News


బడ్జెట్‌ ఎవరి వైపు?

Monday 24th June 2019
news_main1561370010.png-26533

నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టాక వచ్చే మొదటి బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసారు? ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేయబోతోంది? మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టేనా?
       వచ్చే ఐదేళ్లలో పెట్టుబడులను ఆకర్షించాడానికి, ప్రోత్సాహకాలందించి వినియోగాన్ని పెంచడానికి, సామాజిక మౌలిక వసతులపై ప్రజలను ఖర్చుపెట్టించడానికి భూమి, కార్మిక, మూలధనం, వ్యవస్థాగత తదితర రంగాలలో నిర్మాణాత్మక విధాన మార్పులను నిర్మలాసీతారామన్‌ తన తొలి బడ్జెట్‌లో  తీసుకొని రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసిన మోడీ-1 ప్రభుత్వం ఇప్పుడు మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి, నిరుద్యోగ సమస్యను ఎదుర్కోడానికి సిద్ధపడుతోందని విశ్లేషకులు అంటున్నారు.
 
రేట్ల తగ్గింపు అవసరమే..
  ఈ బడ్జెట్‌లో నైపుణ్యభివృద్ధికి, ఉద్యోగాలను కలిపించే ప్రైవేట్‌ పెట్టుబడులపై ప్రోత్సాహకాలను అందించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు వడ్డి రేట్ల తగ్గింపును ప్రజలకు అందించేట్టు ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల వినియోగ సామర్థ్యన్ని పెంచవచ్చు.  రిజర్వ్‌బ్యాంక్‌ తాజాగా జూన్‌ 6న రెపో రేట్‌ను 5.75శాతానికి తగ్గించింది. దీనితో ఈ ఏడాది ఆర్బీఐ మూడు సార్లు వడ్డి రేట్లను తగ్గించినట్టయ్యింది. వడ్డి రేట్లను తగ్గించి తక్కువ వడ్డిలకే బ్యాంక్‌లు రుణాలిచ్చేలే ఒత్తిడి తీసుకురావచ్చు. ‘ వడ్డి రేట్ల తగ్గింపు పరోక్షంగా వినియోగ సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇప్పటికే ఈ ఏడాది ఆర్బీఐ 75 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డి రేట్లను తగ్గించింది. ఇందులో 40 శాతం వరకు బ్యాంక్‌లు వినియోగదారులకు మరల్చాయి. అంతే కాకుండా ఈ ఏడాది ద్వితియార్థంలో ఆర్బీఐ ఇంకో 25బేసిస్‌ పాయింట్లను తగ్గించే అవకాశం ఉంది’ అని ఈవై ఇండియా చీఫ్‌ పాలసీ సలహాదారుడు, డా.డీకే శ్రీనివాస్తవ అన్నారు.  ‘రేట్ల తగ్గింపు వలన ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. తాత్కాలిక బడ్జెట్‌ ద్రవ్యలోటు లక్ష్యం (జీడీపీలో 3.4శాతం)కి అనుగుణంగా ఉండడంతో ప్రైవేట్‌ పెట్టుబడులు పెట్టడానికి కొన్ని వనరులు అందుబాటులో ఉన్నాయి’ అని నిపుణుల భావిస్తున్నారు.
 
గ్రామీణ అభివృద్దే మార్గం..
     ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిపై దృష్ఠి పెడితే  డిమాండ్‌, ఉద్యోగాలను పెంచే సామర్ధ్యం దీనికి ఉందని పరిశీలకులు అంటున్నారు. ‘వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దృష్ఠి సారించవచ్చు. ఇది పీఎమ్‌-కిసాన్‌ పథకం ద్వారా ‍రైతు ఖాతాలలోకి నగదును వేయ్యడం ద్వారా జరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా 2022 కల్లా రైతు ఆదాయాన్ని రెండింతలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు’ అని శ్రీవాస్తవ తెలిపారు. అధికారిక సమాచారం మేరకు దేశ జీడీపీ 2018-19 చివరి త్రైమాసికంలో 5.8 శాతానికి పడిపోయింది. ఇది గత 20 త్రైమాసికాల కంటే తక్కువ. దీని వలన ఏడాది మొత్తం జీడీపీ 6.8 శాతానికి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది మనం పెట్టుకున్న జీడీపీ అంచనా 7 శాతాం కన్నా తక్కువ. వ్యవసాయ, పారిశ్రామిక వృధ్ది మందగించడంతో మొదటి త్రైమాసికంలో 8 శాతంగా నమోదైన జీడీపీ, చివరి త్రైమాసికానికి 6శాతం కిందికి పడిపోయింది. అంతేకాకుండా నిరుద్యోగ సమస్య కూడా వేదిస్తోంది. పీరియాడిక్‌ ల్యాబర్‌ ఫోర్స్‌ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్‌) ప్రకారం 2017 జులై నుంచి, జూన్‌ 2018 మధ్య కాలంలో నిరుద్యోగం 6.1 శాతం పెరిగింది.  ప్రభుత్వం అందిస్తున్నా అనేక పెన్సన్‌ పథకాల వలన కూడా వినియోగం పెరుగుతుందని శ్రీవాస్తవ తెలిపారు. 

బడ్జెట్‌ దృష్ఠి మౌలిక రంగం వైపేనా? 
‘ఇప్పుడున్న  ఆర్థిక వ్యవస్థను రెండింతలు చేసి 2024 కల్లా 5 లక్షల కోట్ల డాలర్లకు పెంచడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆర్థిక సంస్కరణలను మొదలుపెట్టవచ్చు’ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  అంతేకాకుండా ఈ బడ్జెట్లో మౌలిక రంగ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం పెద్ద పీట వేయవచ్చు. దీని కోసం బడ్జెట్‌ ద్వారా కొంత నగదును అందించి, మిగిలినది అదనపు వనరుల నుంచి ఏర్పాటు చేసే అవకాశం ఉం‍ది. పన్నులు, స్నేహ పూర్వక వ్యాపారానికై సంస్కరణలు తీసుకురావచ్చని డెలాయిట్‌ ఇండియా భాగస్వామి ప్రశాంత్‌ దేశ్‌పాండే అన్నారు. ప్రభుత్వం ఎగుమతులకు పన్ను రాయితీలను ప్రకటించడం వలన దేశియ తయారి రంగం బలపడుతుందని తెలిపారు. బడ్జెట్‌లో రియల్‌ఎస్టెట్‌ రంగాన్ని పరుగులు పెట్టించే చర్యలు ఉండవచ్చని ఎందుకంటే ఇది ఆర్ధిక వ్యవస్థను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని అధికారులు తెలిపారు. అసంఘటిత రంగ అభివృద్ధి, స్టీల్‌, సిమెంట్‌, కార్మిక డిమాండ్‌ను పెంచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని అన్నారు. ‘ ప్రత్యక్ష, పరోక్ష ఆదాయ పన్ను పోత్సహకాలు అందించడం వలన ‘అందరికి ఇళ్లు’ పథకం ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించవచ్చు. అనేక జీఎస్‌టీ స్లాబ్‌లు ఉంచకుండా ఒకే రేటు కిందకు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. రేట్‌ స్లాబ్‌లు తగ్గించడం వలన మిడిల్‌ క్లాస్‌  రియల్‌ ఎస్టేట్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సహాయపడతాయి’ అని తెలిపారు.You may be interested

11700 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 24th June 2019

బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11700 దిగువున 11,699 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 71 పాయింట్లను నష్టపోయి 39,123 వద్ద ముగిసింది. ఇరాన్‌ అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టకపోవడం, క్రూడాయిల్‌ ధరలు చల్లారకపోవడం తదితర బలహీన అంతర్జాతీయ సంకేతాలు దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఇక

నవరత్నాల్లాంటి సిఫార్సులు

Monday 24th June 2019

వచ్చే రెండు మూడువారాల్లో మంచి రాబడినందించే సత్తా ఉన్న తొమ్మిది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.  హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ 1. టిమ్‌కెన్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 790. స్టాప్‌లాస్‌ రూ. 655. ఇటీవలే నిరోధ శ్రేణిని మంచి వాల్యూంలతో బ్రేక్‌చేసింది. బ్రేకవుట్‌ తర్వాత మంచి కన్సాలిడేషన్‌ చూసి తిరిగి గతవారం బౌన్స్‌ చూపింది. ప్రస్తుతం స్వల్పకాలిక డీఎంఏస్థాయిలకు పైన ఉంది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు పాజిటివ్‌గా ఉన్నాయి. 2. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌:

Most from this category