News


ఆర్థిక సర్వే.... 7% జీడీపీ వృద్ధి!

Thursday 4th July 2019
news_main1562220557.png-26782

ఎకనమిక్‌ సర్వే అంచనా
బడ్జెట్‌కు ముందస్తు పీఠికగా పేర్కొనే ఎకనమిక్‌ సర్వేను ప్రభుత్వం నేడు పార్లమెంట్‌ ముందుంచింది. రాబోయే రోజుల్లో ఎకానమీలో పాజిటివ్‌ సంకేతాలు కనిపిస్తాయని సర్వే అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం ఉంటుందని అంచనా వేసింది. పెట్టుబడుల రేటులో తిరోగమనం పూర్తయిన సంకేతాలున్నాయని తెలిపింది. తీరైన ఎంపీసీ కారణంగా వడ్డీరేట్లు దిగివస్తున్నాయని పేర్కొంది. జనవరి- మార్చిలో ఎన్నికల కారణంగా ఎకానమీలో స్తబ్దత నమోదయిందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం విత్తలోటు 5.8 శాతం ఉంటుందని అంచనా వేసింది. చమురు ధరలు ఇప్పటి స్థాయిల నుంచి మరింత దిగివస్తాయని తెలిపింది. ఎన్‌పీఏల్లో క్షీణత మూలధన వ్యయ సైకిల్‌లో పునరజ్జీవం తెస్తుందని పేర్కొంది. ట్రేడ్‌ వార్‌, అంతర్జాతీయ మందగమనం కారణంగా ఎగుమతులు ప్రభావితమవుతాయని వెల్లడించింది. 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే సరాసరిన 8 శాతం వృద్ధి నమోదు చేయాలని అంచనా వేసింది. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభాధారిత మందగమనం కరిగిపోతోందని, పెట్టుబడుల సైకిల్‌లో పాజిటివ్‌ సిగ్నల్స్‌ ఉన్నాయని తెలిపింది. 



You may be interested

50,000 పాయింట్ల స్థాయికి సెన్సెక్స్‌: మోతిలాల్‌ ఓస్వాల్‌

Thursday 4th July 2019

ప్రాథమిక సమస్యగా ఉన్నది రియల్‌ ఎస్టేట్‌ రంగమే ప్రభుత్వ పాలసీకి  చిహ్నంగా బడ్జెట్‌: మోతిలాల్‌ ఓస్వాల్‌  బీజేపీ అధిక మెజార్టీతో రెండవసారి అధికారంలోకి వచ్చింది. ఇలాంటి సమయంలో విదేశి పెట్టుబడులను ఆకర్షించడానికి కార్పోరేట్‌ సంపాదన వృధ్ది చాలా అవసరమని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ సీఎండీ మోతిలాల్‌ ఓస్వాల్‌ అన్నారు. రియల్‌ ఎస్టేట్‌​రంగంలోని కొన్ని కంపెనీలకు ప్రమాదకర రుణాలను ఇవ్వడం వలనే ఎన్‌బీఎఫ్‌సీలు సమస్యల్లో చిక్కుకున్నాయని ఆయన ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన

ఎస్‌బీఐ కొత్త రికార్డు

Thursday 4th July 2019

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) షేర్లు గురువారం కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లు రూ.367.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ భాగంగా ఎస్‌బీఐ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో ఎస్‌బీఐ షేర్లు 1.29శాతం పెరిగి రూ.370.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఇది షేరుకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.10:45ని.లకు షేరు గతముగింపు(రూ.366.15)తో పోలిస్తే

Most from this category