News


వృద్ధి రేటు అంచనాకు ఏడీబీ మరోసారి కోత

Thursday 18th July 2019
news_main1563440635.png-27159

భారత్‌ వృద్ధి అంచనాను ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్(ఏడీబీ) మరోసారి కోత విధించింది. ఏడీబీ ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ అవుట్‌లుక్‌ (ఏడీఓ) 2019 నివేదికను గురువారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) గానూ భారత్‌ వృద్ధి 7శాతం మాత్రమే నమోదవుతుందని అంచనా వేసింది. ఇంత క్రితం ఇదే ఏడాది(2019) ఏప్రిల్‌లో దేశీయ వృద్ధిరేటు అంచనా 7.2 శాతంగా ఉంటుందని బ్యాంకు అంచనా వేసింది. ఆర్థిక ఆందోళనలు వృద్ధి రేటు తగ్గింపునకు కారణమని బ్యాంకు చెప్పుకొచ్చింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని ఏడీబీ తన నివేదికలో తెలిపింది. అంచనా వృద్ధి కోత విధించినప్పటికీ.., దక్షిణ ఆసియా ప్రాంతంలో భారత్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా బ్యాంకు తెలిపింది. గతనెలలో భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ) తొలగిస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటనతో మొత్తం దేశీయ ఎగుమతుల్లో 1.8% మాత్రమే ప్రయోజనం పొందిందని బ్యాంక్ పేర్కొంది. 



You may be interested

ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండేషన్లు

Thursday 18th July 2019

వచ్చే ఆరు నెలల కాలంలో మంచి లాభాన్నిచ్చే రెండు షేర్లను ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండ్‌ చేస్తోంది. 1. దివిస్‌ ల్యాబ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1890. స్టాప్‌లాస్‌ రూ. 1515. ఇటీవలే షేరు మంచి కన్సాలిడేషన్‌ పూర్తి చేసుకుంది. దీంతో ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ ఓవర్‌బాట్‌ నుంచి దిగివచ్చింది. దీంతో షేరులో తాజా ఎంట్రీకి ఆస్కారం ఏర్పడింది. వీక్లీ చార్టుల్లో షేరు హయ్యర్‌ టాప్‌, బాటమ్‌ ఏర్పరుస్తోంది. ఇది అప్‌ట్రెండ్‌ కొనసాగింపు సంకేతం.

11770 వద్ద నిఫ్టీకి నిరోధం

Thursday 18th July 2019

మార్కెట్లు బడ్జెట్‌ అనంతరం పతనం చవిచూసి ప్రస్తుతం కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మారాయి. కొన్ని రోజులుగా నిఫ్టీ 11460 పాయింట్లను కాపాడుకుంటూ చిన్నపాటి బౌన్స్‌ బ్యాక్‌ చూపింది. ప్రస్తుతానికి నిఫ్టీ ట్రెండ్‌ స్వల్పంగా పాజిటివ్‌గానే ఉందని, కానీ సూచీల్లో జోరు కనిపించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండు రోజులుగా మార్కెట్లో లిక్విడిటీ కొరత కారణంగా చిన్న కదలికలే నమోదు కావడం గమనించవచ్చన్నారు. చార్టుల్లో స్పిన్నింగ్‌ టాప్‌ క్యాండిల్‌ ఏర్పడి ట్రెండ్‌ న్యూట్రల్‌గా

Most from this category