News


ఒక ప్రధాన పోర్ట్‌నైనా కార్పొరేటీకరిస్తాం

Sunday 2nd February 2020
news_main1580616846.png-31420

  • ఆ తర్వాత స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేస్తాం
  • లోథాల్‌లో మారిటైమ్‌ మ్యూజియమ్‌ ఏర్పాటు 
  • బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిర్మలా సీతారామన్‌ 

న్యూఢిల్లీ: పోర్టుల పనితీరును మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు కనీసం ఒక ​ప్రధాన పోర్ట్‌ను అయినా కార్పొరేటీకరణ చేయాలని, ఆ తర్వాత దానిని స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ప్రతిపాదించారు. యాంత్రీకీకరణ, డిజిటైజేషన్‌, సరళతరమైన విధానాలు అవలంభించడం తదితర చర్యల ద్వారా పోర్టుల నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరిచే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తోందని వెల్లడించారు. లోధాల్‌(గుజరాత్‌)లో మారిటైమ్‌ మ్యూజియమ్‌ను ఏర్పాటు చేస్తామని సీతారామన్‌ తెలిపారు. ఇది స్వతంత్ర అంతరజల పురావస్తు పరిశోధన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. 

భారత్‌లోని ప్రధాన పోర్టుల సామర్థ్యం ఏడాదికి 1,514 మిలియన్‌ టన్నులుగా ఉంది. భారత్‌లో మొత్తం 12 ప్రధాన పోర్టులున్నాయి. ముంబై, దీన్‌దయాళ్‌(గతంలో కాండ్లా), జేఎన్‌పీటీ, మార్ముగోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్‌, చెన్నై, కామరాజర్‌(గతంలో ఎన్నోర్‌), వి ఓ చిదంబరానార్‌, విశాఖపట్టణం, పారదీప్‌, కోల్‌కత(హల్దియాను కూడా కలుపుకొని). 



You may be interested

మార్కెట్‌లో ఎందుకీ భారీ పతనం

Sunday 2nd February 2020

- మెప్పించని డీడీటీ ప్రతిపాదన - ఎల్‌టీసీజీ పన్ను తొలగించకపోవడంపై నిరాశ - ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాల సాధనపై సందేహాలు జీడీపీ వృద్ధి పడిపోయి, వినియోగ డిమాండ్‌ కొరవడి గత ఏడాదికాలంగా ప్రపంచ ఈక్విటీ ర్యాలీలో బాగా వెనుకబడిన మన మార్కెట్‌ను ఆర్థిక మంత్రి సీతారామన్‌...బడ్జెట్‌తో పరుగులు పెట్టిస్తారంటూ ఇన్వెస్టర్లు పెట్టుకున్న భారీ అంచనాలు పటాపంచలయ్యాయి. ఫలితమే సెన్సెక్స్‌ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల క్రాష్‌. నాలుగు నెలల క్రితం ఆశ్చర్యకరంగా కార్పొరేట్‌ పన్నును

స్టార్టప్‌లకు జోష్‌

Sunday 2nd February 2020

ఎసాప్స్‌పై అయిదేళ్ల ట్యాక్స్‌ హాలిడే రూ. 100 కోట్లలోపు టర్నోవరున్న సంస్థలకూ పన్ను ప్రయోజనాలు న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు ఊతమిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలు చేశారు. ఎంప్లాయీ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌ (ఎసాప్స్‌)పై అయిదేళ్ల పాటు ట్యాక్స్‌ హాలిడే ప్రకటించారు. "ఎసాప్స్‌కి సంబంధించి ఉద్యోగులపై తక్షణ పన్ను భారం పడకుండా అయిదేళ్ల పాటు లేదా వారు సంస్థ నుంచి తప్పుకునే దాకా లేదా విక్రయించే దాకా

Most from this category