News


జొమాటో సొంతమైన ఉబెర్‌ ఈట్స్‌

Tuesday 21st January 2020
news_main1579604569.png-31078


జొమాటో చేతికి ఉబెర్‌ ఈట్స్‌!
గురుగావ్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో.. ఉబెర్‌ ఈట్స్‌ను సొంతం చేసుకుంది. ఉబెర్‌ టెక్నాలజీస్‌కు చెందిన ఇండియన్‌ ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌ను ఉబర్‌... జొమాటోకు  విక్రయించింది. ఈ ఒప్పందంలో భాగంగా జొమాటో కంపెనీ10 శాతం వాటాను ఉబర్‌కి ఇచ్చింది. ఈ ఒప్పందం విలువ 350 మిలియన్‌ డాలర్లు(రూ.దాదాపు 2,485 కోట్లు)గా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉబెర్‌ ఈట్స్‌ తన కార్యకలాపాలను నిలిపివేసింది. మంగళవారం(జనవరి 21) ఉదయం 7 గంటల నుంచి ఉబెర్‌ ఈట్స్‌ కస్టమర్‌లు అందరూ జొమాటోకి బదిలీ అయ్యారు.ఫుడ్‌ డెలివరీ వ్యాపారంలో దేశవ్యాప్తంగా 500 నగరాల్లో విస్తరించామని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉందని,  ఈ ఒప్పందంతో మా వ్యాపారం మరింత వృద్ధిలోకి వస్తుందని జొమాటో వ్యవస్థాపకులు దీపిందర్‌ గోయల్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో వెల్లడించారు. కాగా ఈ ఒప్పందంపై ఉబెర్‌ ఈట్స్‌ స్పందిస్తూ ఇంతకాలం ఉబెర్‌ ఈట్స్‌ను ఆదరించిన తమ కస్టమర్‌లందరూ ఇక నుంచి జొమాటోలో మరిన్ని ఎక్సైటింగ్‌ ఆఫర్‌లతో ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తారని పేర్కొంది. 


 



You may be interested

నిలిచిన ఎయిర్‌టెల్‌ డిజిటల్‌, డిష్‌టీవీ విలీనం!

Tuesday 21st January 2020

డిష్‌టీవీని విలీనం చేసుకోవడం ద్వారా దేశంలో అగ్రగామి డీటూహెచ్‌ కంపెనీగా అవతరించాలన్న ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ ప్రయత్నాలకు తాత్కాలిక విఘాతం ఏర్పడింది. డీల్‌ విషయమై ఈ రెండు సంస్థల మధ్య అంగీకారం కుదరకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. మొబైల్‌ ఫోన్‌ సేవల మార్కెట్లో రిలయన్స్‌ జియో విప్లవం సృష్టించిన విషయం తెలిసిందే. కేబుల్‌ టీవీ, బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్లోనూ దూసుకుపోయేందుకు ఈ సంస్థ పెద్ద ప్రణాళికలతో అడుగులు వేస్తోంది. ఇందులో

ఐఎంఎఫ్‌ ఎఫెక్ట్‌...12,200 దిగువన నిఫ్టీ ముగింపు

Tuesday 21st January 2020

సెన్సెక్స్‌ 205 పాయింట్లు డౌన్‌ 55 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. వర్ధమాన దేశాలలో ఇండియా ఆర్థిక వృద్ధి మరింత నీరసించనున్నట్లు తాజా అంచనాలలో పేర్కొంది. దీంతో ప్రపంచ వృద్ధి ప్రభావితం కానున్నట్లు అంచనా వేసింది. ఈ ప్రభావంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. ఫలితంగా రోజంతా దాదాపు నష్టాల మధ్యే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ప్రస్తావించగ్గ

Most from this category