News


150 మిలియన్‌ డాలర్లు సమీకరించిన జొమాటో

Saturday 11th January 2020
Markets_main1578713948.png-30848

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గుర్గావ్‌కు చెందిన ఫుడ్‌ డెలివరీ స్టార్టప్‌ జొమాటో తాజాగా 150 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. చైనాకు చెందిన అలీబాబా గ్రూప్‌ అనుబంధ సంస్థ యాంట్‌ ఫైనాన్షియల్‌ ఈ పెట్టుబడులు పెట్టిందని కంపెనీ తెలిపింది. టెక్నాలజీ, కొత్త ప్రాంతాల్లో విస్తరణతో పాటూ ప్రధాన నగరాల్లో మార్కెట్‌ వాటాను పెంచేందుకు ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొంది. తాజా నిధుల సమీకరణతో జొమాటోలో ప్రధాన వాటాదారు ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా) వాటా 25.13 శాతానికి తగ్గింది. గతేడాది మార్చిలో ఇది 26.38 శాతంగా ఉంది. 



You may be interested

టాటాలకు సుప్రీం ఊరట

Saturday 11th January 2020

ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీ పునర్‌నియామకపు ఉత్తర్వుపై స్టే న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్‌నియమించాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ( నేషనల్‌ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌) ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వ్యులను పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసును మరోరోజు పూర్తిస్థాయిలో విచారణకు చేపట్టనున్నట్లు తెలిపింది.  ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌,

ఎయిర్‌టెల్‌ నుంచి వై-ఫై కాలింగ్‌ సేవలు

Saturday 11th January 2020

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌.. దేశవ్యాప్తంగా వై-ఫై కాలింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు శుక్రవారం ప్రకటించింది. నూతన సేవల ఆధారంగా ఇతర వై-ఫై నెట్‌వర్క్‌లను కూడా వినియోగించుకుని కాల్స్‌ చేయవచ్చని, దీంతో పాటు ఇళ్లల్లో లేదా ఆఫీసుల్లో కాల్స్‌ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్‌టీఈ నుంచి వై-ఫైకి మారవచ్చని వివరించింది. ఇందుకు కస్టమర్ల నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదని స్పష్టంచేసింది. పైలెట్‌ ప్రొజెక్ట్‌ కింద

Most from this category