News


జనవరి 31 నుంచి బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె

Thursday 16th January 2020
news_main1579146039.png-30956

  • బడ్జెట్‌ రోజుకూ బ్యాంకులు బంద్‌లు

బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యాయి. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీన సమ్మె చేయాలని బ్యాంకు యూనియన్లు బుధవారం పిలుపునిచ్చాయి. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు ముందుకు సాగకపోవడంతో సమ్మెకు పిలుపునిస్తున్నామని తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్య వహిస్తున్న యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యుఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన సవరణను యుఎఫ్‌బీయూ కనీసం 15 శాతం పెంపును కోరుతుంది. 12.25 శాతం వేతనాల పెంపు, స్పెషల్‌ అలవెన్స్‌ను బేసిక్‌ పేలో కలపడం, వారానికి ఐదు రోజుల పని దినాలపై ఐబీఏ ఇచ్చిన ఆఫర్‌పై అంగీకారం కుదరలేదు. మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు కూడా సమ్మెను నిర్వహించనున్నట్లు తెలిపింది. అప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. 
బడ్జెట్‌ రోజున కూడా సమ్మె:- 
కేంద్రం జనవరి 31న ఆర్థిక సర్వేను విడుదల చేయనుంది.  మరుసటి రోజున ఫిబ్రవరి 1 శనివారం ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బ్యాంకు యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ రెండు కీలక రోజుల్లో పనిచేయవు. సాదారణంగా ఫిబ్రవరి 1 నెలలో మొదటి శనివారం కాబట్టి, అన్ని వాణిజ్య బ్యాంకులు బడ్జెట్ రోజున తెరిచి ఉండాలి.  బడ్జెట్ సందర్భంగా స్టాక్ ఎక్స్ఛేంజీలు కూడా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 



You may be interested

ట్రేడ్‌ డీల్‌పై అమెరికా-చైనాల సంతకాలు

Thursday 16th January 2020

అమెరికా, చైనా మధ్య తొలి దశ డీల్‌ ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌ సరికొత్త రికార్డ్స్‌ ఎట్టకేలకు అమెరికా, చైనా మధ్య వాణిజ్య మైత్రి కుదిరింది.​ ఏడాదిన్నర కాలంగా నలుగుతున్న వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా బుధవారం రెండు దేశాలూ తొలి దశ డీల్‌పై సంతకాలు చేశాయి. దీంతో బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు తొలుత రివ్వుమన్నాయి. మార్కెట్ల చరిత్రలో తొలిసారి డోజోన్స్‌ 29,000 పాయింట్లను తాకగా.. ఎస్‌అండ్‌పీ సైతం రికార్డ్‌ సృష్టించింది. డోజోన్స్‌ 0.3

నేడు నెగిటివ్‌ ఓపెనింగ్‌?!

Thursday 16th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు మైనస్‌ నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర ప్రతికూలం(నెగిటివ్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30 ప్రాంతం‍లో 20 పాయింట్ల  క్షీణించి 12,355 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,375 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ప్రతిఫలించే సంగతి  తెలిసిందే. కాగా.. చైనాతో వాణిజ్య వివాద పరిష్కారంలో భాగంగా

Most from this category