News


బ్యాంకుల్లో రూ.1.85 లక్షల కోట్ల మోసాలు

Wednesday 10th July 2019
news_main1562742817.png-26951

  • 11 ఏళ్లలో నమోదైన కేసులు 44,016

న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో గత పదకొండు ఏళ్లలో (2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 వరకు) 44,016 మోసం కేసులు నమోదు కాగా, వీటి ప్రభావం రూ.1,85,624 కోట్లుగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ రాజ్యసభకు తెలిపారు. అత్యధికంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 25,883 కోట్లకు సంబంధించి 3,927 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరం 2017-18లో మోసం కేసులు 4,228కు పెరిగిపోయాయి. కాకపోతే బ్యాంకులపై వీటి ప్రభావం రూ.9,866 కోట్లుగా ఉంది. 2018-19లో 2,836 మోసాలు జరగ్గా, వీటితో ముడిపడిన ఆర్థిక ప్రభావం 6,734 కోట్లుగా ఉంది. బ్యాంకుల్లో మోసాలు తగ్గించేందుకు అన్ని రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుందని ఠాకూర్‌ తెలిపారు. రూ.50 కోట్లకు పైగా విలువైన ఎన్‌పీఏ ఖాతాలకు సంబంధించి ఏదైనా మోసం ఉందా అని పరిశీలన కూడా చేసినట్టు చెప్పారు. విదేశాలకు వెళ్లి భారత కోర్టుల పరిధిలో విచారణ తప్పించుకోవాలని చూసే వారిని నిరోధించే లక్ష్యంతో, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం, 2018ని కూడా సవరించామని వివరించారు. ఈ చట్టం కింద పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చన్నారు. రూ.50 కోట్లకు పైగా రుణాలను తీసుకునే కంపెనీల ప్రమోటర్లు లేదా డైరెక్టర్ల పాస్‌పోర్ట్‌లను తీసుకోవడం, లుకవుట్‌ నోటీసులు జారీ చేసే అధికారాలను బ్యాంకులకు కట్టబెట్టినట్టు మంత్రి తెలిపారు. 
నగదు లభ్యత మిగులుకు... 
వ్యవస్థలో నగదు లభ్యత జూన్‌ ఆరంభంలో మిగులుకు మళ్లిందని అనురాగ్‌ ఠాకూర్‌ మరో సభ్యుని ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ‘‘వ్యవస్థలో నగదు లభ్యత మిగులు, లోటు అన్నది ఆర్‌బీఐ ఏ మేరకు నిధులను సర్దుబాటు చేసుకుంటోంది, అందుబాటులోకి తీసుకొస్తుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం... ఈ ఏడాది ఏప్రిల్‌లో రోజువారీ సగటు నగదు లభ్యత వ్యవస్థలో రూ.70,004 కోట్ల లోటు ఉండగా, మే నెలలో రూ.33,400 కోట్లకు తగ్గింది. జూన్‌లో రోజువారీ సగటు లిక్విడిటీ రూ.51,710 కోట్ల మిగులకు చేరుకుంది’’అని మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వివరించారు. 



You may be interested

ముదిరిన వివాదం..ఇండిగో 17 శాతం పతనం

Wednesday 10th July 2019

ఇండిగో ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌ మధ్య వివాదం సెబీ వరకు వెళ్లడంతో బుధవారం(జులై 10) ట్రేడింగ్‌లో ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ షేరు విలువ 17 శాతం నష్టపోయింది. ఇండిగో సంస్థలో కార్పోరేట్‌ పాలన నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని, ఇండిగో నుంచి భాటియా ఐజీఈ గ్రూప్‌లోని ఇతర యూనిట్లకు అక్రమ లావాదేవిలు జరుగుతున్నాయని గంగ్వాల్‌ సెబీకి జులై 9న లేఖ రాశారు. గంగ్వాల్‌ రాసిన లేఖకు ప్రతి

చైనాతో తగ్గిన ద్వైపాక్షిక వాణిజ్యం

Wednesday 10th July 2019

ఈ ఏడాది ఐదు నెలల్లో 3.59 శాతం తక్కువ బీజింగ్‌: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో చైనాతో, మన దేశ ద్వైపాక్షిక వాణిజ్యం 3.59 శాతం తగ్గి 36.87 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్టు చైనా కస్టమ్స్‌ విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. వాణిజ్య లోటు 2017లో 51.72 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, అది 2018లో 57.86 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. తొలి ఐదు నెలల్లో చైనాకు

Most from this category