STOCKS

News


అయిదు నిముషాల్లోనే బ్యాటరీ చార్జింగ్‌

Friday 16th August 2019
news_main1565933807.png-27805

ఆటోను అభివృద్ధి చేసిన అదరిన్‌ ఇంజనీరింగ్‌
అక్టోబరు నుంచి భారత్‌లో అందుబాటులోకి
హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- భారత ఆటోమొబైల్‌ రంగంలో ఇప్పుడు ‘ఎలక్ట్రిక్‌’ హాట్‌ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఉన్న కంపెనీలు అధిక సామర్థ్యమున్న బ్యాటరీల తయారీపై ఫోకస్‌ చేశాయి. ఈవీ టెక్నాలజీలో ఉన్న సింగపూర్‌ సంస్థ షాడో గ్రూప్‌ అనుబంధ కంపెనీ అయిన బెంగళూరుకు చెందిన అదరిన్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీస్‌ ఓ అడుగు ముందుకేసి అల్ట్రా కెపాసిటర్‌ బ్యాటరీని అభివృద్ధి చేసింది. అయిదు నిముషాల్లోనే చార్జింగ్‌ పూర్తి అవడం దీని ప్రత్యేకత. ఎరిక్‌ పేరుతో రూపొందించిన త్రిచక్ర వాహనానికై ఈ బ్యాటరీని తయారు చేశారు. బ్యాటరీని ఒకసారి చార్జింగ్‌ చేస్తే వాహనం 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌ ఈ టెక్నాలజీని ధ్రువీకరించింది. అంతేకాదు 10 ఏళ్లపాటు మన్నుతుందని స్పష్టం చేసిందని షాడో గ్రూప్‌ కో-సీఈవో సౌరభ్‌ మార్కండేయ సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. డీజిల్‌ వాహనంతో పోలిస్తే ఖర్చు 25-30 శాతం తగ్గుతుందని చెప్పారు.
గంటకు 50 కిలోమీటర్ల వేగం..
ఎరిక్‌ బ్రాండ్‌లో ప్యాసింజర్‌ వేరియంట్‌తోపాటు కార్గో రకం కూడా రూపొందించారు. ప్యాసింజర్‌ వాహనం గంటకు 50 కిలోమీటర్లు, కార్గో మోడల్‌ 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కార్గోలో 550 కిలోల సరుకు రవాణా చేయవచ్చు. రెండు రకాల బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చామని సౌరభ్‌ మార్కండేయ తెలిపారు. ‘అల్ట్రా కెపాసిటర్‌ బ్యాటరీ జీవిత కాలం 10 ఏళ్లు. ధర రూ.4 లక్షలు. లిథియం అయాన్‌ బ్యాటరీ జీవితం కాలం రెండున్నరేళ్లు. చార్జింగ్‌కు 8 గంటల సమయం పడుతుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 80-100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ధర రూ.1 లక్ష ఉంది. అల్ట్రా కెపాసిటర్‌ అభివృద్ధికి రెండేళ్లు పట్టింది. ఈ మోడల్‌ వాహనాలు ఇండోనేషియాకు ఎగుమతి చేయనున్నాం. భారత్‌లో క్యాబ్‌ అగ్రిగేటర్లు, లాజిస్టిక్స్‌ కంపెనీలతో మాట్లాడుతున్నాం. 2019 అక్టోబరు నుంచి మార్కెట్లో వాహనం అందుబాటులో ఉంటుంది’ అని వివరించారు. పుణేలో ఉన్న ప్లాంటు కోసం షాడో గ్రూప్‌ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. You may be interested

ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లకు రేటింగ్‌ షాక్‌

Friday 16th August 2019

10శాతం నష్టపోయిన షేర్లు గృహ, ఫైనాన్స్‌ రంగంలో సేవలు అందించే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌ (ఐబీహెచ్) షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 10శాతం పతనమయ్యాయి. మూడీస్‌ రేటింగ్‌ ఏజెన్సీ కార్పోరేట్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. దేశీయంగా ఐబీహెచ్‌తో పాటు ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు నిధుల లభ్యత, నిధుల సమీకరణ వ్యయాలపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల నేపథ్యంలో కంపెనీ దీర్ఘకాలిక కార్పొరేట్‌ రేటింగ్‌ను బీఏ1 నుంచి బీఏ2కి డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్

పాజిటివ్‌గా ఐషర్‌మోటర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌

Friday 16th August 2019

జూన్‌ 2007 తర్వాత అమెరికాలో, ఇన్వెర్టడ్‌ ఈల్డ్‌ కర్వ్‌ ఏర్పడడంతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన యుఎస్‌ ఆర్థిక మాంద్యం వైపు కదులుతోందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి శుక్రవారం కొనసాగుతోంది. అంతర్జాతీయ ప్రభావం వలన దేశియ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. కాగా నిఫ్టీ ఆటో షేర్లు శుక్రవారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన ఎంఆర్‌ఎఫ్‌ 0.08 శాతం, ఐషర్‌

Most from this category