News


2024 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్లు అసాధ్యమే

Monday 13th January 2020
news_main1578885870.png-30872

  • ఆర్థికవేత్త నాగరాజ్‌

న్యూఢిల్లీ: 2024 నాటికి దేశ జీడీపీని 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా, దీన్ని ఆచరణ సాధ్యం కాని లక్ష్యంగా ప్రముఖ ఆర్థికవేత్త ఆర్‌ నాగరాజ్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని 2024 నాటికి సాధించాలంటే జీడీపీ వృద్ధి రేటు ఏటా 9 శాతం ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన జీడీపీ సుమారు 2.8 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఐదేళ్లలో రెట్టింపు అయితేనే కేంద్రం లక్ష్యం నెరవేరుతుంది. ఈ లక్ష్యం అసాధ్యమైనది కాకపోయినా, ఈ దశాబ్దంలో సాధ్యం కాకపోవచ్చని నాగరాజ్‌ పేర్కొన్నారు.  వృద్ధి రేటు పడిపోతున్న క్రమంలో ఈ లక్ష్యం ఊహించుకోలేని అత్యాశగా ఉందన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్‌ త్రైమాసికంలో 4.5 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. పెరిగిపోతున్న వాణిజ్య ఉద్రిక్తతల ధోరణి మారకపోవచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘జీడీపీలో భారత ఎగుమతుల నిష్పత్తి 2010 నుంచి క్రమంగా క్షీణిస్తోంది. ఈ ధోరణి మారుతుందన్న సంకేతాలు ఏవీ కనిపించడం లేదు’’ అని నాగరాజ్‌ తెలిపారు. గత కొన్నేళ్లుగా తగ్గుతున్న వడ్డీ రేట్లు ఏ విధంగానూ సాయపడలేదని, ద్రవ్య ప్రోత్సాహకాల అవసరం ఉందన్నారు. జీడీపీలో పెట్టుబడుల రేషియోను పెంచే విధంగా 2020-21 బడ్జెట్‌ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌లో ఆయన ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నేషనల్‌ అకౌంట్‌ స్టాటిస్టిక్స్‌ ఇటీవలి సవరణలోనూ పాలుపంచుకున్నారు. 



You may be interested

పంట రుణాల మాఫీ రూ. 4.7 లక్షల కోట్లకు

Monday 13th January 2020

గడిచిన పదేళ్లపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ముంబై:  గడిచిన పదేళ్లలో వివిధ రాష్ట్రాలు మాఫీ చేసిన వ్యవసాయ రుణాల పరిమాణం ఏకంగా రూ. 4.7 లక్షల కోట్లకు చేరింది. ఇది మొత్తం పరిశ్రమల మొండిబాకీల్లో (ఎన్‌పీఏ) దాదాపు 82 శాతం. ఎస్‌బీఐ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవస్థలో మొండిబాకీలు రూ. 8.79 లక్షల కోట్లుగా ఉండగా, వీటిలో వ్యవసాయ రంగ ఎన్‌పీఏలు

నేడు లాభాల ఓపెనింగ్‌?

Monday 13th January 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 పాయింట్లు ప్లస్‌ వారాంతాన యూఎస్‌ మార్కెట్ల వెనకడుగు నేడు(సోమవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నేటి(13న) ఉదయం  8.30 ప్రాంతం‍లో 46 పాయింట్లు ఎగసి 12,340 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జనవరి ఫ్యూచర్‌ 12,294 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కాగా.. డిసెంబర్‌లో ఉపాధి

Most from this category