STOCKS

News


ఆర్థిక ​ఉద్దీపన చర్యలుంటాయి: ప్రధాని

Thursday 15th August 2019
news_main1565847326.png-27769

దేశ ఆర్థిక పరిస్థితులను గురించి, వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన స్వాతంత్ర దినోత్సవ  ప్రసంగంలో మాట్లాడారు. వృద్ధి మందగమనాన్ని తగ్గించడానికి ఒక ఉద్ధీపన పథకాన్ని సిద్ధం చేయడంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిమగ్నమయ్యిందని వివరించారు. ఈ ఉద్దీపన ప్యాకేజీలో డిమాండ్ పెంచడానికి ప్రోత్సాహకాలు, కొన్ని పరిశ్రమలకు సంబంధించి-నిర్దిష్టమైన చర్యలు, సూపర్ రిచ్ సర్‌చార్జ్ నుంచి విదేశి పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించే చర్యలుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ధిక తిరోగమనం, తగ్గుతున్న వినియోగం వంటి ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌), ఈ ఏడాది దేశ జీడీపీ అంచనాలను తగ్గించిన విషయం గమనార్హం. 
   ప్రైవేటు రంగం, భారత దేశంపై ఉన్న విశ్వాసాన్ని కొనసాగించాలని, వ్యాపారం చేసుకోడానికి అనువైన ప్రదేశంగా ఇండియాను మార్చడానికి తన వంతు కృషి​ చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు. దీంతో పాటు మందగమన ఆందోళనల నేపథ్యంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ పరిశ్రమ రంగాలతో సమావేశాలు నిర్వహించారు. ఫైనాన్సియల్‌ మార్కెట్‌లు, ఆటో సెక్టార్‌ ఎదుర్కొంటున్న సమస్యలను గురించి, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో సహా కీలక రంగాలు ఎదుర్కొం‍టున్న సవాళ్లు, డిమాండ్‌ క్షీణత వంటి కీలకమైన అంశాలను గురించి, విదేశి పోర్టుపోలియో ఇన్వెస్టర్లతో సహా మార్కెట్లో పాల్గొనేవారు ప్రభుత్వానికి విన్నవించిన సంగతి తెలిసిందే. సూపర్ రిచ్ సర్‌చార్జ్‌ నుంచి ఎఫ్‌పీఐల మినహాయింపు, ఈక్విటీలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను(ఎల్‌టీసీజీటీ)ను తొలగించాలని ఈ ప్రతినిధులు ప్రభుత్వంతో లాబీయింగ్ చేశారని పరిశీలకులు తెలిపారు. 
     ఆటో రంగంపై విధిస్తున్న జీఎస్‌టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని, లాభదాయకమైన స్క్రాపేజ్ పాలసీ, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలను పెంచడానికి రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్ వంటి ఇతర ఛార్జీలను తగ్గించాలని ఆటో సెక్టార్‌ ప్రతినిధుల ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. వాహనాలపై జీఎస్టీ తగ్గింపును కేంద్రం ప్రతిపాదించాలా అనే దానిపై తుది నిర్ణయాన్ని (రెవెన్యూని పరిగణలోకి తీసుకొని)​ ప్రధాన మంత్రి తీసుకుంటారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించబోయే ప్యాకేజీలో టైర్ 2 నగరాలకు, జిల్లా, బ్లాక్ స్థాయిలో కొత్త ప్రజా రవాణా వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉంది. దీనితోపాటు రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్ ఛార్జీలను రాష్ట్రాలు తగ్గించడానికి రాష్ట్రాలకు ప్రోత్సాహాకాలను అందించే అవకాశం ఉంది. భారత ఆర్థిక వృద్ధి, మార్చి త్రైమాసికంలో ఐదేళ్ల కనిష్టానికి 5.8 శాతానికి పడిపోయింది. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు వృద్ధి అంచనాలను, ఆర్‌బీఐ 7 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. డిమాండ్‌ పుంజుకోడానికి గత నెలలో ఆర్‌బీఐ తన ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. You may be interested

నేడు మార్కెట్లకు సెలవు.

Thursday 15th August 2019

స్వాతంత్ర దినోత్సవ సందర్భం‍గా గురువారం మార్కెట్లకు సెలవు దినం. అందుచేత బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌, కమోడిటీ ఎక్సేంజ్‌లు కూడా నేడు సెలవు. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా శుక్రవారం (16న) ప్రారంభమవుతుంది. చైనా వస్తువులపై దిగుమతి సుంకాల విధింపును అమెరికా వాయిదా వేయడంతో పాటు దేశీయ ఆర్థిక గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్ల తగ్గింపునుకు మొగ్గుచూపవచ్చనే అంచనాలతో కొనుగోళ్లు పెరగడంతో బుధవారం

ఈ స్టాక్స్‌పై ఓ సారి లుక్కేయండి..!

Thursday 15th August 2019

గత నెలలో కేంద్ర బడ్జెట్‌ సమర్పణ నాటి నుంచి స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్‌ బాట పట్టాయి. గరిష్టాల నుంచి నిఫ్టీ 10 శాతం నష్టపోయింది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితుల్లోకి వెళ్లినట్టు ఆర్‌బీఐ సైతం పేర్కొనగా, అటు అంతర్జాతీయ ఆర్థిక రంగం పరిస్థితులు మరింత భయపెట్టేలా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయంటూ అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. రెండు

Most from this category