednesday 29th January 2020
news_main1580272040.png-31284

ఆరోగ్య సేవలకు రూ.1,50,000 కోట్లు కేటాయించాలి పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలపై పన్ను ప్రయోజనాలను రానున్న బడ్జెట్‌లో తిరిగి పునరుద్ధరించాలని భారత ఔషధ పరిశ్రమ ఆశిస్తోంది. దేశంలో ఆవిష్కరణలను పెంచాలంటే 2010 బడ్జెట్‌లో ఇచ్చినట్టుగా 200 శాతం వెయిటెడ్‌ ట్యాక్స్‌ డిడక్షన్‌ ఇవ్వాలని ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) సెక్రటరీ జనరల్‌ సుదర్శన్‌ జైన్‌ ప్రభుత్వాన్ని కోరారు. సగటున కంపెనీలు ఆర్‌అండ్‌డీపై 2012లో 5.3 శాతం వెచ్చిస్తే, గత ఆర్థిక సంవత్సరం నాటికి ఇది 8.5 శాతానికి ఎగసిందని గుర్తు చేశారు. 
- ఆరోగ్య సేవల రంగంపై వెచ్చించే నిధులు పెంచడంతోపాటు ఇన్సెంటివ్స్‌ ఇవ్వడం ద్వారా బల్క్‌ డ్రగ్‌ తయారీ కేంద్రాల స్థాపనను ప్రోత్సహించాలి. 
- దిగుమతులపై ఆధారపడడం తగ్గించేందుకు 4-6 బల్క్‌ డ్రగ్‌ క్లస్టర్లను దేశవ్యాప్తంగా నెలకొల్పాలి. ఇన్నోవేషన్‌ క్లస్టర్లను సైతం స్థాపించాలి. రాయల్టీ, టెక్నాలజీ లైసెన్స్‌ ఫీజుపై వసూలు చేస్తున్న 10 శాతం పన్నులు ఎత్తివేయాలి. ఎగుమతులను ప్రోత్సహించేందుకు కొత్త పథకం ప్రవేశపెట్టి ఇన్సెంటివ్స్‌, సబ్సిడీలు అందించాలి. 

 

  • విశాలమైన భారతావని, పెరుగుతున్న జనాభా, అధికమవుతున్న వ్యాధులను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య సేవల రంగంలో ప్రభుత్వ వ్యయం పెరగాలి. 2019-20 బడ్జెట్‌లో హెల్త్‌కేర్‌ రంగానికి రూ.62,398 కోట్లు కేటాయించారు. ఇది జీడీపీలో కేవలం 1 శాతం మాత్రమే. ఆరోగ్య సేవల రంగానికి జీడీపీలో 2.5 శాతం లేదా రూ.1,50,000 కోట్ల కేటాయింపులు జరగాలి. 
  • చిన్న పట్టణాల్లో ఆసుపత్రులను స్థాపించే ఇన్వెస్టర్లకు ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ అందించాలి. ఆయుష్మాన్‌ భారత్‌ ప్యాకేజీ రేట్లు సవరించాలి. 2019-20 బడ్జెట్లో ఆయుష్మాన్‌ భారత్‌కు చేసిన కేటాయింపులు రూ.6,400 కోట్లు మాత్రమే. 
  • ఆయుష్మాన్‌ భారత్‌కు నిధులు మరింత అధికమైతే ఆసుపత్రుల నెట్‌వర్క్‌ విస్తరిస్తుంది. మరింత మంది ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన వైద్యం అందుతుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లోని ఆసుపత్రులకు, ప్రధానంగా తక్కువ రోగులు ఉండే కేంద్రాలకు మేలు చేకూరుతుంది.   



You may be interested

వచ్చే ఏడాది రూ.3,000 కోట్ల ఆదాయం

Wednesday 29th January 2020

జాన్సన్‌ లిఫ్ట్స్, ఎస్కలేటర్స్‌ వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: లిఫ్ట్స్‌, ఎస్కలేటర్స్‌ తయారీ సంస్థ జాన్సన్‌.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకుంది. 2018-19లో  రూ.2,000 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశామని కంట్రీ హెడ్‌ ఆల్‌బర్ట్‌ ధీరవియం తెలిపారు. నూతన మోడళ్లను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా  బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ గుప్తా, జీఎం చైతన్యతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి ఏటా

యాపిల్‌ ఫలితాల జోష్‌

Wednesday 29th January 2020

లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు డిసెంబర్‌ క్వార్టర్‌లో యాపిల్‌ అమ్మకాల జోరు ఆదాయంలో సగం వాటాను ఆక్రమించిన ఐఫోన్లు సరికొత్త గరిష్టానికి చేరువలో యాపిల్‌ షేరు   ఐఫోన్లు, ఐప్యాడ్‌ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ ఫలితాలపై అంచనాలు మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. వెరసి కరోనా వైరస్‌ ఆందోళనల నుంచి బయటపడి లాభాలతో ముగిశాయి. యాపిల్‌ పనితీరుపై అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో యాపిల్‌ షేరు దాదాపు 3 శాతం జంప్‌చేసింది. దాదాపు

Most from this category