News


మరికొంత కాలం ఇంతే!

Monday 3rd June 2019
news_main1559556463.png-26067

జీడీపీపై దిగ్గజ బ్రోకరేజ్‌ల అంచనా
భారత ఎకానమీ జీడీపీ అంచనాలను అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు తగ్గించాయి. ఎకానమీలో మందగమనం కారణంగా ఆర్‌బీఐ కనీసం 25 బీపీఎస్‌ మేర రేట్లను తగ్గించవచ్చని అంచనా వేశాయి.
1. నోమురా: జీడీపీ క్యు4లో అంచనాలను అందుకోలేకపోయింది. అంతర్జాతీయ బలహీనత, దేశీయ ఇబ్బందులకు ఇది నిదర్శనం. కొత్త ఏడాది తొలి త్రైమాసికంలో కూడా ఈ బలహీనత కొనసాగవచ్చు. క్యు2 నుంచి బలహీనమైన రికవరీ ఉండొచ్చు. అందువల్ల కొత్త ఏడాది జీడీపీ అంచనాలను అందుకోలేకపోవచ్చు. రాబోయే సమావేశంలో ఆర్‌బీఐ 25 బీపీఎస్‌ మేర రెపోరేట్‌ తగ్గించవచ్చు. ఎకానమీపై న్యూట్రల్‌ ధృక్పథం కొనసాగించవచ్చు.
2. హెచ్‌ఎస్‌బీసీ: ప్రైవేట్‌ రంగంలో బలహీనత క్యు4 జీడీపీపై ప్రభావం చూపింది. అన్ని రంగాల్లో బలహీనత కనిపిస్తున్నందున క్యు1లో సైతం జీడీపీ అంచనాలను చేరకపోవచ్చు. అయితే ద్వితీయార్ధంలో ఎకానమీ పుంజుకునే ఛాన్సులున్నాయి. ఆ దశలో 7 శాతం వృద్ధికి ఛాన్సులున్నాయి. ఆర్‌బీఐ 25 బీపీఎస్‌ వరకు రేట్లను తగ్గించవచ్చు.
3. గోల్డ్‌మన్‌శాక్స్‌: అంచనాల కన్నా వేగంగా క్యు4లో జీడీపీ క్షీణించింది. ఈ బలహీనత ద్వితీయార్ధంలో సమసిపోవచ్చు. క్రూడ్‌ ధరలు తగ్గడం, సంస్కరణలపై ఆశలతో సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారడం.. వృద్ధిని సపోర్ట్‌ చేస్తాయి. ఎన్‌బీఎఫ్‌సీ సమస్య తీరకపోతే డౌన్‌సైడ్‌ రిస్కు పెరగవచుచ.
4. డాయిష్‌ బ్యాంక్‌: వృద్ధి రేటు పతనంతో ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించవచ్చు. కొత్త సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు అంచనాలు 7.4 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు. ప్రథమార్దంతో పోలిస్తే ద్వితీయార్ధంలోనే జీడీపీలో మెరుగుదల ఉంటుంది.
5. సిటిగ్రూప్‌: పెట్టుబడుల్లో భారీ మందగమనమే జీడీపీ క్షీణతకు ప్రధాన కారణం. వార్షిక జీడీపీ సైతం పెట్టుబడుల బలహీనతతో మందగించింది. మరికొంత కాలం ఇదే ధోరణి ఉండొచ్చు. 



You may be interested

అమ్మకాలు అంతంతే.. కానీ షేరులో జోరు

Monday 3rd June 2019

టాటామోటర్స్‌, మారుతీ షేర్లపై విశ్లేషణ మారుతీసుజుకీ గత ఏడేళ్లలో అత్యంత అధ్వాన్న అమ్మకాలను గత నెల నమోదు చేసింది. టాటామోటర్స్‌ సైతం ఇదే తరహాలో పేలవ విక్రయాలు చూపింది. కానీ సోమవారం మార్కెట్లో ఈ రెండు కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడయి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ ర్యాలీకి ప్రధాన కారణం షార్ట్‌కవరింగ్‌ అని నిపుణులు అంచనా వేస్తున్నారు. విక్రయాలు పేలవంగా ఉండడంతో ఫ్యూచర్స్‌లో షార్ట్స్‌ ఎక్కువగా పోగయి ఉంటాయని, అందుకే

టాప్‌ టెన్‌ మిడ్‌క్యాప్‌ రికమండేషన్లు

Monday 3rd June 2019

సమీప భవిష్యత్‌లో మంచి రాబడినిచ్చే టాప్‌టెన్‌ చిన్న స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. నిర్మల్‌బ్యాంగ్‌ సిఫార్సు: 1. టాటా కెమికల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 749. కన్జూమర్‌ వ్యాపారం వేరు చేయాలన్న కంపెనీ నిర్ణయం ఇకపై కెమికల్స్‌, స్పెషాలిటీ విభాగంపై ఎక్కువ ఫోకస్‌ పెట్టేందుకు దోహదం చేయనుంది. కంపెనీ చేపట్టిన క్యాపెక్స్‌తో వచ్చేఏడాది న్యూట్రిషన్‌, సిలిగా స్పెషాలిటీల్లో మంచి వృద్ధి నమోదుకానుంది. త్వరలో కంపెనీ రీరేటింగ్‌కు ఛాన్సులున్నాయి. కంపెనీ సబ్సిడరీ ర్యాలీస్‌

Most from this category