News


విరాల్‌ నిష్క్రమణతో మరో 25బీపీఎస్‌ రేట్‌కట్‌?!

Monday 24th June 2019
news_main1561358534.png-26526

నోమురా అంచనా
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా విరాల్‌ ఆచార్య రాజీనామా చేశారు. మరో ఆరునెలల కాలపరిమితి ఉండగానే ఆయన పదవి నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే కేంద్రబ్యాంకులో రేట్ల తగ్గింపుపై నెలకొన్న వైరుధ్యాలే విరాల్‌ రాజీనామాకు కారణమని నిపుణులు భావిస్తున్నారు. మానిటరీ పాలసీ, ఎకనమిక్‌అండ్‌ పాలసీ రిసెర్చ్‌ శాఖలకు విరాల్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించేవారు. ప్రభుత్వానికి, ఆయనకు ఆర్‌బీఐ స్వతంత్రత విషయంలో విబేధాలు ఉన్నాయి. గతేడాది ఆయన వెలువరించిన ఉపన్యాసంలో ఆర్‌బీఐ స్వతంత్రత గురించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారని ప్రముఖ బ్రోకరేజ్‌ నోమురా తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా పెద్దగా ఆశ్చర్యం కలిగించేదికాదని పేర్కొంది. ఆయన వైదొలగడంతో ఎంపీసీ ఇకపై మరింత డోవిష్‌(రేట్ల తగ్గింపునకు అనుకూలం)గా వ్యవహరిస్తుందని అంచనా వేసింది. కమిటీలో ఆయన మాత్రమే హాకిష్‌(రేట్ల తగ్గింపునకు ప్రతికూలం)గా ఉండేవారని గుర్తు చేసింది. కమిటీలో ఆయన లేకపోవడంతో రాబోయే రోజుల్లో వడ్డీరేట్లు మరింత తగ్గవచ్చని అభిప్రాయపడింది. ఆర్‌బీఐ మరో 25 బీపీఎస్‌ రేట్‌ కట్‌ చేసేందుకు విరాల్‌ నిష్క్రమణ దారితీయవచ్చని అంచనా వేసింది. ఆర్‌బీఐ, ఇతర బ్రోకరేజ్‌లు వేసిన వృద్ధి అంచనాలకు భిన్నంగా నిజవృద్ధి ఉండడం, ద్రవ్యోల్బణం అంచనాలకన్నా తక్కువగా ఉండడంతో ఆర్‌బీఐ ఆగస్టులో మరో 25 బీపీఎస్‌ మేర రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని పేర్కొంది. తదనంతర కాలంలో అంతర్జాతీయ లేదా దేశీయ కారణాలతో వృద్ధి ఆందోళనలు మరింత విస్తృతమైతే రేట్లను మరింత తగ్గించేందుకు సైతం ఎంపీసీ యోచించవచ్చని పేర్కొంది. 

 


RBI

You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం జంప్‌

Monday 24th June 2019

పరిమిత మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా ఉదయం ట్రేడింగ్‌లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 30,680.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో అనిశ్చితితో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నప్పటికీ, ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌,

ఇండస్‌ఇండ్‌లో హిందూజాల పెట్టుబడులు .2,700 కోట్లు

Monday 24th June 2019

 ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటర్లయిన హిందూజాలు రూ.2,700 కోట్లను వారెంట్ల ద్వారా పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ బ్యాంక్‌లో భారత ఫైనాన్స్‌ విలీనం తర్వాత ప్రమోటర్ల భాగస్వామ్యాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ స్ట్రాటజీ హెడ్‌ సంజయ్‌ మాలిక్‌ అన్నారు.‘బ్యాంక్‌లో తమ వాటాను 15 శాతానికి తిరిగి పెంచుకునేందుకు మా ప్రమోటర్లు రూ.2,700 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు’ అని ఆయన వివరించారు. నాల్గవ వంతు నగదును  విలీనం తర్వాత, మిగిలిన నగదు 18

Most from this category