News


10 నుంచి అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్’

Saturday 6th October 2018
news_main1538802858.png-20916

న్యూఢిల్లీ: దసరా సందర్భంగా ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌... ‘గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్’ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 10 నుంచి 15 వరకు జరిగే సేల్‌లో 4 లక్షల మంది అమ్మకందారులు తమ ఉత్పత్తులను అందించనున్నారని వెల్లడించింది. ప్రైమ్ మెంబర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ... వీరికి ప్రత్యేకంగా 9న మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ ప్రారంభం కానుంది. ప్రైమ్‌ సభ్యులు కానివారికి మాత్రం 10వ తేదీన సేల్‌ ఆరంభమవుతుంది. అదే రోజు డెలివరీ, అమేజాన్‌ పే ఈఎంఐ ద్వారా జీరో- కాస్ట్‌ సౌకర్యం, క్యాష్‌ ఆన్‌ డెలివరీ, ఉదయం వేళ డెలివరీ వంటి అనేక వెసులుబాట్లు కల్పిస్తూ ఫెస్టివల్ ప్రారంభం కానుందని అమెజాన్‌ తెలియజేసింది.You may be interested

టెకీ నిర్మాణాలొచ్చేశాయ్‌!

Saturday 6th October 2018

 సాక్షి, హైదరాబాద్‌: పునాది, శ్లాబ్, గోడలు, రంగులు, అలంకరణ సామగ్రి.. సంప్రదాయ పద్ధతిలో ఇంటి నిర్మాణమంటే ఇదే! కానీ, నిర్మాణ రంగంలో టెక్నాలజీ ఎంట్రీ అయ్యాక.. పునాదుల నుంచి నిర్మాణ పూర్తయ్యే వరకూ ప్రతి దశలోనూ సాంకేతికత చేరింది. వేగం, నాణ్యతతో పాటూ నిర్మాణ వ్యర్థాల విడుదల, వ్యయం, కార్మికుల వినియోగం తగ్గింపే టెక్నాలజీ వినియోగం ప్రధాన ఎజెండా. ప్రస్తుతం దేశీయ రియల్టీ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది. వినూత్న డిజైన్స్, నిర్మాణ

బైక్‌ రైడ్‌ కావాలా? అయితే ‘రాపిడో’..!!

Saturday 6th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మెట్రో నగరాల్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణించాలంటే? బస్సు, క్యాబ్‌ లేదా ఆటో తప్పనిసరి. వీటి చార్జీలూ కాస్త ఎక్కువే.. పైగా ట్రాఫిక్‌ సమస్య! అందుబాటు ధరలో.. సులువైన, సురక్షితమైన ప్రయాణం చేయాలంటే? బైక్‌ కరెక్ట్‌!! అలా అని సొంతంగా బైక్‌లను కొని అద్దెకివ్వాలంటే.. పెద్ద మొత్తంలోనే పెట్టుబడి కావాలి. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించారు ఐఐటీ భువనేశ్వర్‌ పూర్వ విద్యార్థుల త్రయం.

Most from this category