News


జొమాటో చేతికి ఉబెర్‌ఈట్స్‌..!

Tuesday 26th November 2019
news_main1574742496.png-29859

  • డీల్‌ విలువ 500 మిలియన్‌ డాలర్లు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ రెస్టారెంట్ యాగ్రిగేటర్‌, ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటో.. ఇదే రంగంలోని మరో ప్రముఖ సంస్థ ఉబెర్‌ఈట్స్‌ను కైవసం చేసుకునే దిశగా పావులుకదుపుతోంది. ఉబెర్‌ఈట్స్‌ను సొంతం చేసుకునేందుకు పలు కంపెనీల నుంచి పోటీ పెరిగిన నేపథ్యంలో తాజాగా ఈ సంస్థ 500 మిలియన్‌ డాలర్లను ఆస్క్‌ ప్రైస్‌గా కోట్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కాగా, జొమాటో ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  జొమాటోలో చైనా చెల్లింపుల సంస్థ యాంట్ ఫైనాన్షియల్ పెట్టుబడులుఉన్నాయి. ‘షేర్ల జారీ మార్గంలో కొనుగోలు పూర్తిచేసేందుకు జొమాటో చర్చలు కొనసాగిస్తుంది. అయితే, ఎంత మొత్తం అనే విషయంలో కాస్త అటుఇటుగా ఉన్నప్పటికీ... చర్చల్లో పురోగతి ఉందని మాత్రం కచ్చితంగా చెప్పగలం’ అని ఈ డీల్‌తో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఉబెర్‌ఈట్స్‌ మాతృసంస్థ, ట్యాక్సీ యాగ్రిగేటర్‌ ఉబెర్... డీల్‌ పూర్తయిన తరువాత ఈ సంస్థలో 500–600 మిలియన్‌ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై తాము వ్యాఖ్యానించబోమని ఉబెర్‌ పేర్కొంది. ఇక మరో సంస్థ స్విగ్గీ కూడా ఉబెర్‌ఈట్స్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 

2020లో రూ.1,451 కోట్ల నష్టాలు
భారత్‌లో ఉబెర్‌ఈట్స్‌ 2020 అంచనా నష్టం రూ.1,451 కోట్ల వరకు ఉండవచ్చని ఉబెర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఈట్స్‌ కారణంగా ఐపీఓ లిస్టింగ్‌లో భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. లిస్టింగ్‌ ధర నుంచి 33 శాతం పతనమైంది. ఇక్కడి మార్కెట్‌లో 3వ స్థానంలో ఉన్న ఈ సంస్థను విక్రయించడం ద్వారా నష్టాల నుంచి బయటపడేందుకు ఉబెర్‌ ప్రయత్నిస్తోంది. 



You may be interested

టెలికం ప్యాకేజీపై కమిటీ రద్దు

Tuesday 26th November 2019

మారటోరియం నేపథ్యంలో కేంద్రం నిర్ణయం న్యూఢిల్లీ: స్పెక్ట్రం చార్జీలు చెల్లించడానికి కేంద్రం మారటోరియం రూపంలో వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో టెలికం రంగ సమస్యలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ (సీవోఎస్‌) రద్దయింది. టెలికం రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తీసుకోతగిన చర్యలపై పలు మార్లు సమావేశమైన సీవోఎస్‌ ఈ నెల తొలినాళ్లలో కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కమిటీ సిఫార్సుల మేరకే స్పెక్ట్రం యూసేజీ చార్జీల చెల్లింపుపై రెండేళ్ల

92 వేలకుపైగా వీఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Tuesday 26th November 2019

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ల్లో విశేష స్పందన న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) ఎంచుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 92,000 దాటిందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.  రెండు సంస్థల ఉద్యోగుల నుంచీ ఈ పథకం పట్ల విశేష స్పందన కనిపిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.  బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం

Most from this category