News


వచ్చే మూడేళ్లలో ట్రిలియన్‌ డాలర్లకు ఎగుమతులు

Wednesday 26th June 2019
news_main1561535854.png-26590

  • భారత ఎగుమతి సంస్థల సమాఖ్య అంచనా

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఎగుమతులు గణనీయంగా పెరగనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం 535 బిలియన్‌ డాలర్లుగా ఉన్న దేశీ ఎగుమతులు.. వచ్చే మూడేళ్లలో ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరనున్నాయని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఈఓ) అంచనావేసింది. లాజిస్టిక్స్ రంగంలో అభివృద్ధి, మౌళిక సదుపాయాల నిర్మాణం ఎగుమతులకు ఊతం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ‘లాజిస్టిక్స్ (సరుకు రవాణా) రంగం వ్యయ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించడం, వ్యాపార సులభతరంలో మరింత మెరుగుదల, ఎగుమతిదారులకు ప్రభుత్వ విధానాలు సక్రమంగా అమలుకావడం, పన్నులు సకాలంలో తిరిగిరావడం వంటి సానుకూల అంశాలతో భారత ఎగుమతులు పేర్కొన్న మేరకు చేరుకునే అవకాశం ఉంది’ అని ఎఫ్‌ఐఈఓ అధ్యక్షుడు గణేష్ కుమార్ గుప్తా అన్నారు. లాజిస్టిక్స్ వ్యయాన్ని 10 శాతం తగ్గించడం వల్ల దేశీ ఎగుమతులను 5-8 శాతం పెంచవచ్చని విశ్లేషించారు. కొత్త టెక్నాలజీ, మెరుగైన పెట్టుబడులు, అడ్డంకులను తొలగించడంపై దృష్టి సారించడం, ఇంటర్ మోడల్ రవాణా, ఆటోమేషన్, క్లియరెన్స్‌లకు సింగిల్ విండోతో పాటు ప్రక్రియలను సులభతరం చేయడం ద్వారా ఎగుమతులకు ఊతమివ్వచ్చని వివరించారు. You may be interested

ఇన్సూరెన్స్‌ భవిష్యత్‌ బాగుంది: సెంట్రమ్‌ బ్రోకింగ్‌

Wednesday 26th June 2019

పార్మా రంగానికన్నా ఐటీ రంగమే మంచిది వచ్చే  3-4 నెలలో ఆటో రంగం ​ఒత్తిడికి లోనయ్యే అవకాశం కానీ లాంగ్‌ టెర్మ్‌ పెట్టుబడులతో మంచి లాభాలు పొందవచ్చు ఇన్సూరెన్స్‌ రంగంలో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ: జగన్నాథం తునుగుంట్ల పార్మారంగంలో ఇన్వెస్ట్‌ చేయడం కన్నా అధిక మూలధనమున్న ఐటీ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమని, ఆర్బీఐ ప్రభుత్వానికి నగదు ఇస్తే రూపీ బలహీనత పెరుగుతుందని అది ఐటీ రంగానికి మంచిదేనని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీనియర​ వైస్‌ప్రెసిడెంట్‌,

రిలయన్స్‌ రూ.12,900 కోట్ల రుణాలు

Wednesday 26th June 2019

విదేశీ సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు  సీఎస్‌ఆర్‌ నిధులు మళ్లించలేదని స్పష్టీకరణ న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ విదేశీ సంస్థల నుంచి రూ.12,900 కోట్ల (185 కోట్ల డాలర్లు) రుణాలు తీసుకుంది. భవిష్యత్తు పెట్టుబడుల ప్రణాళికల నిమిత్తం వివిధ విదేశీ సం‍స్థల నుంచి ఈ రుణాలు తీసుకున్నామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. సాధారణ వ్యాపార అవసరాల కోనం ఆయా సంస్థల నుంచి దీర్ఘకాలిక రుణ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. అయితే రుణాల కాలపరిమితి, వడ్డీరేట్లు

Most from this category