News


కుబేరుల సంపద తగ్గింది!

Friday 8th November 2019
news_main1573208393.png-29454

యూబీఎస్‌, పీడబ్ల్యుసీ నివేదిక 
గతేడాది ప్రపంచ ధనికుల సంపద అంతకుముందేడాది(2017)తో పోలిస్తే తగ్గిందని యూబీఎస్‌ అండ్‌ పీడబ్ల్యుసీ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ టెన్షన్లు, ఈక్విటీ మార్కెట్ల ఒడిదుడుకులు... బిలియనీర్ల సంపద తగ్గేందుకు దోహదం చేశాయని వివరించింది. ప్రపంచ ధనవంతుల సంపద తగ్గడం పదేళ్ల తర్వాత ఇదే మొదటిసారని తెలిపింది. గతంలో 2008లో ప్రపంచ ధనికుల సంపద తరుగుదల నమోదు చేసింది. 2018లో అందరు కోటీశ్వరుల సంపద దాదాపు 40 కోట్ల డాలర్ల మేర తగ్గి 8.539 లక్షల కోట్ల డాలర్లను చేరిందని నివేదిక తెలిపింది. ముఖ్యంగా చైనాలో ధనికుల సంపద ఎక్కువగా తగ్గిందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కుబేరులు యూఎస్‌లో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉంది. 2018లో యూఎస్‌ చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ఇందుమూలంగా ఏర్పడ్డ రాజకీయ, ఆర్థిక అస్థిరతలు.. మదుపు చేసే పరిస్థితులను సంక్లిష్టం చేశాయని నివేదిక తెలిపింది. ఈ కారణాలతో ఎక్కువమంది పెట్టుబడులు పెట్టడం లేదా రుణాలు తీసుకోవడం కన్నా నగదు నిల్వలు దాచేందుకే ఎక్కువ ప్రాధానమిచ్చారని వివరించింది. 

దశాబ్ద కాలం తర్వాత కుబేరుల సంపద తగ్గడం ఇదే తొలిసారని యూబీఎస్‌ ప్రతినిధి జోసఫ్‌ స్టాడ్లర్‌ చెప్పారు. నివేదిక ప్రకారం చైనా కుబేరుల సంపద 12.8 శాతం తగ్గింది. అయితే ఇదే సమయంలో కొత్తగా ప్రతి రెండు, రెండున్నర రోజులకు ఒక కోటీశ్వరుడు చైనాలో తయారవుతున్నాడని నివేదిక తెలిపింది. ఇక కుబేరుల సంఖ్య విషయానికి వస్తే అమెరికా మినహా అన్ని ప్రాంతాల్లో బిలియనీర్లు తగ్గారని తెలిపింది. ఈ ఏడాది కొంత మేర పరిస్థితులు చక్కబడినా, ఇంకా శ్రీమంతుల కుటుంబాలు మందగమనం, బ్రెగ్జిట్‌, వాణిజ్యయుద్ధం తదితరాలపై ఆందోళనగానే ఉన్నారని, అందువల్ల నగదు దాచుకునేందుకే ఇష్టపడుతున్నారని నివేదిక తెలిపింది. క్రమంగా ఈ ఏడాది చివరకు ఈ ధోరణి మారి తిరిగి బిలియనీర్ల సంపద పెరగవచ్చని యూబీఎస్‌ సీఐఓ సైమన్‌ స్మైల్స్‌ అంచనా వేశారు. 



You may be interested

20కిపైగా కంపెనీలకు మూడీస్‌ షాక్‌!

Friday 8th November 2019

ప్రకటించిన మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ భారత ఎకానమీ అవుట్‌లుక్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన మూడీస్‌ తాజాగా పలు షేర్ల అవుట్‌లుక్‌ను పునఃసమీక్షించింది. ఈ సమీక్షలో ఆరు ఫైనాన్షియల్‌ సంస్థలు, 15నాన్‌ఫైనాన్షియల్‌ సంస్థల రేటింగ్‌ అవుట్‌లుక్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఐదు కంపెనీల రేటింగ్‌ అవుట్‌లుక్‌ను యథాతధంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దేశీయ విత్త దిగ్గజాలైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎగ్జిమ్‌బ్యాంక్‌, హీరో ఫిన్‌కార్‌‍్ప, హడ్కో, ఐఆర్‌ఎఫ్‌సీ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను స్థిరం నుంచి నెగిటివ్‌కి తగ్గించినట్లు మూడీస్‌

సిప్‌ పెట్టుబడులు తగ్గాయ్‌: ఏఎంఎఫ్‌ఐ

Friday 8th November 2019

 సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ఇన్‌ఫ్లో అక్టోబర్‌ నెలలో  స్వల్పంగా తగ్గిందని మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ ఇండియా(ఏఎంఎఫ్‌ఐ) శుక్రవారం ప్రకటించింది. ఈ నెలలో సిప్‌ల ప్రవాహం రూ. 8,262 కోట్ల నుంచి రూ. 8,245 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కానీ మొత్తం సిప్‌ ఖాతాలు ఈ నెలలో 4.74 లక్షలు పెరిగి 2.18 కోట్లకు చేరింది. అంతేకాకుండా సిప్‌ల ద్వారా నిర్వహిస్తున్న ఆస్తి(ఏయూఎం) రూ. 14,600 కోట్లు పెరిగి, రూ. 3

Most from this category