STOCKS

News


మొబైల్స్‌ తర్వాత ఆటోరంగంపై చైనా కంపెనీల కన్ను!

Monday 27th January 2020
news_main1580105697.png-31230

భారత మార్కెట్లో మెజార్టీ వాటా కొల్లగొట్టేందుకు యత్నాలు
ప్రధానంగా ఇ-వాహనాలపై దృష్టి
భారత ఐటీ, టెక్నాలజీ రంగాల్లోకి చైనా ఆక్రమణ చాలా నెమ్మదిగా స్లోపాయిజన్‌లాగా జరుగుతూ వస్తోంది. తొలుత నెమ్మదిగా ఆరంభమయ్యే చైనా ఆక్రమణ క్రమంగా ఉధృత రూపం దాలుస్తూ చివరకు అడుగు పెట్టిన రంగాన్ని శాసించేలా చేస్తుందన్నది టెలికం రంగ అనుభవాలు చెబుతున్నాయి. కొన్నేళ్లుగా అటు స్మార్ట్‌ఫోన్ల నుంచి ఇటు డిజిటల్‌పేమెంట్స్‌ వరకు, అటు ఇ- వాహనాల నుంచి ఇటు కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ వరకు చైనా కంపెనీలు భారత ఎకానమీలో చొచ్చుకుపోతున్నాయి. 2024 నాటికి 20 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా మారాలన్న నిశ్చయంతో ఉన్న చైనాకు భారత్‌ ఒక బంగారుగుడ్లుపెట్టే మార్కెట్‌లాగా కనిపిస్తోంది. చౌకగా వచ్చే చైనా ఉత్పత్తుల దెబ్బకు పలు రంగాల్లో దేశీయ కంపెనీలు డీలా పడుతున్నాయి. ఇందుకు ప్రధాన ఉదాహరణగా స్మార్ట్‌ ఫోన్‌ పరిశ్రమను చెప్పుకోవచ్చు. 2019 నాటికి భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో చైనా మొబైల్స్‌ వాటా 72 శాతానికి చేరింది. 2018లో ఈవాటా 60 శాతం. ఏడాదికేడాది చైనా మొబైల్స్‌ చొచ్చుకుపోతున్న తీరు ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యధిక శాతం వాటా బీబీకే గ్రూప్‌(37 శాతం)ది కాగా తర్వాత స్థానాల్లో షామీ(28 శాతం) ఉంది. దేశంలో అమ్ముడయ్యే అనేక స్మార్ట్‌ఫోన్స్‌లో సింహభాగం వాటా ఈ రెండు కంపెనీల బ్రాండ్స్‌దే కావడం గమనార్హం. షామీ ఏకంగా ఇండియాలో తన మొబైల్‌ ఉత్పత్తి యూనిట్‌ను పెట్టింది. దీంతో పాటు స్మార్ట్‌టీవీ ఉత్పత్తి ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. దేశీయ వ్యాపారంలోకి షామీ దాదాపు రూ. 3500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. బీబీకే గ్రూప్‌ దాదాపు రూ. 7500 కోట్లతో ఇండియాలో విస్తరణ చేపడుతోంది. వీటి దెబ్బకు దేశీయ మొబైల్‌ ఉత్పత్తి సంస్థలు మైక్రోమ్యాక్స్‌, ఇంటెక్స్‌, లావా, కార్బన్‌లు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్రాండ్స్‌ మరలా మార్కెట్‌ వాటా కొల్లగొట్టడం అసాధ్యంగా కనిపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. 
కారణాలేంటి?
చైనా కంపెనీలు స్వల్పకాలంలోనే మన మార్కెట్‌ పరిస్థితులు, కస్టమర్ల మూడ్‌, మన కొనుగోలు విధానాల్లాంటి వాటిపై తీవ్ర అధ్యయనం జరిపి చొచ్చుకుపోయాయని విశ్లేషించారు. దీనికితోడు చైనా కంపెనీలు కావాల్సినంత పెట్టుబడులు పెట్టగలిగే సత్తా ఉన్నాయని, దీంతో దేశీయ కంపెనీలు వీటితో పోటీ పడలేకపోయాయని వివరించారు. చాలా వరకు దేశీయ బ్రాండ్లు ప్రస్తుతం ఫీచర్‌ ఫోన్‌ విభాగంలో అమ్మకాలు జరుపుకుంటూ మనుగడ కొనసాగిస్తున్నాయి. దేశీయ స్మార్ట్‌ ఫోన్‌ రంగంపై పట్టు సాధించిన చైనా కంపెనీలు ఇక భారత ఆటో రంగంపై కన్నేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎంజీ మోటర్స్‌, బీవైడీ, గ్రేట్‌వాల్‌, ఎఫ్‌ఏడబ్ల్యులాంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ సత్తా చాటుతున్నాయి. ఇదే సమయంలో దేశీయ ఆటో కంపెనీలు నీరసంగా కొనసాగుతున్నాయి. కానీ చైనా కంపెనీల విక్రయాలు బాగుండడమే కాకుండా ముందస్తు ఆర్డర్లు కూడా భారీగా సంపాదిస్తున్నాయి. గతేడాది ప్రవేశపెట్టిన హెక్టర్‌ ఎస్‌యూవి ఇప్పటికి 16వేల యూనిట్లు అమ్ముడుపోయింది. మరో 20వేల యూనిట్లకు ఆర్డర్లున్నాయి. తమ వాహనాలకు లభిస్తున్న ఆదరణతో చైనా దిగ్గజాలు ఇండియాలో ఉత్పత్తి ప్లాంట్లు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఇ- బైక్స్‌ తయారీ సంస్థ సుర్నా త్వరలో భారత్‌లో పెద్ద ప్లాంటు నెలకొలిపి భారీగా ఇబైక్స్‌ అమ్మాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే రెండు మోడల్స్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. మరో ఆరు మోడల్స్‌ అనుమతుల కోసం చూస్తున్నాయి. దేశీయ ఇ-వాహన మార్కెట్‌ 2023 నాటికి 200 కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. దీంతో ఈ రంగంలో భారీగా చొచ్చుకుపోయేందుకు చైనా కంపెనీలు తయారవుతున్నాయి. వీటి యత్నాలన్నీ ఫలిస్తే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లాగా ఆటోమొబైల్‌ మార్కెట్‌ నిండా కూడా చైనా వాహనాలే ఉంటాయేమోనని నిపుణులు భావిస్తున్నారు. You may be interested

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Monday 27th January 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మెటల్‌ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. కరోనా వైరస్‌ వల్ల సంభవించే వ్యాధి మరింత ఉధృత రూపం దాల్చవచ్చనే అంచనాలతో చైనాతో పాటు అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలు తెరపైకి వచ్చాయి. ఈ ప్రతికూల ప్రభావంతో మెటల్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌

నేటి వార్తల్లోని షేర్లు

Monday 27th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఈఐహెచ్‌: ఈఐహెచ్‌ క్యూ3 నికర లాభం 5.3 శాతం పెరిగి రూ.95 కోట్లకు చేరింది. వార్షికప్రాతిపదికన  ఆదాయం 3.8 శాతం తగ్గి రూ.505.5 కోట్లుగా నమోదైంది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: ఈ కంపెనీ క్యూ3 నికర లాభం 88.3 శాతం పెరిగి రూ.187 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 11 శాతం తగ్గి రూ.18,055 కోట్లుగా నమోదైంది. ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌: ఈ

Most from this category