బ్యాంకు మోసాలపై సీవీసీ సలహాబోర్డు ఏర్పాటు
By Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో రూ.50 కోట్లకు పైన మోసాల కేసులను పరిశీలించి చర్యలను సూచించేందుకు గాను మాజీ సీవీసీ టీఎం భాసిన్ అధ్యక్షతన ఓ సలహా మండలి (అడ్వైజరీ బోర్డు)ని ఏర్పాటు చేస్తూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో నిజాయితీ నిర్ణయాల విషయంలో బ్యాంకులకు విచారణ వేధింపుల నుంచి రక్షణకు ఉంటుంది. నిజాయితీ నిర్ణయాలకు రక్షణ ఉండాలన్న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయానికి అనుగుణంగా సీవీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుంది. భారీ మోసాల కేసులను అడ్వైజరీ బోర్డు పరిశీలించడంతోపాటు, నిజాయితీగా తీసుకున్న వ్యాపార నిర్ణయమా లేక అందులో నేరపూరిత పాత్ర ఉందా అన్నది తేల్చనుంది. అనంతరం అడ్వైజరీ బోర్డు సూచించే చర్యలకు అనుగుణంగా సీవీసీ తదుపరి చర్యలు చేపడుతుంది. సీవీసీ తాజా నిర్ణయంపై కేంద్ర ఆర్థిక శాఖా కార్యదర్శి రాజీవ్ కుమార్ స్పందిస్తూ... వ్యాపార పరంగా బ్యాంకులు నిజాయితీతో కూడిన నిర్ణయాలను భయపడకుండా తీసుకునేందుకు వీలు కల్పిస్తుందన్నారు.
You may be interested
67 శాతం తగ్గిన ఎన్సీడీ నిధులు
Thursday 19th September 2019పెరిగిన డిఫాల్ట్‌లు తగ్గిన ఇన్వెస్టర్ల విశ్వాసం న్యూఢిల్లీ:- నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీ)ల ద్వారా కంపెనీల నిధుల సమీకరణ ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో 67 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు కాలానికి ఎన్సీడీల ద్వారా కంపెనీలు రూ.21,048 కోట్లు సమీకరించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఎన్సీడీల ద్వారా నిధుల సమీకరణ రూ.7,000 కోట్లకు తగ్గిందని సెబీ వెల్లడించింది. వివిధ కంపెనీలు చెల్లింపుల్లో విఫలం కావడం,
పావు శాతం ఫెడ్ రేట్ల కోత
Thursday 19th September 2019వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పావు శాతం(25 బేసిస్ పాయింట్లు) మేర తగ్గించింది. ఫెడ్ ఫండ్స్ రేటును ఇప్పుడున్న 2-2.5% శ్రేణి నుంచి 1.75-2 శాతం శ్రేణికి తగ్గించింది. ఫెడ్ రేట్లను తగ్గించడం ఈ ఏడాది రెండో సారి. మరోపక్క జీడీపీ అంచనాలను 2.2 శాతానికి ఫెడ్ పెంచింది. ఈ ఏడాది మరోసారి, లేదా రెండు సార్లు రేట్ల కోత ఉండాలని ఫెడ్ అధికారుల్లో ఐదుగురు