News


మొండి బకాయిల్ని దాస్తున్న ఎనిమిది బ్యాంకులు!

Friday 29th November 2019
news_main1575025119.png-29960

ఎన్‌పీఏ(నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌)లుగా చూపాల్సిన మొండి బకాయిల్ని, బ్యాంకులు ఎంత మేరకు ఎన్‌పీఏలుగా గుర్తిస్తున్నాయో తెలుసుకునేందుకు ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) నాలుగేళ్ల తర్వాత బ్యాంకుల ఆస్తి నాణ్యతను సమీక్షించింది. కాగా ఈ సమీక్షలో కనీసం ఎనిమిది బ్యాంకులు నియంత్రణ సంస్థ అంచనాల కంటే తమ ఎన్‌పీఏలను తక్కువగా చేసి నివేదించడం గమనార్హం. అంతేకాకుండా నియంత్రణ సంస్థ నిర్ధేశించిన స్థాయి కంటే, ఈ బ్యాంకులు తక్కువగా  ప్రోవిజన్లను ఏర్పాటు చేశాయి. కాగా స్టాక్‌ ఎక్సేంజిల ఫైలింగ్‌ ప్రకారం ఈ ఎనిమిది బ్యాంకులు మొత్తంగా రూ. 9,363 కోట్లను మొండి బకాయిల నుంచి తగ్గించాయి. ఇందులో రూ. 3,277 కోట్లను ఒక్క యస్‌ బ్యాంకే తగించడం గమనార్హం. కాని ఈ మొండిబకాయిల ఖాతాలను ఆర్‌బీఐ గుర్తించిన తర్వాత యస్‌ బ్యాంక్‌ స్పందించింది. ఈ ఖాతాలను బ్యాంక్‌ అప్పటికే బలహీన ఖాతాలుగా గుర్తించిందని తెలిపింది. 
    చాలా వరకు బ్యాంకుల  బ్యాడ్‌ లోన్‌ల శాతం తక్కువగా ఉండడంతో ఎన్‌పీఏలను తక్కువగా చూపడం కనిష్టంగా ఉంది. ఒక్క యస్‌ బ్యాంక్‌ మాత్రమే వాస్తవంగా నివేదించిన బ్యాడ్‌లోన్‌ల కంటే 15 శాతం తగ్గించి చూపింది. కాగా ఈ తగ్గింపు చర్యలను పబ్లిక్‌కు ప్రకటించాలనే నిబంధనను ఆర్‌బీఐ 2017లో తీసుకొచ్చింది. అంతేకాకుండా 15 శాతానికి మించి తక్కువగా నివేదిస్తే, ఆ ఖాతాలను బ్యాంక్‌ తన నోట్స్‌లో ఖచ్చితంగా వెల్లడించాలని అప్పుడు ఆర్‌బీఐ పేర్కొంది.  ఆస్తి నాణ్యత మార్పుపై ఆర్‌బీఐ నుంచి నోటిసులను పొందిన 24 గంటల్లోనే బ్యాంకులు బయటపెట్టాలని  నియంత్రణ సంస్థ , స్టాక్‌ ఎక్సేంజ్‌ బోర్డు నవంబర్‌ 1 వ తేదీన బ్యాంకులకు ఆదేశించాయి. ఇప్పటి వరకు ఈ షరతుల వలన ఎనిమిది బ్యాంకులు..అవి తక్కువగా చూపిన వివరాలను బయటకు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం 2018-19 లలో ఆర్‌బీఐ పర్యవేక్షణ నివేదికను వివిధ స్థాయిల వద్ద అందుకున్న బ్యాంకులలో చాలా వరకు బ్యాంకులు ఇప్పటి వరకు పూర్తి మార్పు వివరాలను ప్రకటించక పోవడం గమనార్హం. 
ప్రొవిజన్లు తగ్గించారు..
    ఈ ఎనిమిది బ్యాంకులు, బ్యాడ్‌లోన్‌లను తక్కువగా చూపడంతో పాటు, ప్రొవిజన్లు కూడా నియంత్రణ సంస్థ నిర్ధేశించిన స్థాయి కంటే తక్కువగా ఏర్పాటు చేశాయి. మొత్తంగా ఈ ఎనిమిది బ్యాంకులు ఏర్పాటు చేయవలసిన ప్రొవిజన్లు రూ. 9,566 కోట్లు తగ్గాయని బ్లూమ్‌బర్గ్‌ క్వింట్‌ వార్తా సంస్థ తెలిపింది. బ్యాడ్‌లోన్‌లకు సంబంధిం‍చి అధికంగా ప్రోవిజన్లను తగ్గించిన బ్యాంకులలో ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ రూ. 2,262 కోట్లతో ముందు వరుసలో ఉంది. కాగా ఈ ఏడాది మార్చి నుంచి ఈ బ్యాడ్‌ లోన్‌లకు సంబంధించి ప్రోవిజన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించామని, దీని ప్రభావం కూడా వచ్చే త్రైమాసిక నెంబర్లపై తక్కువగా ఉంటుందని ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో ప్రైవేట్‌ బ్యాంకులు యస్‌ బ్యాంక్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ వెల్లడించాయి.  
    తగినంత ప్రోవిజన్లను నిర్ణయించడంలో బ్యాంకులు, ఆర్‌బీఐ విభిన్నమైన దృక్పథాన్ని కలిగివుంటాయని ఐడీఎఫ్‌సీ సెక్యురిటీస్‌, ప్రధాన ఆర్థిక వేత్త ధనంజయ్‌ సిన్హా అన్నారు. ‘ఒక బ్యాంక్‌ అవసరానికన్నా తక్కువగా ప్రోవిజన్లను ఏర్పాటు చేసిందనే విషయంపై అవగాహన రావలంటే, ఆ ఖాతా ఎన్‌పీఏగా నిర్ధారించినప్పుడు ఎటువంటి పరిస్థితులలో ఉందో తెలుసుకోవాలి. ఒక ఖాతా ఏ విధంగా నడుస్తోంది, తనాఖా నాణ్యత, రుణాలను తిరిగి రికవరి చేసుకోగలిగే బ్యాంక్‌ సామర్ధ్యం వంటి అంశాలపై ఆధారపడి ఒక బ్యాంక్‌ ఎంత మొత్తంలో ప్రోవిజన్లను ఏర్పాటు చేయాలనేది నిర్ణయిస్తుంది’ అని ఆయన వివరించారు. ఆర్‌బీఐ అంచనా వేసిన ఎన్‌పీఏల కంటే బ్యాంక్‌ వెలువరించిన ఎన్‌పీఏలు అధికంగా ఉంటే తప్ప, ఇటువంటి తేడాలు గుర్తించడంలో లోపాలు ఉంటాయని ఇన్వెస్టర్లు అర్ధం చేసుకోవాలని సిన్హా తెలిపారు.  ప్రభుత్వరంగ బ్యాంకులు బ్యాడ్‌లోన్‌లపై తక్కువ ప్రొవిజన్లు ఏర్పాటు చేయడానికి కారణం, పన్ను అధికారుల నుంచి వీరు భయపడడమే’ అని అశికా స్టాక్‌ బ్రోకింగ్‌, హెడ్‌ రిసెర్చ్‌ అశుతోష్‌ మిశ్రా అన్నారు. ప్రభుత్వ బ్యాంకు అధిక ప్రొవిజన్లను ఏర్పాటు చేస్తే, వీటి లాభాలు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా ఇవి తక్కువ మొత్తంలో పన్నులు చెల్లించవలసి ఉంటుంది’ అని అన్నారు. ‘ప్రైవేట్ బ్యాంకులు బ్యాడ్‌లోన్‌లకు సంబంధించి అధికంగా ప్రొవిజన్లను ఏర్పాటు చేయడం వలన అవి పన్ను బాధ్యతను వాయిదా వేసుకోగలుగుతున్నాయి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఖచ్చితంగా పన్ను బాధ్యతను వాయిదా వేయలేవు. అలా చేస్తే వీటిపై పన్ను అధికారుల అధికంగా దృష్ఠి సారించే అవకాశం ఉంది’ అని మిశ్రా అన్నారు. ఆర్‌బీఐ ఐఆర్‌ఏసీ(ఇన్‌కమ్‌ రికగ్నిషన్‌ అండ్‌ అసెట్‌ క్లాసిపికేషన్స్‌) నిబంధనల ప్రకారం ఒక ఖాతా ఎన్‌పీఏగా గుర్తిస్తే, మొదటి ఏడాది ఆ బ్యాంక్‌ ఆ బ్యాడ్‌లోన్‌కు సంబంధించి 15 శాతం ప్రొవిజన్‌ను ఏర్పాటు చేయాలి. ఒక వేళ ఇది ఎన్‌పీఏగా నాలుగేళ్లు కొనసాగితే , బ్యాంక్‌ ఖచ్చితంగా ప్రొవిజన్‌ను 100 శాతం వరకు పెంచాల్సివుంటుంది.You may be interested

ఈ స్టాక్స్‌కు అంతర్జాతీయ బ్రోకరేజీల రేటింగ్‌లు

Saturday 30th November 2019

అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు పలు స్టాక్స్‌కు ఇచ్చిన సిఫారసులు ఇలా ఉన్నాయి..   ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ బ్రోకరేజీ సంస్థ సిటీగ్రూపు గ్లోబల్‌ మార్కెట్స్‌ ఈ షేరుకు రూ.266 టార్గెట్‌ ఇచ్చింది. సానుకూల వృద్ధికి తోడు మార్జిన్ల పెరుగుదల కొనసాగుతుందని అంచనా వేసింది. అదే సమయంలో కంపెనీ నికర రుణ భారం 2019-20లో పెరుగుతుందని పేర్కొంది.   ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు సిటీ రూ.450 టార్గెట్‌ ధరగా ఇచ్చింది. గతంలో ఇచ్చిన

ఇండియాబుల్స్‌... ఉదయం ర్యాలీ, మధ్యాహ్నం పతనం

Friday 29th November 2019

కేంద్ర మంత్రిత్వ శాఖ సానుకూల ‍ప్రకటనతో కోర్టు కేసులో సానుకూల వార్తలతో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్లో భారీగా లాభపడిన ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌ రియల్స్‌ ఎస్టేట్‌ షేర్లు మధ్యాహ్నం కల్లా భారీగా నష్టాలను చవిచూశాయి. కేసులో యాజమాన్య వాదనలకు ప్రభుత్వం నుంచి కొంత మద్దతు లభించడంతో పాటు సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజ్‌ సంస్థ షేరు టార్గెట్‌ను పెంచిన నేపథ్యంలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేరు

Most from this category