News


జొమాటో వీడియో స్ట్రీమింగ్‌ సేవలు

Saturday 14th September 2019
news_main1568436051.png-28368

  • ఈ నెల 16 నుంచి అందుబాటులోకి

న్యూఢిల్లీ: ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో వీడియో కంటెంట్‌ విభాగంలోకి అడుగుపెడుతోంది. ఈ నెల 16 నుంచి వీడియో స్ట్రీమింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. జొమాటో యాప్‌లో వీడియోస్‌ అనే ట్యాబ్‌ నుంచి వీటిని చూడొచ్చని తెలిపింది. 18 ఒరిజినల్‌ షోలను వచ్చే మూడు నెలల కాలంలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. షోలు అన్నీ కూడా ఆహారానికి సంబంధించినవేనని స్పష్టం చేసింది. 3-15 నిమిషాల వరకు వీడియోల నిడివి ఉంటుందని వివరించింది. ‘‘ఒరిజినల్‌ షోలపై ఇన్వెస్ట్‌ చేశాం. ఫిక‌్షన్‌, నాన్‌ ఫిక‌్షన్‌కు సంబంధించి భిన్నమైన షోలనూ రూపొందించేందుకు నిర్మాణ సంస్థను ప్రారంభించాం’’ అని జొమాటో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దుర్గా రఘునాథ్‌ తెలిపారు. హిందీ, ఇంగ్లిష్‌లో ఉండే ఈ షోలతో దేశంలోని అన్ని ప్రాంతాలను చేరుకుంటామన్నారు. 



You may be interested

అంచనా కంటే భారత జీడీపీ వృద్ధి మరింత బలహీనం

Saturday 14th September 2019

ఐఎంఎఫ్ ప్రకటన వాషింగ్టన్‌: అంచనా వేసిన దానికంటే భారత జీడీపీ వృద్ధి రేటు మరింత బలహీనంగానే ఉండే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రకటించింది. కార్పొరేట్‌, పర్యావరణ నియంత్రణ సంబంధిత అనిశ్చితులు, కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల్లో దీర్ఘకాలం పాటు బలహీనతలే తన తాజా అంచనాలకు కారణాలుగా ఐఎంఎఫ్‌ పేర్కొంది. దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. 2013 మార్చి తర్వాత ఇది ఆరేళ్ల

విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ ఓకే

Saturday 14th September 2019

ఆమోదం తెలిపిన డైరెక్టర్ల బోర్డ్‌  హైదరాబాద్‌: యూనియన్‌ బ్యాంక్‌లో విలీనానికి ఆంధ్రా బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఆంధ్రా బ్యాంక్‌ వెల్లడించింది. యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌తో పాటు కార్పొరేషన్‌ బ్యాంక్‌ కూడా విలీనమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ రెండు బ్యాంక్‌లను విలీనం చేసుకోవడానికి ఇటీవలనే యూనియన్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌  కూడా ఆమోదం

Most from this category